Begin typing your search above and press return to search.
సౌత్ దర్శకులు కావాలి... హీరోలు మాత్రం వద్దు అంటున్న బాలీవుడ్
By: Tupaki Desk | 15 Oct 2019 8:54 AM GMTబాలీవుడ్ ఇండస్ట్రీ ఇప్పుడు తెలుగు, తమిళ ఇండస్ట్రీలను చూసి భయపడుతుంది. ముఖ్యంగా తెలుగులో ప్రభాస్ లాంటి హీరోలను చూసి వణికిపోతోంది. ప్రభాస్ లాంటి హీరోలు హిందీలో సక్సెస్ అయితే తమ కెరీర్ ముగిసిపోతుందని వాళ్ళకి భయం పట్టుకుంది. ఇప్పటికే ప్రభాస్ బాలీవుడ్ మొత్తాన్ని తనవైపు చూసేలా చేసాడు. అక్కడి హీరోల కంటే ఇప్పుడు ప్రభాస్ కి మార్కెట్ ఎక్కువ ఉంది. ఇప్పటివరకు తమకు ఎదురు లేదని విర్రవీగిన ఖాన్ త్రయం ప్రభాస్ ని చూసి బెంబేలెత్తిపోతోంది. బాహుబలి సినిమాతో బాలీవుడ్ లో పాగా వేసిన ప్రభాస్ తర్వాత వచ్చిన 'సాహో' సినిమాతో అక్కడ తిష్ట వేశాడు. 'సాహో' సినిమాను ప్లాప్ చేయాలని బాలీవుడ్ ఇండస్ట్రీ మొత్తం కంకణం కట్టుకుని మరీ ఈ సినిమా మీద నెగటివ్ టాక్ ప్రచారం చేసింది. అయితే బాలీవుడ్ ఆడియన్స్ ఇవేమీ పట్టించుకోలేదు. ఆ సినిమా పెద్ద హిట్ చేసి బాలీవుడ్ ఇండస్ట్రీకి షాక్ ఇచ్చారు.
ఇంతలా మన సౌత్ సినిమా హీరోలను హిందీలోకి రాకుండా అడ్డుకోవాలని చూస్తున్న బాలీవుడ్ ఇండస్ట్రీ స్టార్ హీరోలు మన సినిమాలు, మన దర్శకులు మాత్రం కావాలి అంటున్నారు. ఇంతకాలం సల్మాన్ ఖాన్ లాంటి హీరోలు సౌత్ సినిమాలను రీమేక్ చేసి హిట్ల మీద హిట్లు కొడుతున్నాడు. సల్మాన్ ఒక్కడే కాదు అక్షయ్ కుమార్ లాంటి హీరోలు కూడా సౌత్ సినిమాలతో భారీ హిట్స్ కొట్టారు. ఇప్పుడు రీమేక్ సినిమాలే కాదు బాలీవుడ్ హీరోలు హిట్ల కోసం మన సౌత్ డైరెక్టర్స్ వెనక పడుతున్నారు. ఇప్పటికే అక్కడ ప్రభుదేవా కొన్ని సినిమాలు తీసి డైరెక్టర్ గా సెటిల్ అయిపోయాడు. రేసులో వెనకపడ్డ షాహిద్ కపూర్ లాంటి హీరో మన తెలుగు డైరెక్టర్ అయిన సందీప్ వంగాతో రీమేక్ సినిమా 'కబీర్ సింగ్' చేసి పెద్ద హిట్ కొట్టి కెరీర్ నిలబెట్టుకున్నాడు. ఇప్పుడు చాలాకాలంగా హిట్ కోసం ఎదురుచూస్తున్న షారుఖ్ ఖాన్ దృష్టి కూడా సౌత్ పై పడింది. తమిళంలో వరుసగా హిట్ సినిమాలను తీస్తున్న దర్శకుడు అట్లీ ని లైన్ లో పెడుతున్నాడు షారూఖ్. ఎన్నో సంవత్సరాల నుండి హిట్ సినిమా లేని షారుఖ్ మళ్ళీ తన కెరీర్ పట్టాలెక్కాలంటే సౌత్ డైరెక్టర్ వల్లే అవుతుందని భావిస్తున్నాడు. అంతేకాదు ఇప్పుడు తెలుగులో 'జెర్సీ' సినిమాలాంటి డీసెంట్ హిట్ కొట్టిన దర్శకుడు గౌతమ్ తిన్ననూరిపై కూడా బాలీవుడ్ కన్ను పడింది. వీళ్ళే కాదు దేవా కట్టా లాంటి దర్శకులు కూడా హిందీలో తమ చాటుతున్నారు. మొత్తానికి బాలీవుడ్ వాళ్ళకి మన సినిమాలు, మన కథలు, మన దర్శకులు మాత్రమే కావాలి. మన హీరోలు మాత్రం వద్దు.