Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌ః భార్య మోసం చేస్తే ఎలా?

By:  Tupaki Desk   |   22 Feb 2018 1:02 PM GMT
ట్రైలర్ టాక్‌ః భార్య మోసం చేస్తే ఎలా?
X
ది లంచ్ బాక్స్, హిందీ మీడియం లాంటి కొత్త రకం కథలు తీయాలంటే అది బాలీవుడ్ నటుడు ఇర్ఫాన్ ఖాన్ వల్లనే అవుతుంది. ఆయన సినిమాలలో ఎంత కొత్తదనం ఉంటుందో అంతే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. అలాంటి విలక్షణ నటుడు ఇప్పుడు మళ్లీ ఒక కొత్త స్క్రిప్ట్ తో మన ముందుకు రాబోతున్నాడు.

ఇర్ఫాన్ ఖాన్ హీరో గా అభినయ్ డియో దర్శకత్వంలో బ్లాక్ మెయిల్ అనే ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం తాలూకు ట్రైలర్ ను ఇవాళే విడుదల చేయాక్సన్ జరిగింది. ట్రైలర్ ఓపెన్ అవడమే భార్య వివాహేతర సంబంధం పెట్టుకుంటే ఎలా ఉంటుంది అంటూ ఒక కుతూహలన్ని పెంచాడు ఇర్ఫాన్. ట్రైలర్ ను బట్టి అర్థమైన సినిమా సారాంశం ఏమిటయ్యా అంటే భార్య మరో అబ్బాయితో సన్నిహితంగా ఉండటం చూసి తట్టుకోలేకపోయిన ఇర్ఫాన్ ఖాన్ ఇద్దరిలో ఎవరిని చంపాలి అంటూ స్నేహితుడు తో చర్చించి బ్లాక్ మెయిల్ చేయదలుస్తాడు. అలా భార్య ఫోటోలు భార్యకే పంపి. బెదిరిస్తూ ఉంటాడు. కానీ కథలో ట్విస్ట్ ఎక్కడొస్తుంది అంటే ఇవన్నీ తెలుసుకున్న ఇర్ఫాన్ కొలీగ్ ఒక అమ్మాయి రివర్స్ లో ఇర్ఫాన్ నే బ్లాక్ మెయిల్ చేస్తూ ఉంటుంది. ఇలా చివరకు ఎవరు గెలిచారు అన్నది మాత్రం సినిమా విడుదల అనగా ఏప్రిల్ 6న మాత్రమే తెలుస్తుంది.

ఇందులో కీర్తి కుల్హారి హీరోయిన్ గా నటిస్తుండగా టి-సిరీస్ మరియు ఆర్.డి.పి మోషన్ పిక్చర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఢిల్లీ బెల్లీ ఫేమ్ దర్శకుడు అభినయ్ ఈ సినిమాను డైరెక్ట్ చేయడం విశేషం. ఇర్ఫాన్‌ ఖాన్‌ తెలుగులో వచ్చిన ‘సైనికుడు’ సినిమాలో విలన్‌ గా నటించారు. టాలీవుడ్‌ - బాలీవుడ్‌ లోనే కాకుండా హాలీవుడ్‌ చిత్రాల్లోనూ ఇర్ఫాన్‌ నటించారు.