Begin typing your search above and press return to search.

బాల‌కృష్ణ ఇంట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్స్‌

By:  Tupaki Desk   |   2 Jan 2022 3:30 AM GMT
బాల‌కృష్ణ ఇంట్లో బ్లాక్ బ‌స్ట‌ర్ ప్రొడ్యూస‌ర్స్‌
X
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ `లెజెండ్‌` త‌రువాత ఆ స్థాయి బ్లాక్ బ‌స్ట‌ర్ ని అందుకోవ‌డానికి దాదాపు ఏడేళ్లు ప‌ట్టింది. గ‌త ఏడాది చివ‌రలో చేసిన `అఖండ‌`తో అఖండ‌మైన విజ‌యాన్ని సొంతం చేసుకున్నారు. బాల‌య్య కెరీర్ లోనే ఈ మూవీ భారీ వ‌సూళ్ల‌ని సాధించిన చిత్రంగా నిలిచింది. 70 కోట్ల బ‌డ్జెట్ తో రూపొందిన ఈ మూవీ సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించి బాల‌య్య అఖండ గెట‌ప్ కు ప్ర‌శంస‌లు కురిపించింది.

సెకండ్ హాఫ్ లో వ‌చ్చే అఖండ రుద్ర సికంద‌ర్ గోరాగా బాల‌య్య ప‌లికించిన అభిన‌యం, గెట‌ప్ సినిమాకు ప్రధాన హైలైట్ గా నిలిచింది. అంతే కాకుండా ఈ పాత్ర‌ని త‌మ‌న్ అందించిన నేప‌థ్య సంగీతం మ‌రింత ఎలివేట్ చేసి `అఖండ‌` బాక్సాఫీస్ వ‌ద్ద దాదాపు 125 కోట్లు కొల్ల‌గొట్టేలా చేసింది. ఈ మూవీ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ కావ‌డంతో మ‌ళ్లీ రెట్టించిన ఉత్సాహంతో ట్రాక్ లోకి వ‌చ్చిన బాల‌య్య వెంట‌నే మ‌రో సినిమాకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేశారు.

మైత్రీ మూవీ మేక‌ర్స్ బ్యాన‌ర్ పై న‌వీన్ యెర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్ ఈ చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో నిర్మించ‌బోతున్నారు. `క్రాక్‌`తో ట్రాక్ లోకి వ‌చ్చిన గోపీచంద్ మ‌లినేని ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. శృతిహాస‌న్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ త్వ‌ర‌లో ప్రారంభం కాబోతోంది. ఈ నేప‌థ్యంలో చిత్ర నిర్మాత‌లు న‌వీన్ యెర్నేని, య‌ల‌మంచిలి ర‌విశంక‌ర్‌, ద‌ర్శ‌కుడు గోపీచంద్ మ‌లినేని హీరో బాల‌య్య‌ని న్యూ ఇయ‌ర్ సంద‌ర్భంగా ఆయ‌న నివాసంలో క‌లిశారు.

ఈ సంద‌ర్భంగా బొకే అందించి నూత‌న సంవ‌త్స‌ర శుభాకాంక్ష‌లు అంద‌జేశారు. దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట సంద‌డి చేస్తున్నాయి. ఈ ఏడాది ఈ కాంబినేష‌న్ లో మ‌రో బ్లాక్ బ‌స్ట‌ర్ మ‌న ముందుకు రాబోతోంద‌ని ఇప్ప‌టికే ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు అంటున్నాయి. వేట పాలెం ప‌రిస‌రాల్లో జ‌రిగిన కొన్ని య‌దార్థ సంఘ‌ట‌న‌ల ఆధారంగా ఈ మూవీని ప‌వ‌ర్ ప్యాక్డ్ హై వోల్టేజ్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ గా గోపీచంద్ మ‌లినేని తెర‌కెక్కించ‌బోతుతున్నార‌ట‌.