Begin typing your search above and press return to search.

ఉక్కపోత.. డీహైడ్రేషన్..: కేకే మరణానికి కారణాలు ఇవేనా..?

By:  Tupaki Desk   |   2 Jun 2022 6:33 AM GMT
ఉక్కపోత.. డీహైడ్రేషన్..: కేకే మరణానికి కారణాలు ఇవేనా..?
X
బాలీవుడ్ గాయకుడు కృష్ణకుమార్ కున్నాత్ (కేకే) మరణం సినీ ఇండస్ట్రీని దిగ్భ్రాంతికి గురి చేసింది. ఆయన మన మధ్య లేడన్న విషయాన్ని చాలా మంది సంగీత ప్రియులు జీర్ణించుకోలేకపోతున్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఓ షో లో పాట పాడుతుండగానే అతడు గుండెపోటుకు గురయ్యాడు.

అయితే హుటా హుటిన ఆసుపత్రికి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. అయితే కేకే మరణంపై సోషల్ మీడియా వేదికగా కొందరు పోస్టులు పెట్టడం హాట్ టాపిక్ గా మారింది. లైవ్ షో చేసిన ఆయనకు సరైన గాలి ఆడకపోవడం వల్లే మరణించాడని అంటున్నారు. ఆడిటోరియంలో సరైన సౌకర్యాలు లేనందువల్లే కేకే డీ హైడ్రేషన్ కు గురయ్యాడని కొందరు అభిమానులు అంటున్నారు.

దక్షిణ కొల్ కతాలోని నజ్రుల్ మంచ్ ఆడిటోరియంలో సోమవారం రాత్రి కేకే ప్రదర్శన ఇచ్చాడు. ఈ స్టేడియంలో 2500 నుంచి 3000 వరకు ప్రేక్షకులు ఒకేసారి వీక్షించవచ్చు. అయితే కేకే షో చూడడానికి ఆ రోజు 7 వేలకు పైగా సంగీత ప్రియులు వచ్చారని సమాచారం. దీంతో ఆడిటోరియం కిక్కిరిపోయింది. ఇదే సమయంలో ఆడిటోరియం ఏసీ పనియేయకపోవడంతో కాస్త కూడా గాలి రాని పరిస్థితి ఏర్పడింది. జనంతో నిండిన ఈ ఆడిటోరియంలో ప్రేక్షకులు కూడా చాలా ఇబ్బందులు పడ్డారని కొందరు సోషల్ మీడియాలో వీడియోలను షేర్ చేశారు.

ఈ పరిస్థితుల్లోనూ అభిమానులను అలరించేందుకు కేకే సాంగ్ చేయడం మొదలు పెట్టాడు. అప్పటికే అనారోగ్యంతో ఉన్న ఆయన డీ హైడ్రేషన్ కు గురైనట్లు తెలుస్తోంది. ఎందుకంటే సాంగ్ మధ్యలో అతడు టవల్ తో తుడుచుకుంటూ కనిపించాడు. అధికంగా ఉక్కపోత రావడం కేకే కు మరింత కష్టమైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయనకు ఊపిరాడలేదని కొందరు అంటున్నారు. కాసేపు నడిచిన ఏసి ఆ తరువాత స్విచ్ఛాప్ అయింది. దీంతో కేకేకు శ్వాస ఆడకపోవడంతో లైవ్ షో లోనే పడిపోయాడు.

అయితే ఆయన సన్నిహితులు అతనిని హడావుడిగా అక్కడి నుంచి తీసుకెళ్లారు. ఓ హోటల్ కు వెళ్లిన కేకే అక్కడ కూడా అనారోగ్యంతో కనిపించాడు. దీంతో అతనిని సీఎంఆర్ ఐ ఆసుపత్రికి తీసుకెళ్లారు. కానీ అప్పటికే శ్వాస వదిలినిట్లు వైద్యులు ధ్రువీకరించారు. కేకే మరణ వార్త వినగానే అతని కుటుంబ సభ్యులు మంగళవార ఆసుపత్రికి వచ్చారు. అయితే ఆయన దేశానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

ఆ తరువాత అతని మృతికి కారణాలు తెలపనున్నారు. ఇదిలా ఉండగా ప్రేక్షకుల తాకిడి తరుణంలో స్టేడియం అధికారులు సరైన సౌకర్యాలు కల్పించలేదని ఆరోపిస్తున్నారు. తీవ్రమైన ఉక్కపోత ఏర్పడినా ఏసీకి మరమ్మతులు చేయించడంలో విఫలమయ్యారని అంటున్నారు.