Begin typing your search above and press return to search.

బోర్ కొట్టేవరకు అంతే అంటున్న బాబీ

By:  Tupaki Desk   |   2 April 2016 9:49 AM GMT
బోర్ కొట్టేవరకు అంతే అంటున్న బాబీ
X
కమర్షియల్ సినిమాలకే తన తొలి ప్రాధాన్యం అంటున్నాడు డైరెక్టర్ బాబీ. బాడీగార్డ్.. మిస్టర్ పర్ఫెక్ట్.. డాన్ శీను.. బలుపు లాంటి సినిమాలకు రచయితగా పని చేసి ‘పవర్’ సినిమాతో దర్శకుడిగా మారిన బాబీ.. రెండో సినిమాకే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తో పని చేసే ఛాన్స్ కొట్టేశాడు. అతడి సెకండ్ డైరెక్టోరియల్ మూవీ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ఇంకో ఆరు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఈ నేపథ్యంలో రచయితగా.. దర్శకుడిగా కమర్షియల్ సినిమాలే చేస్తున్నారే అని అంటే.. ‘‘నాకూ, ప్ర‌జ‌ల‌కు బోర్ కొట్టే వ‌ర‌కు అవే చేస్తా. ఆ త‌ర్వాత మా ఇద్ద‌రిలో ఎవ‌రికి బోర్ కొట్టినా ఏం చేయాలోన‌ని ఆలోచిస్తా. నేను మొదట్నుంచి కమర్షియల్ సినిమాలతోనే ప్రయాణం చేస్తున్నాను. అవే నా బలం’’ అని చెప్పాడు బాబీ.

తర్వాతి సినిమా ఏంటి అని అడిగితే.. ‘‘ఇప్పటికైతే ఏమీ అనుకోలేదు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ కోసం కొన్ని నెలలుగా రేయింబవళ్లు పనిచేశాను. రెండు నెలల పాటు నా కుటుంబానికి సమయం కేటయాంచాలని అనుకుంటున్నా. తర్వాతి సినిమా గురించి ఆ తర్వాతే ఆలోచిస్తా’’ అని బాబీ అన్నాడు. ‘సర్దార్’ కోసం ఒకేసారి రెండు మూడు యూనిట్లతో షూటింగ్ చేసిన మాట వాస్తవమే అని బాబీ చెప్పాడు. ‘‘ఒకర‌కంగా చెప్పాలంటే ఈ ఏడాది జ‌న‌వ‌రి దాకా ఆడుతూ పాడుతూనే షూటింగ్ చేస్తూ వచ్చాం. ఐతే క‌ల్యాణ్‌ గారు ఒక రోజు పిలిచి ఏప్రిల్‌ లో మ‌న సినిమాను ఎందుకు విడుద‌ల చేయ‌కూడ‌దు అని అడిగారు. అంతే.. నేను శరత్ గారు ఒకటే టెన్షన్ పడ్డాం. నిర్విరామంగా షూటింగ్ చేశాం. రిలీజ్ డేట్ అందుకోవడానికి రెండు మూడు యూనిట్లతో షూటింగ్ జరిపాం. ఐతే స్క్రిప్టు పక్కాగా ఉండటం.. సరైన ప్లానింగ్ వల్లే ఇలా చేయగలిగాం’’ అని బాబీ చెప్పాడు.