Begin typing your search above and press return to search.

'బ్రహ్మాస్త్ర' చుట్టూ అల‌ముకుంటున్న నీలి నీడ‌లు..?

By:  Tupaki Desk   |   29 May 2021 10:30 AM GMT
బ్రహ్మాస్త్ర చుట్టూ అల‌ముకుంటున్న నీలి నీడ‌లు..?
X
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్ - అలియా భట్ జంటగా నటిస్తున్న సోషియో ఫాంటసీ మూవీ ''బ్రహ్మాస్త్ర''. ఈ సినిమాతో 'కింగ్' అక్కినేని నాగార్జున చాలా గ్యాప్ తర్వాత హిందీ ఇండస్ట్రీలో అడుగుపెడుతున్నారు. ఇందులో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ - మౌని రాయ్ ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఎప్పుడో ప్రేక్షకుల ముందుకు రావాల్సిన ఈ సినిమా కోవిడ్ పరిస్థితుల్లో ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.

ఈ నేపథ్యంలో దాదాపు రెండేళ్లుగా ఊరిస్తూ వస్తున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని రెండు భాగాలుగా రిలీజ్ చేయాలని మేకర్స్ నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. అందులో ఫస్ట్ పార్ట్ ని ఈ ఏడాది ఎండింగ్ లో లేదా వచ్చే ఏడాది ప్రారంభంలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. కరోనా కారణాలతో లేట్ అవుతూ ఉండటం.. దీనికి తగ్గట్టుగానే బడ్జెట్ కూడా ఎక్కువ అవుతుండటంతో మేకర్స్, ఈ సినిమాకు కాస్ట్ కటింగ్ చేయాలని చూస్తున్న‌ట్లుగా బాలీవుడ్ వ‌ర్గాలు కోడై కూస్తున్నాయి.

పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా రూపొందుతున్న 'బ్రహ్మాస్త్ర' చిత్రాన్ని బాలీవుడ్ దర్శకుడు అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్నారు. ధర్మ ప్రొడక్షన్స్ మరియు ఫాక్స్ స్టార్ స్టూడియోస్ బ్యానర్స్ పై కరణ్ జోహార్ - అపూర్వ మెహతా - నమిత్ మల్హోత్రా - అయాన్ ముఖర్జీ కలిసి భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి ప్రీతమ్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇందులో నాగార్జున ఆర్కియాలజిస్టు పాత్రలో కనిపించనున్నారని సమాచారం.