Begin typing your search above and press return to search.

9 ఏళ్లకు సాకారం కాబోతుంది

By:  Tupaki Desk   |   28 Nov 2018 4:31 AM GMT
9 ఏళ్లకు సాకారం కాబోతుంది
X
శ్రీలంక ప్రభుత్వం టెర్రరిస్ట్‌ అంటూ ఎల్టీటీఈ నేత ప్రభాకరన్‌ ను 2009 సంవత్సరంలో హతమార్చిన విషయం తెల్సిందే. లంకలోని తమిళులకు మరియు తమిళనాడు ప్రజలకు ప్రభాకరన్‌ ఒక దేవుడు. లంకలో తమిళుల హక్కుల కోసం పోరాటం సాగించి - శ్రీలంక ఆర్మీనే ఎదిరించిన ప్రభాకరన్‌ అంటే తమిళనాడు ప్రభుత్వం కూడా ప్రత్యేక గౌరవంను కనబర్చేది. ఇక తమిళ సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా ప్రభాకరన్‌ కు గతంలో పలు సార్లు మద్దతుగా మాట్లాడారు.

2009వ సంవత్సరంలో ప్రభాకరన్‌ చనిపోయిన తర్వాత ఆయనపై సినిమా చేయాలని ఎంతో మంది ఫిల్మ్‌ మేకర్స్‌ అనుకున్నారు. అయితే పూర్తి స్థాయి ప్రభాకరన్‌ మూవీ మాత్రం ఇప్పటి వరకు రాలేదు. తెలుగులో మంచు మనోజ్‌ ఎల్టీటీఈ నేపథ్యంలో ఒక సినిమా చేశాడు. కాని అది కూడా పూర్తి స్థాయిలో ప్రభాకరన్‌ గురించి చూపించలేదు. తాజాగా తమిళనాట ప్రభాకర్‌ పై సినిమాకు రంగం సిద్దం అయ్యింది. పూర్తిగా ప్రభాకరన్‌ జీవిత చరిత్రను చూపించేందుకు దర్శకుడు వెంకటేష్‌ కుమార్‌ సిద్దం అయ్యాడు.

‘రేజింగ్‌ టైగర్‌’ టైటిల్‌ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ప్రభాకరన్‌ బయోపిక్‌ లో ప్రభాకరన్‌ పాత్రను ప్రముఖ నటుడు బాబీ సింహా నటిస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత అయిన బాబీ సింహా ఈ చిత్రంలో నటిస్తున్న కారణంగా సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ చిత్రం ఫస్ట్‌ లుక్‌ విడుదల అవ్వడంతో తమిళ ప్రేక్షకుల్లో అప్పుడే ఆసక్తి నెలకొంది. ఎల్టీటీఈ యూనిఫాంలో బాబీ సింహా - ఆ పక్కన పులితో పోస్టర్‌ అదిరిపోయింది. ఈ సినిమా తమిళనాట సంచలనంగా నిలుస్తుందనే టాక్‌ వినిప్తుంది. ఈ చిత్రంలో ప్రభాకరన్‌ గురించి పలు ఆసక్తికర విషయాలను చూపించబోతున్నట్లుగా దర్శకుడు వెంకటేష్‌ అంటున్నాడు. ఈ చిత్రంలో వివాదాస్పద అంశాలు కూడా ఉండే అవకాశం ఉందని కోలీవుడ్‌ వర్గాల్లో చర్చ జరుగుతోంది. వచ్చే ఏడాదిలో ఈ చిత్రం విడుదల చేసేలా వెంకటేష్‌ కుమార్‌ ప్లాన్‌ చేస్తున్నాడు.