Begin typing your search above and press return to search.
హార్ట్ ఎటాక్ తో కామసూత్ర హీరోయిన్ కన్నుమూత
By: Tupaki Desk | 22 April 2019 7:22 AM GMTబాలీవుడ్ హీరోయిన్ సైరా ఖాన్ గుండెపోటుతో నిన్న మరణించింది. సైరా ఖాన్ బాలీవుడ్ లో స్టార్ ఇమేజ్ సాధించలేదు కానీ 2013 లో రిలీజ్ అయిన హిందీ చిత్రం 'కామసూత్ర 3D' లో లీడ్ హీరోయిన్ గా నటించి గుర్తింపు సంపాదించుకుంది. సైరా కు ఈ సినిమానే బాలీవుడ్ లో డెబ్యూ ఫిలిం.
ఈ సినిమాతో పాటుగా ఆమె కొన్ని రీజనల్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. ఆమె మరణ వార్త విన్న తర్వాత 'కామసూత్ర 3D' దర్శకుడు రూపేష్ పాల్ తన సంతాపం వ్యక్తం చేశారు. "నాకు ఈ వార్త తెలిసిన వెంటనే నేను షాక్ కు గురయ్యాను. అన్నిటికంటే నన్ను బాధించిన అంశం ఏంటంటే సైరా మరణ వార్తను ఎక్కడా కూడా రిపోర్ట్ చేయకపోవడం. ఆమె నటనా ప్రతిభను మనం గుర్తించాలి. ఇది విషాదకరమైన సమయం.. ఆమె ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను" అని తెలిపారు.
నిజానికి 'కామసూత్ర 3D' సినిమాలో మొదట సైరాను హీరోయిన్ గా తీసుకోలేదట. దర్శకుడు మొదట షెర్లిన్ చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారట. కానీ లాస్ట్ మినిట్ లో ఆమె స్థానంలో సైరాను ఎంపిక చేశారట. ఒక సంప్రదాయ ముస్లిం కుటుంబం నుంచి రావడంతో ఇలాంటి శృంగార చిత్రంలో నటించేందుకు ఆమె ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొందట. అయినా నటనపై ఉన్న ప్యాషన్ తో ఈ సినిమాలో నటించిందట. ఏదేమైనా ఒక ప్రతిభావంతమైన నటి ఇలా తక్కువ వయసులో తనువు చాలించడం బాధాకరమైన విషయమే.