Begin typing your search above and press return to search.

ఆరు వైఫ‌ల్యాలు..ఖిలాడీ మ‌ళ్లీ కొట్టెదెప్పుడు?

By:  Tupaki Desk   |   13 Jun 2022 2:30 AM GMT
ఆరు వైఫ‌ల్యాలు..ఖిలాడీ మ‌ళ్లీ కొట్టెదెప్పుడు?
X
ఖిలాడీ అక్ష‌య్ కుమార్ కి `హౌస్ ఫుల్ -4`..`గుడ్ న్యూస్` త‌ర్వాత  చెప్పుకోద‌గ్గ స‌క్సెస్ ప‌డ‌లేదన్న‌ది వాస్త‌వం. రెండు..మూడేళ్ల గ్యాప్ లో చాలా సినిమాలు చేసారు. కానీ అవేవి కిలాడీ ని  ప‌తాక స్థాయిలో నిల‌బెట్టలేక‌పోయాయి. `ల‌క్ష్మిల్`..`బెల్ బాట‌మ్`.. `సూర్య వంశీ`.. `ఆట్రంగిరే`..`బ‌చ్చ‌న్ పాండే` ఇలా వ‌రుస‌గా ఐదు చిత్రాలు అక్ష‌య్ ని  స్టార్ గా నిల‌బెట్ట‌లేక‌పోయాయి.

దీంతో అక్ష‌య్ ఆశ‌ల‌న్నీ ఇటీవ‌లే రిలీజ్ అయిన `సామ్రాట్  పృథ్వీరాజ్` పైనే పెట్టుకున్నారు. కానీ ఆ సినిమా తీవ్ర నిరాశ‌నే  మిగిల్చింది. పిరియాడిక్  చిత్రం `పృథ్వీరాజ్` భారీ అంచ‌నాల మ‌ధ్య రిలీజ్ అయిన వాటిని నిల బెట్ట‌డంలో  ప‌ది శాతం కూడా స‌క్సెస్ కాలేక‌పోయింది. పాత లెక్క‌ల‌న్నింటిని పృథ్వీరాజ్ స‌క్సెస్ తో బ్యాలెన్స్ చేయోచ్చ‌ని ఖిలాడీ ఎన్నో ఆశ‌లు పెట్టుకున్నా అవ‌న్ని అడియాశ‌ల‌గానే మిగిలిపోయాయి.

దీంతో అక్ష‌య్ ఖాతాలో డ‌బుల్ హ్యాట్రిక్ ప్లాప్ న‌మోదైంది. అక్ష‌య్ కెరీర్ లో వ‌రుస‌గా ఆరు వైఫ‌ల్యాలు బ‌హుశా ఇదే తొలిసారి కావొచ్చు అన్న విమ‌ర్శ తెర‌పైకి వ‌స్తోంది. వీటి వైఫ‌ల్యానికి ర‌క‌ర‌కాల కార‌ణాలు విశ్లేషించవ‌చ్చు.  కొన్ని సినిమాల‌ కంటెంట్ బాగున్నా...రిలీజ్ స‌మ‌యం సవ్యంగా కుద‌ర‌క‌పొవడం..కోవిడ్ ఆంక్ష‌లు స‌హా థియేట‌ర్లు  స‌క్రమంగా ర‌న్నింగ్ లో లేక‌పోవ‌డం వంటి కార‌ణాలుగా `సూర్య‌వంశీ` లాంటి సినిమా కిల్ అయింది.

వాస్త‌వానికి ఈ సినిమాకి తొలి షోతోనే  పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ఓపెనింగ్ డే వ‌సూళ్లు  బాగున్నాయి. కానీ అంతిమంగా బాక్సాపీస్ వ‌ద్ద అంచ‌నాలు మాత్రం అందుకోలేక పోయింది. దీంతో సూర్య వంశీ వైఫ‌ల్యాల జాబితాలో చేర్చాల్సి వ‌స్తోంది.  `ఆట్రంగిరే`కి పాజిటివ్ టాక్ వ‌చ్చింది. కానీ క‌మ‌ర్శియ‌ల్ గా స‌క్సెస్ కాలేదు. ఇక `బెల్ బాట‌మ్`..`బ‌చ్చ‌న్ పాండే` చిత్రాలు అక్ష‌య్ రేంజ్ ని త‌గ్గించిన చిత్రాలుగా విమ‌ర్శ‌ల్ని మూట‌గ‌ట్టుకున్నాయి.

మ‌రికొన్ని సినిమాలు కంటెంట్ వైఫ‌ల్యంగా   తెలుస్తున్నాయి. దీంతో అభిమానులు అక్ష‌య్ మ‌ళ్లీ ఫామ్ లో కి వ‌చ్చేదెప్పుడు? అంటూ సందేహాలు వ్య‌క్తం చేస్తున్నారు. స్ర్కిప్ట్ ల‌ పరంగా జాగ్ర‌త్త‌లు..సూచ‌న‌లు..స‌ల‌హాలు ఇస్తున్నారు. ఎంగేజింగ్  స్ర్కిప్ట్ లు..ప్రేక్ష‌కుల‌కి క‌నెక్ట్ అయ్యే సులువైన క‌థ‌లు చేయాలంటూ  కోరుతున్నారు.

ప్ర‌స్తుతం అక్ష‌య్ లైన‌ప్ చూస్తే.. సూర్య న‌టించిన  `సూరరై పొట్రు` (ఆకాశ‌మే నీ హ‌ద్దురా)  హిందీ రీమేక్‌లో న‌టిస్తున్నారు. ఇటీవ‌లే  ఈ సినిమా  ఇటీవల ప్రకటించారు. అలాగే `రామ్ సేతు`.. `సెల్ఫీ`..` ఓ మైగాడ్ -2` చిత్రాలు చేతిలో ఉన్నాయి. వీటీతో పాటు కొన్ని కొత్త ప్రాజెక్ట్ ల‌కు సంబంధించి చ‌ర్చ‌లు జ‌రుగుతున్నాయి.