Begin typing your search above and press return to search.
బాలీవుడ్ విడాకుల పర్వం అన్ స్టాపబుల్
By: Tupaki Desk | 14 May 2022 10:31 AM GMTబాలీవుడ్ లో డేటింగ్, లవ్, అన్నీ కుదిరితే పెళ్లి.. ఆ తరువాత విడాకులు సర్వసాధారణగా మారింది. ప్రేమలో పడటం.. డేటింగ్ ని ఏళ్ల పాటు కొనసాగించడం.. తరువాత సింపుల్ గా బ్రేకప్ చెప్పేసుకోవడం.. లేదంటే పెళ్లి చేసుకున్న జంటలైతే చాలా సింపుల్ గా విడాకులు తీసుకోవడం ఇక్కడ నిత్యకృత్యంగా మారింది. బాలీవుడ్ సెలబ్రిటీల్లో చాలా వరకు విడాకులు తీసుకుని వార్తల్లో నిలిచిన వారి సంఖ్య ఏడాదికేడాదికి పెరిగిపోతూనే వుంది. వెండితెరపై పర్ ఫెక్ట్ స్టార్లుగా పేరు తెచ్చుకున్న వారు కూడా విడాకులు తీసుకుంటూ రాంగ్ ఇండికేషన్స్ అందిస్తున్నారు.
హృతిక్ రోషన్ నుంచి నేటి సోహైల్ ఖాన్ వరకు విడాకులు ప్రకటించిన బాలీవుడ్ తారలంతా ఏళ్ల తరబడి వివాహ బంధానికి కట్టుబడి.. వైవాహిక జీవితాన్ని అనుభవంచిన వారే కావడం గమనార్హం. వీరి బ్రేకప్ డైవర్స్ కహానీలు అన్ స్టాపబుల్ గా సాగుతూనే వున్నాయి. బాలీవుడ్ లో స్టార్ హీరోగా పేరు తెచ్చుకున్న హృతిక్ రోషన్ తన చిరకాల స్నేహితురాలు సునన్నే ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. మతాలు వేరైనా 14 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని సాగించారు. ఇద్దరు పిల్లలు పుట్టిన తరువాత అనూహ్యంగా విడాకులు తీసుకుని విడి విడిగా వుంటున్నారు.
వెండితెరపై ప్రత్యేక గీతాలకు పెట్టింది పేరుగా నిలిచిన హాట్ లేడీ మలైకా అరోరా. అర్భాజ్ ఖాన్ ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 18 ఏళ్లు సాఫీగా సాగిన వీరి వైవాహిక జీవితం ఆ తరువాతే గాడి తప్పింది. ఫ్యాషన్ రంగంలోనూ, సినిమాల్లోనూ బిజీగా వున్న మలైకా అరోరా యంగ్ హీరో అర్జున్ కపూర్ లో కలిసి డేటింగ్ చేస్తుండటంతో అర్భాజ్ ఖాన్ తన వివాహ బంధానికి ముగింపు పలకాల్సి వచ్చింది. వీరి 18 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా ఓ తనయుడు కూడా వున్నాడు. అర్భాజ్ తో విడిపోయిన మలైక త్వరలోనే తన కంటే చిన్నవాడైన అర్జున్ కపూర్ ని వివాహం చేసుకోబోతోంది. ఇటీవలే ఈ విషయాన్ని వెల్లడించింది కూడా.
వీరి తరువాత బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ తన భార్య అమృతా సింగ్ కి విడాకులిచ్చాడు. ఇద్దరు పిల్లలు వున్నా ఇద్దరి మధ్య మనస్పర్థలు తలెత్తడంతో రెండు దశాబ్దాల వైవాహిక జీవితానికి పుల్ స్టాప్ పెట్టి కరీనా కపూర్ ని రెండో పెళ్లి చేసుకోవడం.. తనకూ పిల్లుల పుట్టడం తెలిసిందే. ఇక దర్శకుడు, హీరో ఫర్హాన్ అక్తర్ కూడా తన భార్య అధూన బబానీకి విడాకులిచ్చాడు. 16 ఏళ్ల వైవాహిక జీవితానికి ఎండ్ కార్డ్ వేసేశాడు. ఇటీవలే శిబానీ దండేకర్ ని వివాహం చేసుకున్నాడు.
అలియాభట్ సోదరి పూజా భట్ కూడా తన భర్తకు విడాకులిచ్చేసింది. బాలీవుడ్ తెరపై అత్యుత్తమ మైన చిత్రాల్లో నటిస్తూ మిస్టర్ పర్ ఫెక్ట్ అనిపించుకున్న అమీర్ ఖాన్ ప్రేమించి కిరణ్ రావుని వివాహం చేసుకున్నాడు. కొన్నేళ్లు వీరి వైవాహిక జీవితం సాఫీగానే సాగింది. అంతా ఆదర్శ జంట అంటూ చెప్పుకున్నారు. కట్ చేస్తే 16 ఏళ్ల వైవామిక జీవితానికి సడన్ గా ఎండ్ కార్ట్ వేసేశారు. ఇద్దరూ అభిమానులకు షాకిస్తూ విడాకులు తీసుకున్నారు.
వీరి తరహాలోనే అర్జున్ రాంపాల్, మిలింద్ సోమన్, మధు మంతెన - కసబా గుప్తా, హిమేష్ రేష్మియా, కొంకణ సేన్ శర్మ, అనురాగ్ కష్యప్ - కల్కీకోయిచ్లిన్, చిత్రాంగద సింగ్ , కరీష్మా కపూర్, మనీషా కోయిరాలా, శ్వేతా తివారి విడాకులు తీసుకున్నారు. తాజాగా సల్మాన్ ఖాన్ బ్రదర్ సోహైల్ ఖాన్ విడాకులకు రెడీ అయిపోవడం విచారకరం. ఇలా బాలీవుడ్ విడాకుల పర్వం అన్ స్టాపబుల్ గా సాగుతూనే వుంది. వచ్చే ఏడాది ఏఏ జంట విడాకులకు రెడీ అవుతుందో చూడాలి మరి