Begin typing your search above and press return to search.
వారం ముందే సర్దార్ బ్లాక్ మార్కెట్
By: Tupaki Desk | 3 April 2016 5:30 PM GMTపవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మూవీ సర్దార్ గబ్బర్ సింగ్ ఈ నెల 8న థియేటర్లలోకి వస్తోంది. ఉగాది పండుగనాడు అంటే సెలవు రోజున విడుదల కానుండడంతో.. ఇప్పటికే సర్దార్ టికెట్స్ విపరీతమైన డిమాండ్ నెలకొంది.
సర్దార్ మూవీకి దాదాపు 10 రోజుల ముందే సెన్సార్ కంప్లీట్ చేసేసి, యూ/ఏ సర్టిఫెకెట్ తెచ్చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం అడ్వాన్స్ బుకింగ్ ల కోసమే. పవన్ మూవీకి ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్ స్టార్ట్ అయిపోయింది. మొదటి రోజు షోస్ అయితే.. ఇప్పటికే ఫుల్ అయిపోయాయి కూడా. అయితే ఆన్ లైన్ లో టికెట్స్ ముందుగానే కొనుగోలు చేసేసి.. బ్లాక్ మార్కెట్ చేసేస్తున్న భాగోతం కూడా బయటకు వస్తోంది.
ఆన్ లైన్ లో టికెట్ కొనడం, దానితో థియేటర్ దగ్గర ప్రింట్ తీసుకోవడం.. బయట అమ్మేసుకోవడం.. ఇదీ సర్దార్ గబ్బర్ సింగ్ బ్లాక్ మార్కెటింగ్ వ్యవహారం. ఒక్కో టికెట్ ను వెయ్యి రూపాయల వరకూ అమ్మేస్తున్నారంటే డిమాండ్ ఏ రేంజ్ లో ఉందో అర్ధమవుతుంద. ఫస్ట్ డేకి.. అందులోనూ నూన్ షోకి మాత్రం క్రేజ్ విపరీతంగా ఉంది. సిటీల్లో ప్రధానంగా హైద్రాబాద్ లో ఈ బ్లాక్ మార్కెట్ రచ్చ బాగా ఎక్కువగా కనిపిస్తోంది. మరి రిలీజ్ రోజున పవర్ స్టార్ చూపించబోయే పవర్ ఏ రేంజ్ లో ఉండనుందో అని ఫ్యాన్స్ తెగ హుషారుగా ఉన్నారు.