Begin typing your search above and press return to search.
స్టార్ హీరోకి బాడీ గార్డ్ చెంపదెబ్బ
By: Tupaki Desk | 14 Sep 2022 4:18 PM GMTబాలీవుడ్ యంగ్ స్టార్ హీరో రణ్వీర్ సింగ్ ఇటీవల బెంగళూరులో జరిగిన సైమా అవార్డు వేడుకలో పాల్గొన్న విషయం తెల్సిందే. ఆ సందర్భంగా రణ్వీర్ సింగ్ ను చూసేందుకు పెద్ద ఎత్తున జనాలు అక్కడికి చేరుకున్నారు. దాంతో కాస్త గందరగోళ పరిస్థితి ఏర్పడిందట. రణ్వీర్ వచ్చే సమయంకు జనాలంతా ఒక్కసారిగా మీదకు దూసుకు వచ్చారట. ఆ సమయంలో అనుకోని సంఘటన జరిగింది.
రణ్వీర్ సింగ్ పైకి జనాలు పెద్ద ఎత్తున వస్తున్న సమయంలో వారిని అదుపు చేయడం కోసం బాడీ గార్డ్స్ కాస్త దురుసగా వ్యవహరించాల్సి వచ్చింది. జనాలను బలంగా దూరం నెట్టే క్రమంలో ఒక బాడీ గార్డ్ చేయి ఏకంగా రణ్వీర్ సింగ్ యొక్క చెంపకు తగిలింది. ఏం జరిగిందో అర్థం కాని రణ్వీర్ సింగ్ కొన్ని సెకన్ల పాటు చెంప మీద చేయి పెట్టుకుని అలాగే ఉండిపోయాడు.
ఆ తర్వాత వెంటనే తేరుకుని కాస్త చూసుకోవాలి కదా అన్నట్లుగా బాడీ గార్డ్ వైపు చూసి అక్కడ నుండి మళ్లీ నవ్వుతూ వెళ్లి పోయాడు. ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పొరపాటున తగిలిందా లేదంటే ఏదైనా కోపంతో.. లేదా ఎవరైనా కావాలని కొట్టారా అంటూ మీమ్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వస్తున్నాయి.
రణ్వీర్ సింగ్ ఇటీవల న్యూడ్ ఫోటో ల కారణంగా చాలా రోజులుగా వార్తల్లో ఉంటున్నాడు. కొందరు ఆయనను సమర్థిస్తూ ఉంటే కొందరు ఆయనను తీవ్రంగా ట్రోల్స్ చేస్తున్నారు. ఏకంగా కొందరు ఫోటోలను కోర్టు ముందుకు తీసుకు వెళ్లి ఫిర్యాదు నమోదు చేయాలని.. చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇప్పటికే ఈ టాపిక్ తో వార్తల్లో ఉంటున్న ఆయన ఈ చెంప దెబ్బ కారణంగా మరి కొన్నాళ్లు మీడియాలో ఉండే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.