Begin typing your search above and press return to search.
సుశాంత్ సూసైడ్ పై బీజేపీ నజర్..బాలీవుడ్ ను షేక్ చేయబోతున్నారా?
By: Tupaki Desk | 11 July 2020 2:30 AM GMTబాలీవుడ్ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం వెనుక బాలీవుడ్ మాఫియా ఉందని.. వారే బ్యాక్ గ్రౌండ్ లేని సుశాంత్ ను తొక్కేశారని ఎన్నో ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. బాలీవుడ్ లోని అగ్ర నిర్మాతలు, దర్శకులపై తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే సుశాంత్ ఆత్మహత్యపై సీబీఐ విచారణ జరిపించాలని బీజేపీ ఎంపీ, మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి డిమాండ్ చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో ట్వీట్ చేసి సంచలనం సృష్టించారు.
సుశాంత్ కేసు సీబీఐ విచారణకు ఇవ్వాలో లేదో కనుక్కోవాలంటూ న్యాయవాది, రాజకీయ విశ్లేషకుడు ఇష్కారణ్ సింగ్ భండారీకి సుబ్రహ్మణ్య స్వామి సూచించారు. ఈ కేసులో పోలీసుల వెర్షన్ కూడా సరైనదా? కాదా అన్న కోణంలో పరిశీలించాలని కోరారు. దీన్ని బట్టి ఆయన సుప్రీం కోర్టుకు ఎక్కబోతున్నాడని అర్థమవుతోంది.
ఇక బీజేపీ ఎంపీ రూపా గంగూలీ, రచయిత తుహీన్ సిన్హా, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీతోపాటు పలువురు సైతం సుశాంత్ కేసు సీబీఐకి అప్పగించాలని ఇప్పటికే కోరారు. ఇప్పుడు సుబ్రహ్మణ్యస్వామి కూడా కోరడం.. సుప్రీంలో పిటీషన్ వేసేందుకు సిద్ధమవుతున్నారనే వార్త బయటకు రావడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరుగుతోంది. దీన్ని బీజేపీ టేకప్ చేసిందని తెలుస్తోంది.
ఇక సుబ్రహ్మణ్యస్వామి సూచనతో భండారీ రంగంలోకి దిగారు. సుశాంత్ కేసుకు సంబంధించి సాక్ష్యాదారాలు ఉంటే తమకు పంపాలని ఆయన కోరడం బాలీవుడ్ లో చర్చనీయాంశమైంది.
దీంతో బీజేపీ సర్కార్ సుశాంత్ కేసును సీబీఐకి అప్పగించి బాలీవుడ్ మాఫియా పీఠాలు కదల్చబోతోందనే ప్రచారం మొదలైంది.