Begin typing your search above and press return to search.
ఆహా లోకి వచ్చిన బ్లాక్ బస్టర్ 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'
By: Tupaki Desk | 19 Nov 2021 5:54 AM GMT100 శాతం తెలుగు ఓటీటీ ప్లాట్ ఫార్మ్ 'ఆహా'.. ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ని అప్లోడ్ చేస్తూ వీక్షకులకు అసలు సిసలైన వినోదాన్ని పరిచయం చేస్తోంది. కొత్త సినిమాలను నేరుగా ఓటీటీలో రిలీజ్ చేయడమే కాకుండా.. బ్లాక్ బస్టర్ సినిమాలు - ఒరిజినల్ వెబ్ సిరీసులు - అదిరిపోయే గేమ్ షోలు - ఆకట్టుకునే టాక్ షోలను అందిస్తోంది.
విజయవంతంగా 20 నెలలు పూర్తి చేసుకొని ఇప్పుడు సరికొత్త ఫీచర్స్ తో 'ఆహా 2.0' గా అవతరించింది. ఈ క్రమంలో రెట్టింపు వినోదాన్ని అందించడానికి సిద్ధమైన 'ఆహా'.. తాజాగా బ్లాక్ బస్టర్ ''మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'' చిత్రాన్ని స్ట్రీమింగ్ కు పెట్టింది.
అఖిల్ అక్కినేని - పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కించిన చిత్రం 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు - వాసు వర్మ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించారు. దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అశేష ప్రేక్షకాదరణతో ఘనవిజయం సాధించింది.
50 కోట్లకు పైగా వసూళ్ళు రాబట్టి ఈ ఏడాది బిగ్గెస్ట్ హిట్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది. అలాంటి యూత్ ఫుల్ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఈరోజు శుక్రవారం ( నవంబర్ 19) నుంచి 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.
'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' సినిమా పెళ్లికి ముందు జీవితం.. పెళ్లి తర్వాత జీవితం ఎలా ఉండాలనే కాన్సెప్ట్ తో వినోదాత్మకంగా రూపొందింది. కథ విషయానికొస్తే.. మ్యారేజ్ లైఫ్ బాగుండాలంటే కెరీర్ బాగుండాలని నమ్మే వ్యక్తి హర్ష (అఖిల్ అక్కినేని).. మ్యారేజ్ లైఫ్ కోసం అమెరికాలో ముందే అన్నీ పక్కాగా సెట్ చేసుకుని పెట్టుకుంటాడు. తనపై తనకున్న నమ్మకంతో పెళ్లికి ముందే ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుని ఇండియాకు వచ్చిన హర్షకు, పెళ్లికూతురుని సెలెక్ట్ చేసుకోవడంలో డైలమాలో ఉంటాడు.
అలాంటి సమయంలో అతనికి జీవితాన్ని ఆస్వాదించే స్టాండప్ కమెడియన్ విభతో పరిచయం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ప్రేమ - అనుబంధాల గురించి అప్పటిదాకా హర్ష మనసులో ఉన్న అభిప్రాయాలు ఎలా మారాయి? హర్ష తెలుసుకున్న జీవిత సత్యమేంటి? చివరికి తాను అనుకున్నట్లుగా విభా ప్రేమని దక్కించుకున్నాడా లేదా? అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
ఆధునిక జీవితంలో చాలా మంది ఎదుర్కొంటున్న రిలేషన్షిప్ సమస్యను దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్ ఇందులో చాలా బాగా డీల్ చేశారు. అఖిల్ - పూజా హెగ్డే జంట అద్భుతమైన నటన కనబరిచారు. గోపీ సుందర్ అందించిన పాటలు ఈ సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. ప్రదీశ్ ఎమ్ వర్మ సినిమాటోగ్రఫీ అందించగా.. అవినాష్ కొల్లా ఆర్ట్ డైరెక్టర్ గా వర్క్ చేశారు. మార్తాండ్ కె. వెంకటేష్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు.
ఈ చిత్రంలో ఆమని - ఈషా రెబ్బా - నేహా శెట్టి - ఫారియా అబ్దుల్లా - మురళీ శర్మ - చిన్మయి - వెన్నెల కిషోర్ - జయప్రకాష్ - అజయ్ - ప్రగతి - అమిత్ తివారి - పోసాని కృష్ణ మురళి - శ్రీకాంత్ అయ్యంగార్ - అభయ్ - సుడిగాలి సుధీర్ - గెటప్ శీను వంటి భారీ తారాగణం నటించారు.
థియేటర్స్ లో సత్తా చాటిన 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఇప్పుడు 'ఆహా' ద్వారా డిజిటల్ మాధ్యమంలోకి వచ్చింది. ఇటీవల విడుదల చేసిన ఓటీటీ ట్రైలర్ కట్ కూడా ఆకట్టుకుంది. సినిమా హాళ్లలో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో నడిచిన ఈ సినిమా తెలుగు ఓటీటీలో ఎలాంటి వ్యూయర్ షిప్ తెచ్చుకుంటుందో చూడాలి.