Begin typing your search above and press return to search.
రజనీకాంత్ కు భారతరత్న!
By: Tupaki Desk | 28 July 2016 6:35 AM GMTసూపర్ స్టార్ రజనీ తాజా చిత్రం ‘కబాలి’.. భారీ అంచనాలతో విడుదలై దేశం మొత్తాన్నే కాదు ప్రపంచం మొత్తాన్ని రజనీ మేనియాలో పడేసింది. ఈ సినిమాతో దేశమొత్తం ప్రస్తుతం రజనీ నామస్మరణలో మునిగిపోయిందనే చెప్పుకోవాలి. ఫస్ట్ లుక్క్ విడుదలయినప్పటి నుండీ భారీ అంచనాలతో విడుదలయిన ఈ సినిమాకు రివ్యూలు మాత్రం కాస్త నెగిటివ్ గా వచ్చినా కలెక్షన్ల విషయంలో రజనీ స్టామినాకు తగ్గట్లుగానే కాసులవర్షం భారీగా కురుస్తుంది. దీంతో తలైవా స్టామినా మరోసారి రుజువైంది.
కాసేపు కబాలి సినిమా సంగతి అలా ఉంచితే... తాజాగా రజనీకాంత్ కు సంబందించిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది. దేశంలో అత్యున్నత పౌర పురస్కారమైన "భారతరత్న" ను రజనీకాంత్ కు ఇవ్వాలనేది ఆ వార్త సారాంశం. మహారాష్ట్ర బీజేపీ ఎమ్మెల్యే అనిల్ గోటే ఈ ప్రతిపాదనను తెరపైకి తెచ్చారు. అధికారపార్టీలో ఉన్న ఎమ్మెల్యే ఈ ప్రతిపాధన చేసే సరికి దీనికి మరింత ప్రాధాన్యం పెరిగింది.
ముందుగా మహారాష్ట్ర ప్రభుత్వం ప్రకటించే అత్యున్నత పురస్కారం "మహారాష్ట్ర భూషణ్"ను రజనీకి ఇవ్వాలని మహారాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించిన అనీల్.. ఇదే క్రమంలో ‘భారత రత్న’ కూడా ఇవ్వాలని కోరారు. ఈ కోరిక కేవలం పత్రికా ప్రకటనలకు పరిమితం కాకుండా.. కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ అసెంబ్లీలో తీర్మానం కూడా చేయాలని ఆయన డిమాండ్ చేయడం సంచలనమైంది. అయితే రజనీ కి వ్యతిరేకంగా మాట్లాడే సాహసం ముఖ్యంగా ఏ పార్టీ రాజకీయ నాయకులైనా చేయరు అనేది వాస్తవమే కాబట్టి... ఈ తీర్మానం ఆమోదం పొంది కేంద్రానికి చేరితే.. రజనీకి భారతరత్న రావొచ్చనేది అభిమానుల ఆశ!