Begin typing your search above and press return to search.

మలైకా ఫోటో.. కామెంట్ల ఫైటు!

By:  Tupaki Desk   |   30 May 2019 10:19 AM GMT
మలైకా ఫోటో.. కామెంట్ల ఫైటు!
X
ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నంబర్ అంటూ ఉంటారు కానీ బాలీవుడ్ నటీమణి మలైకా అరోరాను చూసినప్పుడు మాత్రమే ఆ స్టేట్ మెంట్ నిజం అనిపిస్తుంది. నలభై ఆరేళ్ళ వయసులో ఇరవై ఆరేళ్ళ ఫిట్నెస్ ను చూపించడం మలైకాకు మాత్రమే సొంతం. నిజజీవితంలో కొంతమంది అమ్మమ్మలు అయ్యే వయసది. కానీ మలైకా మాత్రం అలా గ్లామర్ మెయింటెయిన్ చెయ్యడం సాధారణమైన విషయమేమీ కాదు. అందుకే మలైకాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ చాలా ఎక్కువ.

రీసెంట్ గా మలైకా ఒక హాట్ ఫోటోను తన ఇన్స్టా ఖాతా పోస్ట్ చేసింది. ఒక హాట్ ఇన్నర్ వేర్ ధరించి అందాలను ధారబోస్తూ పోజిచ్చింది. తన జుట్టుకు ఒక హెయిర్ బ్రాండ్ పెట్టుకుంటున్నట్టుగా చేతులతో తన జుట్టును పట్టుకుంది. సాధారణంగా ఇలాంటి ఫోటోలు పోస్ట్ చేసినప్పుడు నెటిజనులు అందరూ అందాలను పొగుడుతూ పిట్టలదొరల్లా.. భట్రాజుల్లా రెచ్చిపోతారు. కానీ ఫోటోను కొంతమందే మెచ్చుకున్నారు. ఎక్కువ మంది విమర్శలు ఎక్కుపెట్టారు. వారికి కొంతమంది కౌంటర్లు ఇచ్చారు.

ఇదంతా ఎందుకు జరిగిందంటే ఈ ఫోటోలో మలైకా అండర్ ఆర్మ్స్ షేవ్ చేసుకోలేదు. దీంతో హెయిర్ కనిపిస్తోంది. చాలామంది ఆ విషయాన్ని చెప్తూ ట్రోల్ చేశారు. ఇక స్త్రీవాదులు కొందరు బూస్ట్ తాగి దాడికి వచ్చారు. "మగాళ్ళు చంకల్లో వెంట్రుకలతో అడివి మనుషుల్లా తిరుగుతారు.. మరి లేడీసు మాత్రం షేవ్ చేసుకోవాలా? ఇది ఏం న్యాయం. ఏం చట్టం.. రాజ్యాంగంలో ఏ సెక్షన్లో ఇలా ఉంది" అంటూ ట్రోలర్లపై విరుచుకుపడ్డారు. కొంతమంది మోడరన్ నెటిజనులు మాత్రం 'బోల్డ్' అని 'న్యాచురల్' అని మెచ్చుకున్నారు. ఏదైతేనేం.. మలైకా ఫోటో ఒక హాట్ టాపిక్ అయింది. ఇంకా ఆ ఫోటో కింద కామెంట్స్ సెక్షన్ లో ఇప్పటికీ వాదోపవాదాలు కొనసాగుతున్నాయి.