Begin typing your search above and press return to search.
మూవీ రివ్యూ: 'బ్లఫ్ మాస్టర్'
By: Tupaki Desk | 28 Dec 2018 12:30 PM GMTచిత్రం : 'బ్లఫ్ మాస్టర్'
నటీనటులు: సత్యదేవ్ - నందిత శ్వేత - ఆదిత్య మీనన్ - బ్రహ్మాజీ - పృథ్వీ - సిజ్జు - బాలకృష్ణ - కృష్ణచైతన్య తదితరులు
సంగీతం: సునీల్ కశ్యప్
ఛాయాగ్రహణం: దాశరథి శివేంద్ర
కథ: హెచ్.వినోద్
మాటలు: గోపీ గణేష్ - పులగం చిన్ననారాయణ
నిర్మాత: రమేష్ పిళ్లై
స్క్రీన్ ప్లే - దర్శకత్వం: గోపీ గణేష్
‘జ్యోతి లక్ష్మీ’.. ‘క్షణం’.. ‘ఘాజీ’ లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలతో నటుడిగా మంచి గుర్తింపు సంపాదించాడు సత్యదేవ్. ఇప్పుడతను పూర్తి స్థాయి హీరోగా నటించిన సినిమా ‘బ్లఫ్ మాస్టర్’. తమిళ హిట్ మూవీ ‘శతురంగ వేట్టై’ ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి గోపీ గణేష్ దర్శకత్వం వహించాడు. ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్ర విశేషాలేంటో చూద్దాం పదండి.
కథ:
ఉత్తమ్ కుమార్ (సత్యదేవ్) చిన్నతనంలోనే తల్లిదండ్రుల్ని కోల్పోయి.. బతకడం కోసం ఏం చేయాలో తెలియని స్థితిలో మోసగాడిగా మారతాడు. రకరకాల మోసాలు చేసి ఎదుగుతాడు. ఒకదాని తర్వాత ఒకటి ఘరానా మోసాలు చేసి కోట్లు సంపాదిస్తాడు. ఐతే ఒక చోట అతడి వ్యూహం ఫలించక పోలీసులకు చిక్కుతాడు. అతడి మీద పలు కేసులు నమోదవుతాయి. కానీ ధన బలంతో అన్ని కేసులూ తప్పించుకుని క్షేమంగా బయటికి వచ్చేస్తాడు. కానీ అతడు ముందు చేసిన పాపాలన్నీ అతడిని వెంటాడుతాయి. అతను సమస్యల సుడిగుండంలో చిక్కుకుంటాడు. మరి ఉత్తమ్ ఆ పరిస్థితుల నుంచి ఎలా బయటపడ్డాడు.. మంచి మనిషిగా మారాడు అన్నది మిగతా కథ.
కథనం - విశ్లేషణ:
ఆల్రెడీ ఒక భాషలో హిట్టయిన సినిమాను రీమేక్ చేయడం హిట్ కొట్టడానికి చాలా దగ్గర దారి. కానీ ఇప్పటి రోజుల్లో రీమేక్ అనేది రిస్కీ వ్యవహారం అయిపోయింది. ఎందుకంటే ఒక చోట ఆడినంత మాత్రాన అదే కథను ఇంకో చోట ఆదరిస్తారన్న గ్యారెంటీ ఉండట్లేదు. నేటివిటీలో తేడా వల్ల కావచ్చు.. ప్రేక్షకుల అభిరుచిలో మార్పు వల్ల కావచ్చు.. కాన్సెప్ట్ ఏంటన్నది ముందే తెలిసిపోవడం వల్ల కావచ్చు.. రీమేక్ సినిమాలు అనుకున్నంతగా వర్కవుట్ కావట్లేదు. ఇలాంటి సమయంలో తమిళంలో ఐదేళ్ల కిందట హిట్టయిన ‘శతురంగ వేట్టై’ని ‘బ్లఫ్ మాస్టర్’ పేరుతో రీమేక్ చేశాడు గోపీగణేష్. అతను చేసిన తెలివైన పని.. ఈ సినిమాకు సత్యదేవ్ ను కథానాయకుడిగా ఎంచుకోవడం. నటుడిగా ఎంతో ప్రతిభ ఉన్నప్పటికీ.. అందుకు తగ్గ రోల్స్ రాని సత్యదేవ్.. తొలిసారి పూర్తి స్థాయి హీరోగా నటించే అవకాశం రావడంతో దాన్ని పూర్తిగా ఉపయోగించుకున్నాడు. స్టాండ్ ఔట్ పెర్ఫామెన్స్ తో సినిమా అంతటా హైలైట్ అయ్యాడు. ఐతే అతడి పెర్ఫామెన్స్ ను మ్యాచ్ చేసే స్థాయిలో పకడ్బందీ కథనం తోడు కాకపోవడంతో ‘బ్లఫ్ మాస్టర్’ అంత ఎఫెక్టివ్ గా అనిపించదు. సత్యదేవ్ పెర్ఫామెన్స్ ఎంత బాగున్నా.. కొన్ని ఎపిసోడ్ల వరకు ఆకట్టుకున్నా.. డైలాగుల వరకు బాగానే పేలినా.. బలమైన కథ.. బిగువైన కథనం లేకపోవడంతో ‘బ్లఫ్ మాస్టర్’ సాధారణంగానే అనిపిస్తుంది.
‘బ్లఫ్ మాస్టర్’ కథ చాలా సింపుల్. చాలా వరకు వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను తయారు చేశారు. హైదరాబాద్ లో సంచలనం రేపిన రైస్ పుల్లింగ్ ఎపిసోడ్.. కొన్నేళ్ల కిందట తమిళనాడులో వెలుగుచూసి ‘స్నేక్’ గ్యాంగ్ దోపిడీ.. అలాగే మల్టీలెవెల్ మార్కెటింగ్ పేరుతో తరచుగా వెలుగు చూసే మోసాలు.. ఇలాంటి వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ కథను అల్లారు. కాబట్టి ప్రేక్షకులు ఈజీగా ఈ కథతో కనెక్టవుతారు. మోసగాడిగా హీరో పాత్రను చాలా ఆసక్తికరంగా.. వినోదాత్మకంగా తీర్చిదిద్దడం వల్ల ఆ పాత్ర కొంత వరకు కథనాన్ని బాగానే నడిపిస్తుంది. పాముల పేరుతో చేసే మోసం నేపథ్యంలో నడిచే ఆరంభ ఎపిసోడ్ వినోదాన్ని పంచుతుంది. ఆ తర్వాత మల్టీ లెవెల్ మార్కెటింగ్ మోసం చుట్టూ తిరిగే సన్నివేశాలు కూడా పర్వాలేదు. ఐతే హీరోను ఘరానా మోసగాడిగా మరింత ఎస్టాబ్లిష్ చేసే ప్రయత్నం చేయాల్సింది. ఇలాంటి ఎపిసోడ్లనే కొనసాగిస్తే మొహం మొత్తుతుందనుకున్నారో ఏమో.. అతడిని అతను పోలీసులకు దొరికిపయేలా చేసి కథను మలుపు తిప్పారు. హీరో పోలీస్.. కోర్టు విచారణ నుంచి బయటపడి దర్జాగా బయటికొచ్చే వరకు కథనం కొంచెం వేగంగానే నడస్తుంది.
ప్రథమార్ధం స్థాయిలోనే ద్వితీయార్ధం నడిచిపోతే ‘బ్లఫ్ మాస్టర్’ సంతృప్తినిచ్చేవాడే. కానీ రెండో అర్ధం కథ ఒక దశా దిశా లేకుండా సాగుతుంది. హీరో పాత్ర ఎప్పటికప్పుడు మారిపోతూ ప్రేక్షకుల్లో అయోమయం రేపుతుంది. కన్విన్సింగ్ గా లేని ఎపిసోడ్ల వల్ల ద్వితీయార్ధంలో ఆసక్తి తగ్గుతుంది. హీరోలో పరివర్తన రావడానికి దారి తీసే సన్నివేశాలు అంత ఎఫెక్టివ్ గా లేకపోయాయి. కథ కూడా ఒక తీరుగా సాగకపోవడం.. ఎగుడు దిగుడుగా సాగే కథనం వల్ల ద్వితీయార్దంలో ‘బ్లఫ్ మాస్టర్’ గ్రాఫ్ తగ్గుతుంది. లాజిక్ సంగతలా ఉంచితే.. ద్వితీయార్ధంలో రైస్ పుల్లింగ్.. బంగారం మోసం ఎపిసోడ్లు పర్వాలేదనిపిస్తాయి. ఈ ఎపిసోడ్లను తీసేస్తే మాత్రం సెకండాఫ్ లో మిగతా వ్యవహారమంతా బోరింగే. హీరో పాత్రను బాగానే మొదలుపెట్టినా.. ఆ తర్వాత అస్తవ్యస్తంగా తయారు చేయడం వల్లే ‘బ్లఫ్ మాస్టర్’ క్రమ క్రమంగా ప్రభావం కోల్పోతాడు. ఓవరాల్ గా చెప్పాలంటే.. సత్యదేవ్ పెర్ఫామెన్స్ కోసం.. కొన్ని ఆసక్తికర ఎపిసోడ్లు.. డైలాగుల కోసం ‘బ్లఫ్ మాస్టర్’ ఒకసారి చూడొచ్చేమో కానీ.. ఇది అంత ప్రత్యేకమైన అనుభూతిని కలిగించే సినిమా మాత్రం కాదు.
నటీనటులు:
సత్యదేవ్ మంచి నటుడని ముందే రుజువైంది. ఇప్పుడు హీరోగా మరింత ప్రభావం చూపించాడతను. ఎలాంటి ఇమేజ్ లేని ఒక నటుడు ఇంత కాన్ఫిడెన్స్.. ఇలాంటి స్క్రీన్ ప్రెజెన్స్ తో ఒక పాత్రను పోషించడం అరుదుగా చూస్తాం. సత్యదేవ్ లుక్ కూడా బాగుంది. సినిమాకు తగ్గట్లుగా కనిపించాడు. చక్కటి వాచకం అతడికి పెద్ద ప్లస్. సినిమాలో మామూలుగానే డైలాగ్స్ బాగున్నాయి కానీ.. సత్యదేవ్ చెప్పడం వల్ల అవి మరింత ఎఫెక్టివ్ గా అనిపిస్తాయి. కథానాయిక నందిత శ్వేత పర్వాలేదు. ప్రథమార్ధంలో ఆమె పాత్ర కొంచెం అసహజంగా.. నాటకీయంగా అనిపిస్తుంది. ఐతే ద్వితీయార్ధంలో నందిత మెప్పిస్తుంది. విలన్ పాత్రలో ఆదిత్య మీనన్ బాగా చేశాడు. బ్రహ్మాజీ తనదైన శైలిలో వినోదం పంచాడు. పృథ్వీ ఉన్న కాసేపట్లో కొంచెం నవ్వించాడు. కృష్ణచైతన్య.. మిగతా నటీనటులు ఓకే.
సాంకేతికవర్గం:
టెక్నికల్ గా ‘బ్లఫ్ మాస్టర్’ పర్వాలేదు. ఇందులో పాటలకు ప్రాధాన్యం లేదు. సునీల్ కశ్యప్ అందించిన ఒకట్రెండు పాటలు పర్వాలేదనిపిస్తాయి. నేపథ్య సంగీతం బాగుంది. దాశరథి శివేంద్ర ఛాయాగ్రహణం సినిమా థీమ్ కు తగ్గట్లుగా సాగుతుంది. నిర్మాణ విలువలు ఓ మోస్తరుగా అనిపిస్తాయి. దర్శకుడు గోపీ గణేష్ మాతృకను దాటి క్రియేటివ్ గా చేసిందేమీ లేదు. అతను ప్రథమార్ధంలో ఉన్న బిగిని.. ద్వితీయార్దంలో కొనసాగించలేకపోయాడు. ఎడిటింగ్ విషయంలో కొంచెం జాగ్రత్త పడాల్సింది. గోపీ గణేష్.. పులగం చిన్ననారాయణ కలిసి రాసిన మాటలు బాగా పేలాయి. ఓవరాల్ గా గోపీగణేష్ దర్శకత్వ పనితనం పర్వాలేదనిపిస్తుంది
చివరగా: బ్లఫ్ మాస్టర్.. హీరో అదరగొట్టాడు కానీ!
రేటింగ్-2.5/5
Disclaimer : This Review is An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Theatre