Begin typing your search above and press return to search.
సంపత్ నంది ‘బ్లాక్ రోజ్’ వచ్చేసింది
By: Tupaki Desk | 19 Aug 2020 5:00 PM GMTప్రముఖ దర్శకుడు సంపత్ నంది పర్యవేక్షణలో రూపొందబోతున్న చిత్రం ‘బ్లాక్ రోజ్’. షూటింగ్ రెండు రోజుల క్రితం ప్రారంభం అయిన విషయం తెల్సిందే. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఊర్వసి రౌతల ఈ చిత్రంలో నటించబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటన వచ్చింది. సినిమా పూజా కార్యక్రమాలకు ఆమె రావాల్సి ఉండగా కొన్ని కారణాల వల్ల రాలేదు. నేడు సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం అయ్యింది. ఆమె ముంబయి నుండి హైదరాబాద్ చేరుకుంది. షూటింగ్ ప్రారంభిస్తున్నట్లుగా సంపత్ నంది ప్రకటించాడు.
ఈ సినిమాకు దర్శకత్వం మోహన్ భరద్వాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లుగా చెబుతున్నారు. కాని ఊర్వసి రౌతల మాత్రం నా దర్శకుడు సంపత్ నంది స్క్రిప్ట్ ను బాగా చెప్పారంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. సింగిల్ షెడ్యూల్ లోనే సినిమాను పూర్తి చేసి త్వరలోనే ఓటీటీలో ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తున్నారు. బ్లాక్ రోజ్ ఊర్వసి ఈ సినిమా కోసం హైదరాబాద్ రావడం జరిగింది. చిత్ర యూనిట్ సభ్యులు అంతా కూడా షూటింగ్ కు వెళ్లే ముందు కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకున్నారు. అంతా ఓకే అనుకున్న తర్వాత షూటింగ్ కు వెళ్తున్నట్లుగా తెలుస్తోంది.
ఈ సినిమాను ప్రస్తుతం గోపీచంద్ హీరోగా తెరకెక్కుతున్న సీటీ మార్ చిత్రంను నిర్మిస్తున్న నిర్మాతలు శ్రీను మరియు పవన్ లు నిర్మిస్తున్నారు. సీటీమార్ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా నిలిచి పోయింది. కనుక ఈ గ్యాప్ లో అదే టీం ఈ బ్లాక్ రోజ్ ను దించుతున్నారు. ఈ ఏడాదిలోనే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారు.