Begin typing your search above and press return to search.

ప‌వన్ కోసం మ‌రో బాలీవుడ్ స్టార్ వ‌చ్చేశాడు!

By:  Tupaki Desk   |   24 Dec 2022 6:46 AM GMT
ప‌వన్ కోసం మ‌రో బాలీవుడ్ స్టార్ వ‌చ్చేశాడు!
X
ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టిస్తున్న తొలి పీరియాడిక్ మూవీ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు'. క్రిష్ జాగ‌ర్ల‌మూడి అత్యంత ప్ర‌తిష్టాత్మంగా ఈ మూవీ తెర‌కెక్కిస్తున్నారు. ప‌వ‌ర్ స్టార్ న‌టిస్తున్న తొలి పాన్ ఇండియా మూవీ కావ‌డంతో ఈ ప్రాజెక్ట్ ని స్టార్ ప్రొడ్యూస‌ర్ ఏ.ఎం.ర‌త్నం అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్నారు.

చారిత్ర‌క నేప‌థ్యంలో భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ మూవీ లేటెస్ట్ షెడ్యూల్ కి సంబంధించిన‌ రెగ్యుల‌ర్ షూటింగ్ ని ఇటీవ‌లే రామోజీ ఫిలిం సిటీలో అత్యంత భారీ స్థాయిలో మొద‌లు పెట్టిన విషయం తెలిసిందే.

నిధి అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో రోష‌నార‌గా బాలీవుడ్ బ్యూటీ న‌ర్గీస్ ఫ‌క్రీ న‌టిస్తోంది. కీల‌క విల‌న్ పాత్ర‌లో ఔరంగ‌జేబుగా బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ ని తీసుకున్నారు. అయితే ప‌వ‌న్ పొలిటిక‌ల్ షెడ్యూల్ కార‌ణంగా ఈ మూవీ షూటింగ్ గ‌త కొంత కాలంగా ఆల‌స్యం అవుతూ వ‌స్తుండంతో అర్జున్ రాంపాల్ ఈ ప్రాజెక్ట్ నుంచి త‌ప్పుకున్నార‌ట‌. ఆ స్థానంలో తాజాగా మ‌రో బాలీవుడ్ న‌టుడిని చిత్ర బృందం ఫైన‌ల్ చేసుకుంది.

ఈ క్యారెక్ట‌ర్ కోసం బాలీవుడ్ హీరో బాబీ డియోల్ ని ద‌ర్శ‌కుడు క్రిష్ తాజాగా ఫైన‌ల్ చేశారు. శనివారం బాబీ డియోల్ 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' సెట్ లోకి ఎంట్రీ ఇచ్చారు. ఈ సంద‌ర్భంగా త‌ను ఈ మూవీలో భాగం అయ్యాడంటూ బాబీ డియోల్ కు చిత్ర బృందం స్వాగ‌తం ప‌లుకున్న వీడియోని సోష‌ల్ మీడియా వేదిక‌గా అభిమానుల‌తో పంచుకుంది. ఆశ్ర‌మ్, క్లాస్ 83, ల‌వ్ మాస్ట‌ల్ వంటి సినిమాల్లో బాబీ డియోల్ న‌టించి అబ్బుర ప‌రిచాడు.

ల‌వ్ మాస్ట‌ల్, ఆశ్ర‌మ్ వంటి ప్రాజెక్ట్ ల‌లో బాబీ డియోల్ ప‌లికించిన విల‌నిజం ఆయా ప్రాజెక్ట్ ల‌కు ప్ర‌ధాన బ‌లంగా నిలిచింది. ఈ విష‌యాన్ని గ్ర‌హించిన క్రిష్ ఔరంగ‌జేబు పాత్ర కోసం అత‌న్ని ఎంపిక చేసుకున్నార‌ట‌. బాబీ డియోల్ ఎంట్రీతో 'హ‌రి హ‌ర వీర‌మ‌ల్లు' కు పాన్ ఇండియా వైడ్ గా మ‌రింత క్రేజ్ పెర‌గ‌డం ఖాయం అని ట్రేడ్ వ‌ర్గాలు చెబుతున్నాయి. బాబి డియోల్ న‌టిస్తున్న తొలి తెలుగు సినిమా ఇది. త‌న వ‌ల్ల ఉత్త‌రాదిలోనూ ఈ ప్రాజెక్ట్ కు క్రేజ్ పెర‌గ‌బోతోంది.

ఇదిలా వుంటే 17వ శ‌తాబ్దం కాలం నాటి మొఘ‌ల్ సామ్రాజ్యం నేప‌థ్యంలో సాగే ఈ మూవీలో ప‌వ‌న్ క‌ల్యాణ్ రాబిన్ హుడ్ త‌ర‌హా పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. ఇప్ప‌టికే బారీ అంచ‌నాలు నెల‌కొన్న ఈ మూవీని వ‌చ్చే ఏడాది స‌మ్మ‌ర్ లో అత్యంత భారీ స్థాయిలో పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయ‌బోతున్నార‌ట‌.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.