Begin typing your search above and press return to search.

హీరోయిన్ని పెళ్లాడబోతున్న అవార్డు నటుడు

By:  Tupaki Desk   |   17 July 2015 4:55 AM GMT
హీరోయిన్ని పెళ్లాడబోతున్న అవార్డు నటుడు
X
బాబీ సింహా.. రెండేళ్ల కిందటి వరకూ ఈ పేరు తమిళ పరిశ్రమలో కూడా అంతగా పాపులర్ కాదు. కానీ గత ఏడాది జాతీయ ఉత్తమ సహాయ నటుడి అవార్డుకు ఎంపికయ్యాక ఎవరీ బాబీ సింహా అంటూ దేశమంతా అతడి గురించి ఇంటర్నెట్లో వెతుకులాట మొదలైంది. ‘జిగర్ తాండా’ సినిమాలో అతడి నటన చూశాక.. ఎవ్వరైనా ఆ అవార్డుకు అతను వంద శాతం కరెక్ట్ అని చెప్పాల్సిందే. పిజ్జా ఫేమ్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాతో తమిళనాట తిరుగులేని పాపులారిటీ సంపాదించాడు బాబీ. ప్రస్తుతం బాబీ.. కో (రంగం) సినిమా సీక్వెల్లో హీరోగా నటిస్తుండటం విశేషం.

కో-2తో పాటు అతను ‘ఉరుమీన్’ అనే సినిమాలోనూ కథానాయకుడిగా నటించాడు. ఆ సినిమా త్వరలోనే విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ఇంకో విశేషం ఏంటంటే.. ఇందులో బాబీకి జంటగా నటించిన రేష్మి మీనన్‌తో ప్రేమలో పడ్డాడు. ఆమె కూడా అతణ్ని ప్రేమించింది. ఐతే కేరళకు చెందిన రేష్మి తల్లిదండ్రులు బాబీతో రేష్మికి పెళ్లి చేయడానికి తటపటాయిస్తున్నట్లు సమాచారం. జిగర్ తాండా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ రేష్మి తల్లిదండ్రుల్ని ఒప్పించే పనిలో ఉన్నాడు. ఒకవేళ రేష్మి తల్లిదండ్రులు ఒప్పుకోకపోయినా తిరుపతికి వెళ్లి ఇద్దరూ పెళ్లి చేసుకోవాలని యోచిస్తున్నట్లు సమాచారం. ఐతే మీడియా వాళ్లు ఈ సంగతి అడిగితే మాత్రం బాబీ ‘నో కామెంట్’ అంటూ సైలెంటైపోవడం విశేషం.