Begin typing your search above and press return to search.
ప్రభుదేవా నిర్మాతగానూ క్లాస్ చూపించాడు
By: Tupaki Desk | 10 Jun 2016 4:33 AM GMTప్రభుదేవా ముందు మనకు డ్యాన్స్ డైరెక్టర్ గా పరిచయం.. ఆ తర్వాత నటుడిగా మారాడు.. ఆపై డైరెక్టరూ అయిపోయాడు. ఇప్పుడిక ప్రభుదేవా మరో కొత్త అవతారం ఎత్తేస్తున్నాడు. అతను నిర్మాతగానూ మారిపోయాడు. తాను కథానాయకుడిగా నటిస్తున్న ‘అభినేత్రి’ సినిమాలో నిర్మాణ భాగస్వామిగా మాత్రమే ఉన్న ప్రభుదేవా.. సొంతంగా వేరే హీరోతో తమిళంలో ఇంకో సినిమా కూడా నిర్మించాడు. ఆ సినిమా పేరు ‘బోగన్’.
గత ఏడాది తమిళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘తనీ ఒరువన్’లో హీరో-విలన్ పాత్రల్లో అదరగొట్టిన జయం రవి-అరవింద్ స్వామి కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమా ఇది. ‘తనీ ఒరువన్’లో విలన్ గా నటించిన అరవింద్ ఇందులో మాత్రం పాజిటివ్ క్యారెక్టరే చేస్తున్నట్లున్నాడు. హీరో జయం రవి.. హీరోయిన్ హన్సికలతో కలిసి అతను స్టైలిష్ గా తయారై వారిలో ఒకడి మాదిరిగానే పోజులిచ్చాడు.
లక్ష్మణ్ అనే దర్శకుడు రూపొందిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో ప్రేక్షకుల ముందుకొస్తుంది. కాంబినేషన్ క్రేజ్ వల్ల ఈ సినిమాపై ఇప్పటికే అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్లు చూస్తే నిర్మాతగానూ ప్రభుదేవా క్లాస్ కనిపిస్తోంది. ఆల్రెడీ ‘అభినేత్రి’లోనూ ప్రభుదేవా మార్కు కనిపిస్తోంది. మరోవైపు ప్రియదర్శన్ దర్శకత్వంలో ‘సిల సమయంగలిల్’ అనే మరో సినిమా.. ‘వినోదన్’ అనే ఇంకో సినిమా కూడా నిర్మిస్తున్నాడు ప్రభుదేవా. ఈ నాలుగు చిత్రాలూ ఈ ఏడాదే విడుదలయ్యే అవకాశాలున్నాయి.