Begin typing your search above and press return to search.
బాలీవుడ్ బాద్షాకు ఇదేం కక్కుర్తి? 11 ఏళ్ల నాటి సీన్ మళ్లీ రిపీట్!
By: Tupaki Desk | 13 Nov 2022 8:09 AM GMTకోట్లాది మంది అభిమానులే కాదు.. ఆయన పేరే ఒక బ్రాండ్ గా ఉండే బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్. గడిచిన కొంతకాలంగా ఆయనకు పరిస్థితులేమీ కలిసి రావటం లేదు. సినిమాలు బాక్సాఫీస్ వద్ద పల్టీలు కొడుతుంటే.. ఆ మధ్యన కొడుకు డ్రగ్స్ కేసులో బుక్ అయి.. బెయిల్ మీద బయటకు రావటం తెలిసిందే. ఇంటా.. బయటా అన్నతేడా లేకుండా వరుస ఎదురుదెబ్బలు తగులుతున్న వేళ.. మరింత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అయినప్పటికీ అతగాడు పడుతున్న కక్కుర్తి.. షారుక్ ను మరిన్ని ఇబ్బందులకు గురి చేస్తుంది. తాజాగా అలాంటి ఉదంతమే ఒకటి చోటు చేసుకుంది.
ఇటీవల దుబాయ్ లో ముగిసిన ఇంటర్నేషనల్ బుక్ ఫెయిర్ కు హాజరైన షారుక్ తాజాగా ముంబయి ఎయిర్ పోర్టుకు చేరుకున్నాడు. అయితే.. ఆయన్ను అడ్డుకున్నకస్టమ్స్ అధికారులు ఆయన్ను ఎయిర్ పోర్టులో ఆపేశారు. తనకు అడ్డా లాంటి ముంబయి ఎయిర్ పోర్టులో ఆయనకు ఇలాంటి పరిస్థితి ఎందుకంటే.. అతగాడి కక్కుర్తే కారణమని చెబుతున్నారు. బుక్ ఫెయిర్ తర్వాత షాపింగ్ చేసిన షారుక్ రూ.18 లక్షలు విలువైన ఒక ఖరీదైన వాచ్ ను కొనుగోలు చేశారు.
అంతవరకు బాగానే ఉన్నా.. ఆ వాచీ మీద కట్టాల్సిన కస్టమ్స్ ఫీజును ఆయన కట్టలేదు. ఇదిలా ఉంటే.. ఆయన లగేజ్ ను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేయగా.. ఈ ఖరీదైన వాచ్ అధికారుల కంట పడింది. దీంతో.. ఆయన్ను ఎయిర్ పోర్టులో ఆపేశారు. వాచీ వివరాలపై ఆరా తీసిన అధికారులకు.. చెల్లించాల్సిన పన్నును చెల్లించలేదని గుర్తించారు. దీంతో.. ఆయన్ను ఎయిర్ పోర్టులో నిలిపివేసిన అధికారుల దెబ్బతో.. చివరకు రూ.6.83 లక్షల కస్టమ్స్ డ్యూటీని కట్టిన తర్వాత కానీ ఆయన్ను బయటకు పంపలేదు.
దాదాపు పదకొండేళ్ల క్రితం అంటే.. 2011లోనూ ఎయిర్ పోర్టులో ఇలానే కస్టమ్స్ అధికారులకు షారుక్ దొరికారు. అప్పట్లో కూడా ఆయన కస్టమ్స్ డ్యూటీ కట్టకుండా దొరికిపోవటం.. చివరకు రూ.1.5 కోట్ల మొత్తాన్ని కట్టేసి బయటకు వచ్చారు. బాలీవుడ్ బాద్షాగా పేరున్న షారుక్ కు.. ఇంత కక్కుర్తి ఏమిటి? అన్న ప్రశ్న తలెత్తుతోంది. చిన్నచిన్న మొత్తాల కోసం ఇలాంటి తప్పులు చేసి.. అవమానానికి గురి కావటంలో అర్థం లేదంటున్నారు.