Begin typing your search above and press return to search.

సెలబ్రెటీలు తాగే ‘బ్లాక్ వాటర్’ గురించి మీకు తెలుసా?

By:  Tupaki Desk   |   21 Aug 2021 10:38 AM GMT
సెలబ్రెటీలు తాగే ‘బ్లాక్ వాటర్’ గురించి మీకు తెలుసా?
X
మినరల్ వాటర్, ఉప్పు నీళ్లు, మంచి నీళ్లు ఇలా రెండు మూడు రకాల గురించి మనకు తెలుసు. కానీ ఇప్పుడు మార్కెట్లోకి ‘బ్లాక్ వాటర్’ వచ్చేసింది. ఈ మధ్యకాలంలో ఎక్కువగా బ్లాక్ వాటర్ గురించే వినిపిస్తోంది. సెలబ్రెటీలు ఈ వాటర్ తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు.

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కూడా ఈ బ్లాక్ వాటర్ నే తెప్పించుకొని తాగుతున్నాడు. తాజాగా బాలీవుడ్ నటి మలైకా అరోరా సైతం ఈ బ్లాక్ వాటర్ నే తాగుతోంది. ఈ విషయం తెలియడంతో సోషల్ మీడియాలో బ్లాక్ వాటర్ గురించి పెద్ద చర్చే సాగుతోంది.

నిన్న మొన్నటివరకు సెలబ్రెటీలు చాలా మంది ఎన్నో రకాల వాటర్ లు తాగుతారని తెలుసు. కానీ అది బ్లాక్ వాటర్ అని తాజాగా తెలిసింది. ఈ బ్లాక్ వాటర్ లీటర్ కు రూ.100 పైనే ఉంటుందట.. సాధారణంగా మనం తాగే మినరల్ వాటర్ ఖరీదు ఒక లీటర్ కు రూ.20 నుంచి రూ.30 మధ్యలో ఉంటుంది. కానీ దానికి నాలుగింతలు ధరతో బ్లాక్ వాటర్ లభిస్తుంది. ఇంత రేటున్న ఇందులో అసలేముంటుందన్న సందేహం అందరిలోనూ ఉంటుంది.

ఈ బ్లాక్ వాటర్ తో అన్ని లభాలు ఉంటాయని.. ఇందులో 70 మినరల్స్ ఉంటాయని చెబుతున్నారు. ఇది జీర్ణశక్తిని పెంపొందిస్తుంది. అలాగే ఎసిడీటీ ప్రాబ్లెం రాకుండా చూసుకుంటుంది. శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది. జీవక్రియను నియంత్రిస్తుంది. వీటన్నింటితోపాటు వయసు కనపడకుండా నిత్య యవ్వనంగా కనిపించేలా చేసే పోషకాలు ఈ బ్లాక్ వాటర్ లో ఉంటాయట.. అందుకే సెలబ్రెటీలు అంత ఖర్చు పెట్టి మరీ ఈ నీటిని తాగుతుంటారని తెలిసింది.

దేశంలోని ప్రముఖులైన విరాట్ కోహ్లీ, మలైకా అరోరానే కాదు.. సౌత్ ఇండియన్ హీరోయిన్ శృతి హాసన్ కూడా ఈ బ్లాక్ వాటర్ తాగుతుందని చెబుతున్నారు.