Begin typing your search above and press return to search.

బ్లాక్ టికెటింగ్ దందా ఆగే సీన్ లేదా?

By:  Tupaki Desk   |   21 Dec 2021 6:30 AM GMT
బ్లాక్ టికెటింగ్ దందా ఆగే సీన్ లేదా?
X
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం సినిమా టిక్కెట్టు విష‌యంలో ఎక్క‌డా త‌గ్గ‌డం లేదు. స‌వ‌రించిన ధ‌ర‌ల్ని పున‌రుద్ధ‌రించాల్సిందిగా కోర్టు తీర్పు వెలువ‌రించినా కానీ ఇంకా దానిపై స్ప‌ష్ఠ‌త లేదు. ఇటీవ‌లే ప్ర‌భుత్వ‌మే ఐ.ఆర్.సీ.టీ.సీ త‌ర‌హాలో ఒక వెబ్ సైట్ ని ర‌న్ చేస్తుంద‌ని అందులో టిక్కెట్లు కొనుక్కోవాల్సి ఉంటుంద‌ని జీవోని కూడా విడుదల చేసింది. దీనివ‌ల్ల ప్ర‌జ‌ల‌కు బ్లాక్ మార్కెట్లో టికెట్లు కొనుక్కోవాల్సిన అవ‌స‌రం ఉండ‌ద‌నేది ప్ర‌భుత్వ వాద‌న‌. టిక్కెట్టుపై ప‌న్ను స‌జావుగా ప్ర‌భుత్వ ఖ‌జానాకు చేరుతుంద‌ని ప్ర‌జ‌ల‌పై బ్లాక్ మార్కెట్ దోపిడీ ఉండ‌ద‌ని ప్ర‌భుత్వం బ‌లంగా వాదిస్తోంది.

అంతా బాగానే ఉంది కానీ.. ఇటీవ‌ల ఏపీలోని ఏ సినిమా థియేట‌ర్ వ‌ద్ద చూసినా గేట్ బ‌య‌ట య‌థేచ్ఛ‌గా బ్లాక్ టికెటింగ్ దందా సాగుతోంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఒక‌ప్ప‌టితో పోలిస్తే ఈ దందా మ‌రింత పెరిగిందే కానీ త‌గ్గ‌లేదు. అస‌లు బ్లాక్ మార్కెటింగ్ చేయించేదే థియేట‌ర్ య‌జ‌మాని - పంపిణీదారు టై అప్ అయ్యి అన్న టాక్ కూడా ఉంది. ఈ బ్లాక్ దందాపై ప్ర‌భుత్వాల‌కు స‌మాచారం ఉన్నా కానీ.. గ‌తంలో ప‌ట్టించుకునేవి కావు. ఇప్పుడు జ‌గ‌న్ ప్ర‌భుత్వం సినీప‌రిశ్ర‌మ వ్య‌వ‌హారాల‌పై సీరియ‌స్ గా ఉండ‌డంతో ప్ర‌తిదీ ర‌చ్చ‌గా మారింది. బ్లాక్ మార్కెటింగ్ దందాపై సీఎం ఉక్కు పాదం మోప‌డ‌మే గాక .. ప‌న్ను వ‌సూళ్ల‌ ల‌క్ష్యం దిశ‌గా ప్ర‌తిదీ ప్లాన్ చేయ‌డంతో ఇండ‌స్ట్రీ పూర్తిగా ఇబ్బందుల్లోకి వెళ్లింది.

అయితే ఇటీవ‌ల‌ బ్లాక్ మార్కెటింగ్ పెరిగిందే కానీ.. త‌గ్గ‌డం లేదు. ఇటీవ‌ల విడుద‌లైన ల‌వ్ స్టోరి.. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిల‌ర్ .. అఖండ వంటి చిత్రాల‌కు ఏపీలోని ప్ర‌తి థియేట‌ర్ బ‌య‌ట బ్లాక్ లో టికెట్లు అమ్మారు. ఒక్కో టికెట్ ధ‌ర 300-500 మ‌ధ్య బ్లాక్ లో అమ్మ‌కాలు సాగించారు. అఖండ విష‌యంలో బ్లాక్ టికెటింగ్ అసాధార‌ణంగా ఉంద‌ని టాక్ వ‌చ్చింది. పుష్ప చిత్రానికి అంత‌కుమించి బ్లాక్ టికెటింగ్ దందా సాగింది. థియేట‌ర్ల‌లో అమ్మే టికెట్ ధ‌ర‌లు గిట్టుబాటు గాక మ‌రింత‌గా బ్లాక్ దందా పెంచారే కానీ త‌గ్గించ‌లేదు. ఆన్ లైన్ లో టికెటింగ్ చాలా ప‌రిమితం. థియేట‌ర్లో టికెట్ల అమ్మ‌కాలే లేవు. చివ‌రికి బ్లాక్ లో కొనుక్కోవాల్సిన పరిస్థితి త‌ప్ప‌నిస‌రి అయ్యింది. కానీ ఈ ప‌రిస్థితిని మార్చేసేందుకు ప్ర‌భుత్వ పోర్ట‌ల్ ఏ మేర‌కు సాయ‌మ‌వుతుందో చూడాలి. భ‌విష్య‌త్ లో చాలా థియేట‌ర్ల ముందు సీన్ మార‌తుంద‌నే ఆశిస్తున్నారు.

ఇక‌పోతే బ్లాక్ టికెటింగ్ వ‌ల్ల నిర్మాత‌కు కానీ బ‌య్య‌రుకు కానీ క‌లిసొచ్చేదేమీ ఉండ‌దు. ఆ కోణంలో ఆలోచించి ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌తిపాద‌న‌కు చాలా మంది నిర్మాత‌లు స‌హ‌క‌రిస్తున్నార‌న్న గుస‌గుస ఇన్ సైడ్ వినిపిస్తోంది. మార్కెట్ పై ప‌ట్టు లేని చాలా మంది నిర్మాత‌ల‌కు జ‌గ‌న్ తీసుకున్న నిర్ణ‌య‌మే స‌రైన‌ద‌ని అనిపిస్తోంది. త‌మ సినిమాకి ఎన్ని టికెట్లు తెగుతున్నాయో తెలుసుకోలేని ధైన్యం ఎగ్జిబిష‌న్ వ్య‌వ‌స్థ‌లో ఉంద‌న్న టాక్ ఉంది. దీనిపై చాలా కోణాల్లో విశ్లేష‌ణ‌లు ఇంత‌కుముందు సాగాయి.