Begin typing your search above and press return to search.

శివరాత్రికి సినిమాల జాతర

By:  Tupaki Desk   |   3 March 2019 4:28 AM GMT
శివరాత్రికి సినిమాల జాతర
X
మహాపర్వదినమైన శివరాత్రి జాగారంలోని ఉద్దేశం ఏదైనప్పటికీ సినిమా ప్రేమికులు మాత్రం ఆ సమయాన్ని పూర్తిగా థియేటర్ లో గడపడానికే ఇష్టపడతారు. కొత్తదా పాతదా సంబంధం లేకుండా నిద్ర పోకుండా మేలుకుని తమ భక్తిని చాటుకోవడానికి ఇంత కన్నా వేరే మార్గం లేదని వాళ్ళ అభిప్రాయం. అందులోనూ కిక్కిరిసిపోయిన హాల్ లో సాటి ఫ్యాన్స్ మధ్య ఆర్ద రాత్రి పూట ఈలలు గోల మధ్య తమ అభిమాన హీరో సినిమా చూస్తే ఆ కిక్కే వేరు. ఇది అన్ని నగరాలూ పట్టణాల్లో ఉన్నప్పటికీ హైదరాబాద్ ఆర్టిసి క్రాస్ రోడ్స్ మాత్రం తన ప్రత్యేకతను ఎప్పటికప్పుడు చాటుకుంటూనే ఉంటుంది.

ఈ సారి ప్రత్యేకంగా గత ఏడాది బ్లాక్ బస్టర్స్ నిలిచిన సినిమాలను అర్ధరాత్రి 12 నుంచి తెల్లవారుఝామున 6 గంటల దాకా షోలు వేసేందుకు ఇప్పటికే ఏర్పాట్లు జరిగిపోయాయి. ఆన్ లైన్ బుకింగ్ యాప్స్ లో అమ్మకాలు మొదలుపెట్టేసారు. తక్కువ వ్యవధిలోనే అల్మోస్ట్ బుకింగ్ ఫుల్ చూపించడం గమనార్హం. ఈ శివరాత్రికి సందడి చేయబోతున్న సినిమాల్లో రంగస్థలం-మహానటి-భరత్ అనే నేను-గీత గోవిందం-కెజిఎఫ్ లతో పాటు చిరంజీవి ఖైది నెంబర్ 150 స్పెషల్ షోల రూపంలో వేయబోతున్నారు. దేవదాస్ కూడా వీటిలో చోటు దక్కించుకుంది.

మరో ట్విస్ట్ ఏంటంటే అల్లు అర్జున్ దువ్వాడ జగన్నాధం కూడా ఈ లిస్టు లో ఉంది. మరికొన్ని ఇవాళ తేలిపోతాయి. ఇవి కాకుండా ఆన్ లైన్ లో టికెట్స్ అమ్మకుండా కరెంటు బుకింగ్ చేసుకునే సింగల్ స్క్రీన్స్ లో వేరే సినిమాలు చాలానే వేయబోతున్నారు. మొత్తానికి మూవీ లవర్స్ కి రాత్రి కునుకు లేకుండా ఉండేందుకు చాలా ఆప్షన్స్ ఉన్నాయి. క్రాస్ రోడ్స్ కు సాయంత్రం వెళ్ళిపోతే చాలు కొత్త సినిమాలు మొదలుకుని పాత బ్లాక్ బస్టర్స్ దాకా అన్ని పూర్తి చేసుకుని ఉదయాన్నే తాపీగా ఇంటికి చేరుకోవచ్చు.