Begin typing your search above and press return to search.
బాలీవుడ్ నటుడి ఇంటిని కూల్చేశారు!
By: Tupaki Desk | 21 Jun 2017 1:04 PM GMTప్రముఖ బాలీవుడ్ నటుడికి ముంబై మున్సిపల్ కార్పోరేషన్(బీఎంసీ) ఝలక్ ఇచ్చింది. చట్టం ముందు అందరూ సమానమేనని స్పష్టం చేసింది. 'మున్నాభాయ్ ఎంబీబీఎస్' ఫేం అర్షద్ వార్సీ బంగ్లాను కూల్చి వేసింది. అక్రమంగా అదనపు నిర్మాణాలను చేపట్టినందుకుగాను బీఎంసీ ఈ నిర్ణయం తీసుకుంది. ఇటీవల కార్పొరేషన్ నోటీసులు పంపింనినా అర్షద్ వార్సీ స్పందించకపోవడంతో ఇంటిలోని నిర్మాణాలను పాక్షికంగా కూల్చివేసింది.
4 సంవత్సరాల క్రితమే ఈ ఈ అక్రమ నిర్మాణాల కేసు బీఎంసీ దృష్టికి వచ్చింది. అయితే, కోర్టు ఆదేశాలతో ఇప్పటివరకూ కూల్చివేత వాయిదాపడింది. ఇటీవల అర్షద్ వార్సీ తెచ్చుకున్న స్టే ఆర్డర్‌ను కోర్టు ఎత్తివేయడంతో కార్పరేషన్ అధికారులు చర్యలు చేపట్టారు.
ఎయిర్ ఇండియా కో-ఆపరేటివ్ సొసైటీ (శాంతినికేతన్) లో అర్షద్ వార్సీ నివాసముంటున్నారు. రెండవ అంతస్తులో (1,300 చదరపు అడుగుల) అక్రమ నిర్మాణంపై వివరణ ఇవ్వకుంటే తొలగిస్తామని హెచ్చరించింది. దీనిపై స్పందించేదుకు వార్సీకి 24 గంటల సమయం కూడా ఇచ్చింది. వార్సీకి మళ్లీ నోటీసులు పంపిన అనంతరం అక్రమ అంతస్తును తొలగిస్తామని అధికారులు తెలిపారు. ఈ విషయాన్ని వార్సీ ధృవీకరించారు.
కాగా, 2012లో ఎయిర్ ఇండియా మాజీ ఉద్యోగినుంచి ఈ భవనాన్ని వార్సీ కొనుగోలు చేశారు. అక్రమ నిర్మాణాలు చేపట్టాడని ఆరోపిస్తూ సొసైటీ సభ్యులు బీఎంసీకి ఫిర్యాదు చేయడంతో ఈ వివాదం రేగింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/