Begin typing your search above and press return to search.

గబ్బర్‌ సింగ్‌ డ్రస్సు పాతబడిపోతోంది

By:  Tupaki Desk   |   17 March 2015 1:30 PM GMT
గబ్బర్‌ సింగ్‌ డ్రస్సు పాతబడిపోతోంది
X
ఒక డ్రస్సును ఒకసారి వేసుకున్నాక ఉతికి ఆరేసి.. వెంటనే దాన్ని తీసి మళ్ళీ వేసుకుంటే ఓకె.. అలా కాకుండా రోజులు తరబడి ఊరించి వేసుకోవాలంటే మాత్రం దానిలో విపరీతమైన పవర్‌ ఉండాలి. లేకపోతే ఆ డ్రస్సు జనాలకు పెద్దగా నచ్చదు. ఇప్పుడు గబ్బర్‌ సింగ్‌ ఖాకీ డ్రస్‌ గురించి కూడా ఇలాంటి టాకే వినిపిస్తోంది. ఎందుకంటే ఈ సినిమా సీక్వెల్‌ ఎప్పుడొస్తుందో చెప్పకుండా పవన్‌ చేస్తున్న డిలే చూస్తుంటే.. పవన్‌ మళ్ళీ ఈ డ్రస్‌ వేసుకొనే సరికి కంటెంట్‌ పాతది అయిపోతుందేమోనని అనుమానం.

నిజానికి సంపత్‌ నంది గబ్బర్‌ సింగ్‌ 2 సినిమాను చేస్తాడని అనుకోవడం.. మనోడు బయటకు వచ్చేయడం.. ఈ పరిణామాలన్నీ జనాలు మర్చిపోయారు. ఎందుకంటే ఈ మధ్యలో పవన్‌ ''గోపాల గోపాల'' సినిమాతో వచ్చాడు కాబట్టి. ఇకపోతే ఇప్పుడు పవర్‌ సినిమాతో పాపులర్‌ అయిన కెఎస్‌ రవీంద్ర (బాబి) రంగంలోకి దిగి కూడా చాన్నాళ్లయ్యింది. మనోడు ఇంతవరకు కథను ఇంకా వండుతూనే ఉన్నాడట. ఇలాగైతే మళ్ళీ పవన్‌ కళ్యాణ్‌ ఈ డ్రస్సును వేసుకోవాలంటే చాలా రోజులు పట్టేలా ఉంది. ఇక పవన్‌ కళ్యాణ్‌ కూడా కతను ఇలా సాగదీస్తూ ఉంటే పాపం బాబీ కూడా దెబ్బతినే ఛాన్సుంది. త్వరగా ఆ ఉతికేసిన గబ్బర్‌ సింగ్‌ డ్రస్సును మళ్ళీ వేసేసుకోండి బాబు!!