Begin typing your search above and press return to search.

కరోనా వేళ.. బాలీవుడ్ బ్యాచ్ ఎంత బిజీనో చెప్పేస్తున్నారే

By:  Tupaki Desk   |   23 March 2020 7:03 AM GMT
కరోనా వేళ.. బాలీవుడ్ బ్యాచ్ ఎంత బిజీనో చెప్పేస్తున్నారే
X

కరోనా వేళ మస్తు ఖాళీ. పని లేదు. బయటకు వెళ్లే పరిస్థితి అసలు లేదు. నిత్యం లొకేషన్లు.. సీన్ పేపర్లు.. కెమేరా.. యాక్షన్.. ఇలాంటి మాటలే వినకుండా.. ఎవరికి వారు.. వారి ఇళ్లల్లోనే ఉండిపోవాల్సిన పరిస్థితి. పని.. పని.. అన్నట్లుగా పని చేయటం.. ఏ మాత్రం ఖాళీ దొరికినా తమకు నచ్చిన ప్రదేశాలకో.. విదేశాలకో తుర్రుమనే బాలీవుడ్ తారలంతా ఇప్పుడు ఇంటికే పరిమితమే కాదు.. ఇల్లే లోకంగా మారిపోయింది. ఇలాంటివేళ.. పలువురు సెలబ్రిటీలు తామేం చేస్తున్న విషయాన్ని చెప్పుకున్నారు.

సోషల్ మీడియాలో వారు పెట్టే పోస్టులు చూసినప్పుడు అనిపించేది ఒక్కటే. తిరిగే కాలు.. తిట్టే నోరును ఆపలేమన్నట్లుగా.. నిత్యం ఏదో పనిలో బిజీగా ఉండే తారలు.. కరోనా వేళలోనూ బిజీగానే ఉంటున్నారు. తమకు నచ్చినదాన్ని చేసుకుంటూ కాలం గడిపేస్తున్నారు. కొందరు తాము చేస్తున్న పనుల్ని సోషల్ మీడియా వేదికగా చెప్పేస్తే.. మరికొందరు మాత్రం మౌనంగా ఉండిపోయారు. అలా అని వారేం చేయకుండా ఉన్నట్లు కాదు. తామేం చేస్తున్నామన్న విషయాల్ని బయటకు చెప్పటానికి పెద్దగా ఇష్టపడటం లేదనే చెప్పాలి.

తన బాల్కనీలో దిగిన ఫోటోను కరిష్మా పోస్టు చేసి.. ధైర్యంగా ఉందాం.. ఆశావహంగా ఉండాలంటూ రేపటి రోజు గురించి ధైర్యాన్ని రంగరించే ప్రయత్నం చేసింది. ఆమె సోదరి కరీనా తన చిన్ననాటి ఫోటోను షేర్ చేసింది. అంటే.. పాత గురుతుల్ని రివైండ్ చేసుకునే పనిలో బిజీగా ఉన్నదన్నమాట. అదే సమయంలో తన భర్త సైఫ్ సీరియస్ గా పుస్తకం చదువుతున్న ఫోటోను పోస్టు చేసింది. క్యాండిల్ లైట్ వెలుతురులో మహా సీరియస్ గా పుస్తకం చదువుతున్న సైఫ్ ఫోటో ఆకట్టుకునేలా ఉంది.

తన పెంపుడు కుక్కతో కలిసి బాల్కనీలో కూర్చొని టైంపాస్ చేస్తుంది మలైక. అలియాభట్.. కంగనాలు తాము చదువుతున్న పుస్తకాలేమిటో చెప్పారు. వరుస హిట్లతో మాంచి ఊపు మీద ఉన్న ఆయుష్మాన్ ఖురానా తనకు తోచిన బొమ్మలు వేస్తూ బిజీగా ున్నాడు. అక్షయ్ కుమార్ ఇంట్లో కూతురుతో ఆటలాడుకోవటంతో బిజీగా ఉంటే.. వారి పుణ్యమా అని తాను రాయాల్సిన పుస్తకం రాయలేకపోతున్నట్లు ట్వింకిల్ ఖన్నా చెప్పుకొచ్చింది. దీపికా స్కిన్ కేరింగ్ తో పాటు వార్డురోబ్ ను క్లియర్ చేసే పనిలో ఉంటే.. ప్రియాంక కుక్కతో సరదాగా గడిపేస్తోంది. ఖాళీగా ఉన్న వేళ.. గిటార్ కు పని చెబుతోంది కత్రినా.. సల్మాన్ బొమ్మలు వేస్తూ.. వేళ్లకు ఎక్స్ ర్ సైజులు చేస్తుంటే.. యువ హీరో సిద్దార్థ్ మల్హోత్రా పుస్తకాల పురుగుగా మారాడు. ఇలా ఎవరికి వారు.. ఇంటి పనుల్లో.. తమ వ్యక్తిగత అభిరుచులకు తగ్గట్లుగా మారి బిజీగా ఉంటున్నారు.