Begin typing your search above and press return to search.
బ్లాండ్ ట్రైలర్: మర్లిన్ మన్రో తెరవెనక జీవితం
By: Tupaki Desk | 29 July 2022 4:40 AM GMTతెరపై కనిపించే కథానాయిక వేరు.. తెర వెనక కనిపించే కథానాయిక వేరు! తెరపై ఎంత అందంగా కనిపించినా తెరవెనక అంత అందంగా నటిస్తూ కనిపించే వారే ఎక్కువ! ఎన్నో హృద్యమైన కథలు రంగుల ప్రపంచంలో ఉన్నాయి. రంగుల (గ్లామర్) ప్రపంచంలో గొప్ప ధృవతారలుగా వెలిగిపోయిన ఎందరో నటీమణులు వ్యక్తిగత జీవితంలో ఎన్నో వెతలను ఎదుర్కొన్నారు. పర్సనల్ లైఫ్ ఎన్నో ఎమోషన్స్ తో రహస్యాలతోనే కొనసాగిన వైనం ప్రజలకు తెలుస్తుంటుంది.
వ్యక్తిగత జీవితం కుటుంబ జీవితం కడు ధైన్యంగా సాగిన పాపులర్ స్టార్ల గురించి ప్రజలు కథలు కథలుగా చెప్పుకున్న సందర్భాలున్నాయి. ఇక క్లాసిక్ డేస్ నటి సావిత్రి వ్యక్తిగత జీవితంలో ట్రాజెడీ గురించి.. అందాల నటీమణులు దివ్యభారతి.. జియా ఖాన్..ప్రత్యూష సూసైడ్ మిస్టరీస్ గురించి తెలిసినదే.
అంతకుమించిన ఎమోషనల్ స్టోరి ప్రఖ్యాత హాలీవుడ్ కథానాయిక మార్లిన్ మన్రో జీవితంలో ఉంది. నిజానికి మార్లిన్ మన్రో పేరు పరిచయం అవసరం లేదు. నటిగా మోడల్ గా రాణించిన మార్లిన్ హాలీవుడ్ లో గొప్ప కథానాయికలలో ఒకరిగా వెలిగారు. 50లలో అగ్ర నాయికగా మేటి క్లాసిక్ చిత్రాల్లో నటించారు.
కథానాయికగా అద్భుత ఆదరణ దక్కించుకున్న మార్లిన్ వ్యక్తిగత జీవితంలో వివాదాలతోనూ నిరంతరం మీడయా హెడ్ లైన్స్ లో నిలిచేవారు. నిజానికి ఈ వివాదాలు తనను తీవ్ర నిస్పృహలోకి నెట్టేశాయన్న ప్రచారం ఉంది. చివరికి తన మరణం కూడా ఒక మిస్టరీనే. కాప్ దీనిని ఆత్మహత్యగా నిర్ధారించినా అది ఎప్పటికీ సీక్రెట్ డెత్ గానే మిగిలిపోయింది. అందుకే మార్లిన్ మన్రో జీవితకథతో బ్లాండ్ అనే సినిమా తెరకెక్కుతోంది అనగానే అందరిలో ఒకటే ఉత్కంఠ. ఎప్పుడు చూడాలా అన్న ఆసక్తి.
బ్లాండ్ లో స్పానిష్ నటి అనా డి అర్మాస్ మార్లిన్ పాత్రలో నటిస్తోంది. ఈ చిత్రం ట్రైలర్ తాజాగా విడుదలైంది. ట్రైలర్ ఆద్యంతం మార్లిన్ జీవితంలోని ఎమోషన్స్.. గ్లామరస్ నాయికగా అసాధారణ స్టార్ డమ్ వెనక కఠోర నిజాల్ని ఎలివేట్ చేసిన తీరు ఆకట్టుకుంది.
ఒక అగ్ర కథానాయిక అంతర్మథనానికి సంబంధించిన కథ ఇది. బయటకు కనిపించని లోపలి యుద్ధం గురించిన అద్భుతమైన కథనం స్క్రీన్ ఆద్యంతం రంజింపజేయనుంది. జీవితం అనే ఆటలో ఎంతో అలసిపోయిన మార్లిన్ స్టోరీని ఇది ఆవిష్కరిస్తుంది.
జాయిస్ కరోల్ ఓట్స్ రాసిన నవల నుండి స్ఫూర్తి పొంది ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఆండ్రూ డొమినిక్ దర్శకత్వం వహించిన 'బ్లాండ్' సెప్టెంబర్ 28 నుంచి నెట్ ఫ్లిక్స్ లో అందుబాటులో ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న మార్లిన్ అభిమానులకు ఈ మూవీ ఒక స్పెషల్ ట్రీట్ గా ఉంటుందనడంలో సందేహం లేదు.