Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్ లేకుంటే అది అటకమీద ఉండేదట

By:  Tupaki Desk   |   26 Sep 2017 5:12 AM GMT
ఎన్టీఆర్ లేకుంటే అది అటకమీద ఉండేదట
X
‘జై లవకుశ’ అనే కథ సినిమాగా వెండి తెర మీదికి వచ్చిందంటే అది కేవలం జూనియర్ ఎన్టీఆర్ వల్లే అని అన్నాడు ఈ చిత్ర దర్శకుడు బాబీ. ఎన్టీఆర్ అనే వాడు లేకుంటే.. ఈ కథ ఒక ఫైలు లోపల ఉండి అటక మీదికి పరిమితం అయిపోయేదని బాబీ చెప్పాడు. ఈ కథ రాయడమైతే రాశా కానీ.. ఇది సినిమాగా వెండితెర మీదికి వస్తుందన్న నమ్మకమే తనకు లేదని అతను చెప్పాడు.

‘‘జై లవకుశ కథ సినిమాగా మారడంలో ముందు ఓ వ్యక్తి సంకల్పం ఉంది. అతనే కొసరాజు హరి. నన్ను కళ్యాణ్ రామ్ గారికి పరిచయం చేసి ఈ కథ ముందుకు కదలడానికి కారణమైంది అతనే. కళ్యాణ్ గారు.. ఎన్టీఆర్ గారు కలిసి నా చేతిలో అడ్వాన్స్ పెట్టే వరకు ఈ సినిమా చేస్తానని నాకు నమ్మకమే లేదు. ఎన్టీఆర్ లేకుంటే ఈ స్క్రిప్టు ఫైల్ అటక మీద ఉండేది. నేను ‘జై లవకుశ’ కాకపోతే ఏవో కామెడీ సినిమాలు.. ఎంటర్టైనర్లు చేస్తూ వెళ్లేవాడిని. ఐతే ఈ సినిమా చేశా కాబట్టి నాకు ఒక గౌరవం వచ్చింది. నన్ను అందరూ గౌరవంగా చూస్తున్నారు. మా సొంతూరు గుంటూరుకు వెళ్లి సినిమా చూశాను. షో అయ్యాక అందరూ నన్ను రెస్పెక్ట్ తో చూశారు.

ఈ సినిమా విడులయ్యాక సంవత్సరం పాటు ఎన్టీఆర్ పేరు చెప్పుకుంటానని అన్నాను. కానీ పదేళ్ల పాటు ఎన్టీఆర్ పేరు వాడుకోమని నాకు వేలాది మంది మెసేజులు పంపారు. మా ఆవిడ ప్రపంచంలోని ఏడు వింతలు ఎప్పుడు చూపిస్తావని అడిగేది.. కానీ ‘జై లవకుశ’ చేస్తున్న సమయంలో తాను ఎన్టీఆర్ రూపంలో ఎనిమిదో వింతను ప్రతి రోజూ చూస్తున్నానని తనకు చెప్పేవాడిని.. ఎన్టీఆర్ కన్న తల్లిదండ్రులకు తాను పాదాభివందనం చేస్తానని ఇంతకుముందు చెప్పాను. ఇప్పుడూ అదే చెబుతున్నా. వాళ్లు ఎన్టీఆర్ అనేవాడిని కన్నారు కాబట్టే నేను ఈ రోజు ‘జై లవకుశ’ అనే సినిమా తీసి గర్వంగా నిలబడ్డాను’’ అని బాబీ చెప్పాడు.