Begin typing your search above and press return to search.
పాఠం నేర్వలేదా? బాలీవుడ్ స్టార్ మళ్లీ అదే తప్పు!?
By: Tupaki Desk | 2 Jun 2022 2:30 AM GMTభారతీయ సినిమాకి పాన్ ఇండియా కేటగిరీలో దిశానిర్ధేశనం చేసేందుకు ఇప్పుడు సౌత్ సినిమా ఉరకలెత్తుతోంది. ఓవైపు తెలుగు సినీపరిశ్రమ.. మరోవైపు కన్నడ పరిశ్రమ 1000 కోట్ల క్లబ్ సినిమాలతో ఈ ఏడాది ది బెస్ట్ అని నిరూపించాయి. పాన్ ఇండియా కేటగిరీలో సత్తా చాటే సినిమాలు సౌత్ కి మాత్రమే సాధ్యమని కూడా నిరూపిస్తున్నాయి. ఇది బాలీవుడ్ కి రియల్ ఛాలెంజ్ లాంటిది. ఈ ఛాలెంజ్ ని స్వీకరించి హిందీ ట్యాలెంట్ నిరూపించుకోవాల్సి ఉంది. ఖాన్ ల త్రయం కిలాడీలు కపూర్ లు బచ్చన్ లు రోషన్ లు ఉన్న పరిశ్రమ పాన్ ఇండియా మార్కెట్ లో తోపులం అని నిరూపించుకోవాల్సిన ఛాలెంజ్ ముందుంది.
అందుకే ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 తరవాత వస్తున్న సినిమాలుగా అక్షయ్ కుమార్ నటించిన పృథ్వీరాజ్.. అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్దా సినిమాలపై ట్రేడ్ సహా ప్రజలు దృష్టి సారించారు. ఆయా సినిమాలు ఎలాంటి రిజల్ట్ అందుకుంటాయోనని ఆసక్తిగా వేచి చూస్తున్నారు. తొలిగా జూన్ 3న అక్షయ్ కుమార్ తన అత్యంత ఖరీదైన చిత్రం `సామ్రాట్ పృథ్వీరాజ్`తో పెద్ద తెరపైకి తిరిగి దూసుకొస్తున్నాడు. ఇది యష్ రాజ్ ఫిల్మ్స్ నిర్మించిన చిత్రం కావడంతో అంచనాలేర్పడ్డాయి. ఇది భారతదేశపు చివరి హిందూ సామ్రాట్ జీవిత చరిత్ర. భారీ స్థాయి చారిత్రాత్మక సంఘటనను ఎంపిక చేసి తెరకెక్కించినది కావడంతో ప్రొడక్షన్ హౌస్ చాలా ఆశిస్తోంది. ఆదివారం నుండి సినిమా కోసం అడ్వాన్స్ బుకింగులను తెరిచింది. అయితే ఇది టిక్కెట్ విండోల వద్ద నిజంగా ప్రోత్సాహకరమైన ధోరణితో లేదని తెలుస్తోంది. సామ్రాట్ పృథ్వీరాజ్ అడ్వాన్స్ బుకింగ్ రిపోర్ట్ పరిశీలిస్తే నీరసం ఆవహిస్తోందన్న గుసగుస వినిపిస్తోంది. జాతీయ థియేట్రికల్ చైన్ లలో నిస్తేజంగా అమ్మకాలు జరిగాయని రిపోర్ట్ అందింది. నిజానికి కార్తీక్ ఆర్యన్ నటించిన `భూల్ భూలైయా 2`లో 1/3వ వంతు అడ్వాన్స్ బుకింగులతో సరిపెట్టుకోవాల్సి వచ్చిందంటే ఆ వెనకబాటును అర్థం చేసుకోవాలి.
తాజా సమాచారం ప్రకారం... సామ్రాట్ పృథ్వీరాజ్ బుధవారం ఉదయం PVR, ఐనాక్స్- సినీపోలీస్ లలో దాదాపు 10000 టిక్కెట్లను విక్రయించారు. బుధవారం ఉదయం ఇదే థియేటర్ల చైన్ లలో సుమారుగా 30,000 టిక్కెట్లు విక్రయించిన భూల్ భూలయ్యా 2లో ఇది దాదాపు 1/3 వంతు. బుధవారం నాటికి మూడు జాతీయ థియేట్రికల్ చైన్ లు వెలుపల స్వల్ప పురోగతి కనిపించింది. బుధవారం ఉదయం నాటికి జాతీయ చైన్ లలో దాదాపు 27000 టిక్కెట్‌లను విక్రయించిన RRR కంటే అడ్వాన్స్ టికెట్ బుకింగ్ లు చాలా తక్కువ. బుధవారం - గురువారాల్లో ప్రభావవంతమైన ప్రముఖుల కోసం పలు స్క్రీన్లలో స్క్రీనింగ్ లు నిర్వహిస్తామని అక్షయ్ ప్రమోషనల్ పరంగా దూకుడుగా ఉన్నారు. దీనివల్ల గురువారం చివరి నాటికి ముందస్తు బుకింగ్ లో కొంత బెటర్ మెంట్ ఉంటుందని అంచనా వేస్తున్నామని తెలిపారు.
నిజానికి ఆల్ ఇండియా అడ్వాన్స్ బుకింగుల గురించి పరిశీలిస్తే.. బుధవారం ఉదయం నాటికి `సామ్రాట్ పృథ్వీరాజ్` నికర వసూళ్లు కోటి లోపే ఉన్నాయని తెలిసింది. ట్రేడ్ విశ్లేషణల ప్రకారం.. కొంత గౌరవప్రదమైన మొత్తాన్ని ఆర్జించడానికి బుకింగ్ లో పెద్ద పెరుగుదల అవసరం. ప్రస్తుతానికి సినిమాని తప్పక చూడాలన్న తపన ఉత్సుకత ప్రేక్షకుల్లో లేకుండా పోయింది అంటూ బాలీవుడ్ మీడియా విశ్లేషిస్తోంది.
కువైట్ ఒమన్ లో బ్యాన్
సామ్రాట్ పృథ్వీరాజ్ చిత్రం సరైన బుకింగులు లేక కునారిల్లుతుంటే మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు! కువైట్ -ఒమన్ లలో నిషేధానికి గురైంది. దీనికి కారణాలు అనేకం. అక్షయ్ కుమార్ చిత్రం చారిత్రాత్మకమైనది. ఇది నిర్భయుడు శక్తివంతమైన రాజు పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం- పరాక్రమం ఆధారంగా రూపొందించినది. అతను క్రూరమైన దండయాత్ర చేసిన మహమ్మద్ ఘోర్ నుండి భారతదేశాన్ని రక్షించడానికి పోరాడిన యోధునిగా తెరపై కనిపిస్తాడు. భారతదేశంలోని ఆక్రమణదారులపై హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ కథను తెరపై చూసేందుకు ముస్లిమ్ దేశాలు సిద్ధంగా లేవని తాజా బ్యాన్ పరిణామం చెబుతోంది. రెండు దేశాలు కువైట్ - ఒమన్ ఈ చిత్రాన్ని నిషేధించాయని విశ్వసనీయ ట్రేడ్ వర్గాల ద్వారా వెల్లడైందని ప్రముఖ బాలీవుడ్ మీడియా కథనం అందించింది. బయటకు తెలియని ఇలాంటి ఎన్నో ఇబ్బందులు పృథ్వీరాజ్ కి ఇబ్బందికరంగా మారాయి. ఈ పరిస్థితులపై ఒక సీనియర్ ట్రేడ్ సోర్స్ వెల్లడించిన వివరం ప్రకారం..మన రారాజు అయిన మహిమాన్విత హిందూ సామ్రాట్ పృథ్వీరాజ్ జీవితం ధైర్యం ఆధారంగా తీసిన చిత్రం కువైట్ -ఒమన్ వంటి కొన్ని అంతర్జాతీయ మార్కెట్ లలో నిషేధించబడడం చాలా దురదృష్టకరం. సినిమా విడుదలకు ముందు ఈ దేశాలు ఈ వైఖరిని అనుసరించడం సరికాదని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.
దేశాన్ని ప్రజలను దోచుకోవాలని చంపాని కోరుకునే కనికరంలేని ఆక్రమణదారుల నుండి రక్షించిన సామ్రాట్ పృథ్వీరాజ్ చౌహాన్ జీవితం ఎంతో స్ఫూర్తివంతమైనది. అతని జీవిత కథను నిషేధించడం వెనక కుట్ర ఏమి దాగి ఉందో చూడాలని చిత్రబృందం భావిస్తోందని కథనాలొస్తున్నాఇ. ప్రపంచ దేశాల ప్రజలు చరిత్రను పరిశీలించి భారతదేశానికి హిందువులకు ఆ కాలంలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు ఎందుకు అంగీకరించలేరు? అన్నది ఆశ్చర్యపరుస్తోందని వ్యాఖ్యానిస్తున్నారు. సామ్రాట్ పృథ్వీరాజ్ కి డాక్టర్ చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహించారు. ఈ చిత్రం హిందీ-తమిళం- తెలుగు భాషల్లో ఈ శుక్రవారం విడుదల కానుంది.
నిజానికి ఇటీవలి కాలంలో ఏ పాన్ ఇండియా మూవీ రిలీజైనా దానికి బాహుబలి ఫ్రాంఛైజీ స్ఫూర్తి. ఇటీవలి ఆర్.ఆర్.ఆర్- కేజీఎఫ్ 2 కూడా గీటురాయిగా మారాయి. ఇలాంటి సమయంలో బాలీవుడ్ ఇంకా పాఠం నేర్వలేదా? బాలీవుడ్ స్టార్ లు మళ్లీ అదే తప్పు చేస్తున్నారా? రిలీజ్ ముందు టికెట్ విండో వద్ద ఎందుకని మ్యాజిక్ చేయలేకపోతున్నారు? అన్నది ఆశ్చర్యపరుస్తోంది. `బాహుబలి` నుంచి పాఠాలు నేర్వాలని హిందీ పరిశ్రమకు కరణ్ జోహార్ సూచించారు. కానీ పాఠం ఇంకా బుర్రకెక్కలేదా? అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. క్లాసిక్ తీస్తే కుదరదు మాస్ ని ఊపేంతగా ఏదైనా మ్యాజిక్ చేయాల్సి ఉందని సూచిస్తున్నారు. రిలీజ్ ముందే బజ్ క్రియేట్ చేయడంలో సామ్రాట్ ఫెయిలయ్యారన్న విమర్శ ఇప్పుడు బలంగా ఉంది. #సామ్రాట్ బుకింగులు మరీ నీరసంగా ఉన్నాయన్నది తాజా టాక్.. మూలిగే నక్కపై తాటిపండు పడ్డట్టు! ఇతర సమస్యలు ఇబ్బందికరంగా మారాయి. మరి ఫేట్ ని మార్చేందుకు కిలాడీ బృందం ఏం చేస్తుందో వేచి చూడాలి.