Begin typing your search above and press return to search.
'హీరో అంటే ఇలాగే ఉండాలి.. పరిమితులు కంపల్సరీ!
By: Tupaki Desk | 10 Jan 2021 8:50 AM GMTసినిమా ఏదైనా.. హీరో అంటే ఇలాగే ఉంటాడు! బంధాలతో పెనవేసుకుపోతాడు.. బాధ్యతల్లో మునిగిపోతాడు.. సమాజాన్ని ఉద్ధరిస్తుంటాడు.. అన్నిటికంటే ముఖ్యంగా మంచివాడై ఉంటాడు! 1913లో ‘రాజాహరిశ్చంద్ర’తో మొదలైన భారతీయ చలనచిత్ర ప్రస్థానంలో.. నిన్నామొన్నటి వరకూ హీరో అంటే ఇలాగే ఉంటాడు. అందరి బంధువయా అంటూ హీరోయిన్, ఇతర సపోర్టింగ్ క్యారెక్టర్స్ భజన చేస్తుంటే.. ప్రేక్షకులు తాళం వేస్తుంటారు. కష్టాలతో మొదలైన సినిమాను.. హీరో పోరాడి, పోట్లాడి, విజయతీరాలకు చేర్చి శుభం కార్డు వేస్తేగానీ.. చూసిన, తీసిన వారి మనసుకు తృప్తి కలగదు.
ట్రెండ్ మారింది..
శతాబ్ద కాలంగా సాగుతున్న ఈ మూసధోరణి ట్రెండ్.. కొన్నేళ్లుగా మారుతోంది. భారతీయ సినిమాను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆ మార్పు ఇంకా తెలుగు తెరవరకూ రానప్పటికీ.. బాలీవుడ్లో మొదలైంది దశాబ్ద కాలం దాటింది. క్రమక్రమంగా వేగం పుంజుకుంటోంది.
నటులుగా మారుతున్న హీరోలు..
హాలీవుడ్ సినీ ఇండస్ట్రీ ఉదాహరణ ఒక్కటి తీసుకుంటే.. అక్కడ హీరోలు ఉండరు. హీరోయిన్లు కూడా ఉండరు. నటులు మాత్రమే ఉంటారు! ఆస్కార్ అవార్డులు గెలిచిన వారిని కూడా యాక్టర్, యాక్ట్రెస్ అని మాత్రమే పిలుస్తారు. మరి, ఆ పరిస్థితి మన దగ్గర ఎప్పుడు వస్తుందో తెలియదుగానీ.. బీటౌన్ లో మాత్రం మొదలైంది. హీరోగా ప్రకటించుకున్న అద్భుతమైన యాక్టర్లు.. ఇమేజ్ చట్రంలో ఇరుక్కుపోయి తమలోని నటున్ని చంపేసుకున్న.. చంపేసుకుంటున్న వారికి కొదవేలేదు మన దగ్గర. బాలీవుడ్ లో మాత్రం హీరోలోని నటుడు ఇప్పుడిప్పుడే ప్రపంచాన్ని చూస్తున్నాడు.
విలన్ రోల్స్..
బాలీవుడ్ లో బడాహీరోలుగా వెలిగిన వారు.. ఇప్పటికీ వెలుగుతున్న వారు కూడా విలన్ క్యారెక్టర్లు చేస్తున్నారు. దానివల్ల ఓ బలమైన ప్రతినాయకుని పాత్ర ఆకాశమంత ఎత్తులో నిలబడి ఉంటుంది. అంతేకాదు.. విలన్ ఇలాగే ఉండాలనే రూలేం లేదు. ఎలాంటి గెటప్ లోనైనా తెరపై కనిపించొచ్చు. దానివల్ల పెర్ఫార్మెన్స్ కు కావాల్సినంత స్కోప్ ఉంటుంది. హీరోకు ఉన్న పరిమితులు విలన్ కు ఉండవు. ఎలాగైనా ఉండొచ్చు.. ఏమైనా చేయొచ్చు. ఇప్పుడు ఇవేపాత్రలు చేస్తూ తమలోని నటుడి ఆకలి తీరుస్తున్నారు బీటౌన్ అగ్ర హీరోలు. వారిలో సంజయ్ దత్ నుంచి అక్షయ్ కుమార్ దాకా ఉన్నారు.
కలెక్షన్ల వర్షం..
అగ్రహీరోలుగా ఉన్న వారు విలన్ వేషాలు వేయడం ద్వారా సినిమాకు ఎక్కడలేని హైప్ క్రియేట్ అవుతుంది. ఇది సినిమా బిజినెస్ కు ఎంతో ఉపయోగపడుతుంది. ప్రేక్షకుల్లో క్యూరియాసిటీని పెంచడానికి, వారిని థియేటర్ కు రప్పించడానికి తప్పక హెల్ప్ అవుతుంది. దీంతో.. రెండు మూడు వారాల్లోనే పెట్టుబడి వెనక్కి రప్పించే అవకాశం చిక్కుతుంది. తద్వారా.. నిర్మాతలు నష్టపోయే ఛాన్స్ మరింత తగ్గిపోతుంది. అప్పుడు బాక్సాఫీస్ గలగలలాడడంతోపాటు.. ఇండస్ట్రీ కళకళలాడుతూ ఉంటుంది. మరి, ఈ విలన్ ట్రెండ్ ను కొనసాగిస్తున్న వారియర్స్ ఎవరెవరో ఓ సారి చూద్దామా?
సంజయ్ దత్..
హీరోగా బాలీవుడ్ ను ఒక ఊపు ఊపిన సంజయ్ దత్.. విలన్ వేషాలు వేయడంలోనూ ముందే ఉన్నారు. 2012లో వచ్చిన "అగ్నిపథ్" సినిమాలో భయంకరమైన విలన్ గా సత్తా చాటాడు. ఈ సంవత్సరం "కెజిఎఫ్ చాప్టర్ 2"తో మరోసారి తన విలనిజం ప్రేక్షకులకు రుచి చూపించబోతున్నాడు. ట్రైలర్ విడుదలైన తరువాత, సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న దత్ ఫ్యాన్స్.. అధీర గెటప్ లో ఎలా అదరగొట్టాడో చూడాలని ఆరాటపడుతున్నారు. అయితే.. గతంలో "పానిపట్", "ఖల్నాయక్" లలోనూ నెగెటివ్ రోల్స్ చేశాడు సంజయ్ దత్. కేజీఎఫ్ లోని అధీర పాత్రపై స్పందిస్తూ.. "నేను ఇప్పటివరకు పోషించిన క్రేజీ క్యారెక్టర్లలో అధీరా ఒకటి. నిర్భయమైన, శక్తివంతమైన, క్రూరమైన పాత్ర" అని కామెంట్ చేశాడు దత్.
సైఫ్ అలీ ఖాన్..
2006లో "ఓంకార"లో నీచమైన త్యాగి పాత్రలో నటించిన సైఫ్.. ప్రేక్షకులతోపాటు విమర్శకుల ప్రశంసలు గెలుచుకున్నాడు. ఇక, గత సంవత్సరం ‘తన్హాజీ: ది అన్సంగ్ వారియర్’లో రాజు ఔరంగజేబు గార్డ్ ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్రను పోషించాడు. తన్హాజీ పాత్రలో నటించిన అజయ్ దేవగన్ కు ప్రత్యర్థిగా కనిపించాడు సైఫ్. ఇప్పుడు.. ప్రభాస్ రాముడిగా నటిస్తున్న "ఆదిపురుష్"లోనూ విలన్ గా నటించనున్నాడు. ఈ ప్రాజెక్టును "అసాధారణమైనది" అభివర్ణించిన సైఫ్.. శక్తివంతమైన ప్రభాస్‌తో కత్తులు దూయడానికి, రావణ్ పాత్రను పోషించడానికి ఎదురు చూస్తున్నానని ప్రకటించాడు.
విక్కీ కౌషల్..
ఈ నటుడు "మాసాన్", "సంజు", "ఉరి: ది సర్జికల్ స్ట్రైక్" చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. రాబోతున్న కరణ్ జోహార్ "తఖ్త్"లో ఔరంగజేబుగా కనిపించబోతున్నాడు విక్కీ. ఔరంగ జేబు మొఘల్ చక్రవర్తి అయినప్పటికీ.. అతడు ప్రజలను తన పాలనలో దారుణంగా హింసించిన చక్రవర్తిగా మిగిలిపోయాడు. అలాంటి రాజు పాత్రను పోషించబోతున్నాడు విక్కీ కౌషల్. సింహాసనం కోసం ఔరంగజేబు, అతడి సోదరుడు దారా షికో సాగించిన పోరాటం నేపథ్యంగా ఈ చిత్రం తెరకెక్కనుంది.
జాన్ అబ్రహం..
బాలీవుడ్ స్టయిలిష్ యాక్టర్ జాన్ అబ్రహం కూడా మరోసారి విలన్ పాత్రను పోషించబోతున్నట్టు సమాచారం. ఇప్పటికే 2004లో విడుదలైన "ధూమ్"లో నెగెటివ్ షేడ్ లోని హీరో క్యారెక్టర్ ను జాన్ పోషించిన విషయం తెలిసిందే. ఆ సినిమా ఎంతటి విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. ఆ తర్వాత 2013లో వచ్చిన "రేస్ 2" మూవీలోనూ యాంటీ హీరోగా అలరించాడు జాన్. కాగా.. త్వరలో ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా తెరకెక్కనున్న "సలార్" చిత్రంలో జాన్ అబ్రహం విలన్ పాత్రను పోషిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే.. ఇది ఇంకా కన్ఫాం కాలేదు.
కునాల్ కెమ్ము..
బాల నటుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. ఆ తర్వాత హీరోగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న యువ నటుడు కునాల్ కెమ్ము. మొదట్లో ఈ నటుడు పాజిటివ్ సినిమాలే చేశాడు. 2005లో వచ్చిన "కల్యాగ్", 2010లో విడుదలైన "గోల్‌మాల్ 3" సినిమాతోపాటు 2017లో రిలీజైన "గోల్‌మాల్ ఎగైన్"
మరియు "గో" చిత్రాలలో పాజిటివ్ క్యారెక్టర్లు చేశాడు. అయితే.. 2019లో వచ్చిన "కలాంక్" సినిమాతో తనలోని నెగెటివ్ షేడ్ బయటపెట్టాడు. కానీ.. అతని ఫుల్ నెగెటివ్ యాంగిల్ మాత్రం "మలంగ్" చిత్రం ద్వారా చాటిచెప్పాడు. గతేడాది విడుదలైన ఈ సినిమాలో పైకి మంచివాడిలా కనిపించే క్రూరమైన సైకో పాత్రలో నటించి మెప్పించాడు.
అక్షయ్ కుమార్..
బాలీవుడ్ లో అక్షయ్ కుమార్ హవా నడుస్తోంది. ఏడాదికి మూడు, నాలుగు సినిమాలు రిలీజ్ చేస్తూ దూసుకెళ్తున్నాడు. ఈ సూపర్ స్టార్ కూడా గతంలో విలన్ రోల్స్ లో యాక్ట్ చేశాడు. 2001లో వచ్చిన "అజ్నాబీ" సినిమాలోని విక్రమ్ పాత్ర నెగెటివ్ షేడ్స్ లోనే ఉంటుంది. హీరో రాజ్ (బాబీ డియోల్), హీరోయిన్ ప్రియా (కరీనా కపూర్) జీవితాల్లో అడ్డంకులు సృష్టించే క్యారెక్టర్లో నటించాడు అక్షయ్. ఆ తర్వాత 2018లో రజనీకాంత్ హీరోగా నటించిన రోబో "2.0" లో పక్షిరాజు పాత్రలో నటించాడు. నెగెటివ్ షేడ్లో కొనసాగే ఈ పాత్రలో అక్షయ్ జీవించాడనే చెప్పాలి.
రణ్ వీర్ సింగ్..
బాలీవుడ్ లో రొమాంటిక్ హీరోగా పేరున్న రణ్ వీర్ సిండ్ కూడా విలన్ షేడ్ ఉన్న పాత్రల్లో కనిపించాడు. 2018 లో సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వచ్చిన "పద్మావత్" సినిమాలో అల్లావుద్దీన్ ఖిల్జీగా నటించాడు రణ్ వీర్. రాణి పద్మావతిని మోహించే నెగెటివ్ పాత్రలో రణ్ వీర్ నటించాడు. ఇందులో కల్పితం ఎక్కువగానే ఉన్నప్పటికీ.. రణ్ వీర్ ను ఖిల్జీ పాత్రలో భయంకరమైన రాజులా చూపించాడు దర్శకుడు. ఈ సినిమాలో రణ్ వీర్ నటనకు మంచి ప్రశంసలు దక్కాయి.
మార్పు మంచికే...
హీరోలుగా ఉన్నవారు నెగెటివ్ రోల్స్ లో కనిపించడం గడిచిన దశాబ్దంన్నర కాలంగా వేగం పుంజుకుంది. అయితే.. ఈ మార్పు మంచికే అన్నది మెజారిటీ సినిమా అభిమానుల మాట. హీరోలు ఇమేజ్ చట్రం నుంచి బయటపడి.. నటుడిగా రాణించడానికి అవకాశం దక్కుతుందని అంటున్నారు. అంతేకాకుండా.. కలెక్షన్లు రాబట్టడానికీ ఉపయోగపడుతుందని అభిప్రాయ పడుతున్నారు. మరి, మన టాలీవుడ్లో ఈ పరిస్థితి ఎప్పుడు వస్తుందో కానీ.. బీటౌన్ లో మాత్రం హీరోలు విలన్లుగా మారుతున్నారు! మారడానికి ఇష్టపడుతున్నారు!!