Begin typing your search above and press return to search.
మరో గంటలో 'ఆహా' లో స్ట్రీమింగ్ కాబోతున్న 'బ్లడీ మేరీ'..!
By: Tupaki Desk | 14 April 2022 5:31 PM GMTతెలుగు ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త కంటెంట్ ను అందిస్తూ డిజిటల్ వరల్డ్ లో దూసుకుపోతోంది తొలి తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ 'ఆహా'. బ్లాక్ బస్టర్ సినిమాలు - ఒరిజినల్ వెబ్ సిరీస్ లతో పాటుగా స్పెషల్ టాక్ షోలు - మ్యూజిక్ షోలతో ఆడియన్స్ కు అపరిమితమైన వినోదాన్ని అందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా ''బ్లడీ మేరీ'' అనే మరో ఆసక్తికరమైన ఒరిజినల్ ని వీక్షకులకు అందుబాటులోకి తీసుకొస్తోంది
నివేదా పేతురాజ్ ప్రధాన పాత్రలో ‘కార్తికేయ’ ఫేమ్ చందూ మొండేటి దర్శకత్వంలో ''బ్లడీ మేరీ'' సిరీస్ రూపొందింది. ఇన్నాళ్ళు సినిమాల్లో తన అందం అభినయంతో ప్రేక్షకుల్ని మెప్పించిన నివేదా.. ఈ సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. టాలెంటెడ్ డైరెక్టర్ చందు మొండేటికి కూడా ఇదే తొలి ఓటీటీ ప్రాజెక్ట్ కావడం గమనార్హం.
ఇప్పటికే విడుదలైన 'బ్లడీ మేరీ' ప్రచార చిత్రాలు - టీజర్ - ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుని సిరీస్ పై ఆసక్తిని రెట్టింపు చేసాయి. ఈరోజు అర్థరాత్రి నుంచి (ఏప్రిల్ 15) అంటే మరో గంటలో 'ఆహా వీడియో' ఓటీటీలో ఈ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ కాబోతోంది
మేరీ అనే యువతి తనలోని లోపాలను అధిగమించి, శత్రువులతో ఎలా పోరాడింది? తన ప్రియమైన వారిని ఎలా కాపాడుతుంది? అనే ఆసక్తికరమైన కథాంశంతో ''బ్లడీ మేరీ'' సిరీస్ ని రూపొందించినట్లు తెలుస్తోంది. ఇందులో నివేతా తో పాటుగా బ్రహ్మాజీ - కిరీటి - రాజ్ కుమార్ కసిరెడ్డి - అజయ్ తదితరులు కీలక పాత్రలు పోషించారు.
'బ్లడీ మేరీ' సిరీస్ ను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వ ప్రసాద్ నిర్మించారు. వివేక్ కూచిబొట్ల సహ నిర్మాతగా వ్యవహరించారు. ఎంఎం కీరవాణి తనయుడు కాల భైరవ సంగీతం సమకూర్చారు. కార్తీక్ ఘట్టమనేని సినిమాటోగ్రఫీ అందించగా.. విప్లవ్ ఎడిటింగ్ వర్క్ చేసారు.
ఇటీవల కాలంలో 'ఆహా' ఓటీటీలో స్ట్రీమింగ్ చేయబడిన ఒరిజినల్ సిరీస్ లు మంచి ఆదరణ దక్కించుకున్నాయి. ఈ క్రమంలో వస్తోన్న 'బ్లడీ మేరీ' ఎలాంటి వ్యూయర్ షిప్ సాధిస్తుందో చూడాలి.