Begin typing your search above and press return to search.
అత్తమామల్ని ఆనాడే బుట్టలో వేసేసిన అలియాభట్!
By: Tupaki Desk | 14 April 2022 8:30 AM GMTరణబీర్ కపూర్ ని పెళ్లాడి అలియాభట్ మరికొన్ని గంటల్లోనే కపూర్ ఇంట కోడలిగా గుమ్మంలోకి అడుగుపెట్టబోతుంది. ఇకపై ఇంటి బాధ్యతలన్ని నీతూ కపూర్ కొత్త కోడలికి అప్పగించడానికి రెడీ అవుతున్నారు. భర్త రిషీ కపూర్ మరణంతో కృంగి పోయిన నీతు కపూర్ ఒక్కరే ఇంటి బాధ్యతలు తీసుకోవడం కొంత కాలంగా కష్టంగా మారింది. వయసు మీద పడటం సహా చిన్నపాటి ఆరోగ్య ఇబ్బందులు తప్పలేదు. ఇప్పుడా బాధా బందీలు అన్నింటిని కొత్త కోడలికి అప్పగించనున్నారు.
ఇక ఈ కొత్త కొడల్ని అత్త నీతూ కపూర్ ఆనాడే మెచ్చింది. ``నాకు అలియా అంటే చాలా ఇష్టం. అందమైన ..అద్భుతమైన వ్యక్తి. రణబీర్ కి మంచి జోడీ అవుతుందని మనసులో ఇన్నాళ్లు ఉండేది. ఇప్పుడదని నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. వాళ్ల పెళ్లి కోసం ఎదురుచూస్తున్నాని`` నీతు తెలిపారు.
ఇక అలియాని మామ రిషీ కపూర్ ఎప్పుడు మెచ్చుకునే వారుట. ``ప్రస్తుతం ఉన్న యువ హీరోయిన్లలో అలియాభట్ బాగుంటుందని.. అత్యంత ప్రతిభావంతురాలు అవుతుందని`` చెప్పేవారుట. ఇక అలియాతో -రిషీ కపూర్ అనుబధం `స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్` తో మొదలైంది. ఆ తర్వాత `కపూర్ అండ్ సన్స్` లోనూ ఈ ద్వయం పనిచేసారు.
అలా అలియా రీషికి బాగా దగ్గరయ్యారు. అప్పటి నుంచే అలియాభట్ అంటే రిషీ కపూర్ ప్రేమ చూపించేవారని..అలాగే మహేష్ భట్ తో తనకున్న అనుబంధం గురించి కొత్త కోడలికి సందర్భం వచ్చినప్పుడల్లా వివరించేవారుట.
అయితే ఇదంతా జరగడానికి కారణం అలియాభట్ నే. కపూర్ కుటుంబంతో తొలి నుంచి మంచి సాన్నిహిత్యం కల్గి ఉందిట. రణబీర్ ప్రేమ..ఆ కుటుంబంతో సాన్నిహిత్యం ఇలా పెళ్లికి మార్గం సుగమయం అయ్యేలా చేసిందని భావించొచ్చు. ఇక రణబీర్ అంటే అలియా కి 2005 లోనే తొలి క్రష్ అని చెప్పింది. సంజయ్ లీలా బన్సాలీ సెట్ లో రణబీర్ ని చూసి ప్లాట్ అయిపోయిందిట.
`బ్లాక్` సినిమా కోసం ఆడిషన్ చేస్తున్నప్పుడు రణబీర్ అప్పుడు సంజయ్ వద్ద అసిస్టెంట్ గా పనిచేస్తున్నారు. అక్కడే తొలిసారి రణబీర్ కి మనసిచ్చేసాను అని తెలిపింది. కానీ ఈ విషయం ఇప్పటివరకూ ఎవరికి తెలియదని.. ఇద్దరు ప్రేమించుకుంటుంది ఐదేరేళ్ల కాలంగానేనని తెలిపింది. అలాగే కాపీ విత్ కరణ్ షోలోనూ రణబీర్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. `స్వయంవరం` నిర్వహిస్తే ఏ హీరోను కోరుకుంటారు అంటే టక్కున రణబీర్ పేరు చెప్పింది. ఆ తర్వాత సల్మాన్ ఖాన్ ..మూడవ స్థానంలో ఆదిత్య కపూర్ అని తెలిపింది.