Begin typing your search above and press return to search.
ఛాన్సులు లాక్కున్నారంటూ హీరోయిన్ ఆరోపణలు!
By: Tupaki Desk | 10 July 2023 6:00 AM GMTబాలీవుడ్ నటి అమీషా పటేల్ సంచలన ఆరోపణలు చేసారు. తన విజయాన్ని చూసి కొందరు ఓర్వలేకపో యారని...తన ఎదుగుదలని జీర్ణించుకోలేక కొంత మంది వెన్నుపోటు దారులుగా మారితే..మరికొంత మంది తన అవకాశాల్నే లాగేసుకున్నారని ఆరోపించింది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో అమీషా ఈ వ్యాఖ్యలు చేసారు.
`నేను ఫిల్మ్ ఇండస్ట్రీలో కాలుపెట్టిన సమయంలో నాతో పాటూ యాక్టర్లు.. నిర్మాతలు పిల్లలు అరంగేట్రం చేశారు. కరీనా కపూర్.. అభిషేక్ బచ్చన్.. హృతిక్ రోషన్.. తుషార్ కపూర్.. ఈషా డియోల్.. ఫర్దీన్ ఖాన్.. ఇలా చాలా మంది వారసులు వచ్చారు. ఎటు తలతిప్పినా సినీకుటుంబాలకు చెందిన మూడో తరం వారు కనిపించేవారు. వాళ్ల మధ్యలో నేను ఒక్కరినే. ఎలాంటి సహకారం లేకుండా పరిశ్రమకి వచ్చినదాన్ని.
నాకు వచ్చిన అవకాశాలతో సంతృప్తిగా సినిమాలు చేసేదాన్ని. అలా నటిగా ఎదిగాను. సెట్లో నా పని చూసుకోవడం తప్ప ఇతర విషయాల పట్ల అనాసక్తిగా ఉండేదాన్ని. పుస్తకాలు చదువుకునేదాన్ని. నా పని తప్ప ఇతర విషయాల గురించి పట్టించుకునే దాన్ని కాదు. ముఖ్యంగా ఎవరిపైనా రూమర్స్ గురించి మాట్లాడేదాన్ని కాదు. సెట్లో చీటికీమాటికీ అలకలుబూనే దాన్ని కాదు.
ఇలా ఉండటం కూడా అక్కడ భావ్యం కాదు. నేను అతి చేస్తున్నానని కొందరు అనుకునేవారు. నా చుట్టూ ఉన్న సహచరులు అలా భావించి వదల్లేదు వారు నా సక్సెస్ చూసి ఓర్వలేకపోయారు. కొందరు నా నుంచి సినిమాలను కూడా లాగేసుకున్నారు` అని అంది.
అమీషా పటేల్ బాలీవుడ్ లో హృతిక్ రోషన్ సరసన `కహోనా ప్యార్ హై` సినిమాతో అరంగేట్రం చేసింది. ఆ సినిమా బంపర్ హిట్ కావడంతో అమీషా పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. కొన్నాళ్ల పాటు నటిగా తిరిగి లేని జర్నీ సాగించింది. అటుపై `బద్రీ` సినిమా తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ ఇక్కడ ఎక్కువగా సినిమాలు చేయలేదు. బాలీవుడ్ కెరీర్ పైనే దృష్టి పెట్టి పనిచేసింది.