Begin typing your search above and press return to search.

అయ్యో..అబ్బా..ఓ ర‌మ్మా జాన్వీ ఊత ప‌దాలు!

By:  Tupaki Desk   |   18 Nov 2022 2:30 PM GMT
అయ్యో..అబ్బా..ఓ ర‌మ్మా జాన్వీ ఊత ప‌దాలు!
X
అతిలోక సుంద‌రి శ్రీదేవి వార‌సురాలిగా జాన్వీక‌పూర్ బాలీవుడ్ లో దూసుకుపోతున్న సంగ‌తి తెలిసిందే. కెరీర్ ప‌రంగా అక్క‌డ ఎలాంటి ఢోకా లేదు. తండ్రి బోనీ క‌పూర్ సూచ‌న‌లు..స‌ల‌హాలు పాటిస్తూ సంతోషంగా సాగిపోతుంది.

అమ్మ‌డు హిందీ లో తెరంగేట్రం చేసి నాలుగేళ్లు అవుతుంది. మ‌రి ఇన్నేళ్ల‌లో జాన్వీ ఎన్నిసార్లు హైద‌రాబాద్ వ‌చ్చింది? వ్య‌క్తిగ‌త విజిట్ ప‌క్క‌న‌బెడితే సినిమా ప్రమోష‌న్ కోసం భాగ్య‌న‌గ‌రంలో కాలు పెట్టిన సంద‌ర్భాలు? ఎన్ని అంటే ఇంత వ‌ర‌కూ ఒక్క‌సారే అలాంటి స‌న్నివేశం చోటు చేసుకున్న‌ట్లు తెలుస్తోంది.

జాన్వీ ప్ర‌ధాన పాత్ర‌లో న‌టించిన 'మిలీ' ఇటీవ‌ల ప్రేక్ష‌కుల ముందుకొచ్చిన సంగ‌తి తెలిసిందే. రిలీజ్ ప్ర‌మోష‌న్ లో భాగంగా అమ్మ‌డు తొలిసారి అధికారికంగా హైద‌రాబాద్ వ‌చ్చింది. తెలుగు సంప్ర‌దాయం ఉట్టిప‌డేలా ఏకంగా జెర్రీ చీర‌..జాకెట్ లోనే మెరిసింది. ఇలా చీర జాకెట్ ధ‌రించ‌డం వెనుక ఓ క‌థ ఉంది. త‌ల్లి శ్రీదేవి పుట్టిన గ‌డ్డ ప‌క్క‌నే త‌మిళ‌నాడు.

ఆంధ్ర‌ప‌దేశ్ తోనూ ఆమె బంధం విడ‌దీయ‌రానిది. ఇక్క‌డ బంధులువులున్నారు. అంత‌కు మంచి తెలుగు సినిమాని ఏలిన చ‌రిత్ర ఆమె సొంతం. కోట్లాది మంది అభిమానుల్ని సంపాదించుకున్న తార‌. ఇలా ఎన్నో ప్ర‌త్యేక‌త‌లు ఉన్నాయి కాబ‌ట్టి జాన్వీ క‌పూర్ సంప్ర‌దాయంగా చీర‌క‌ట్టులో ద‌ర్శ‌న‌మిచ్చింది. త‌ల్లికి త‌గ్గ త‌న‌య గానూ నీరాజనాలు అందుకుంది.

మ‌రి జాన్వీ క‌పూర్ కి తెలుగు భాష సంగ‌తేంటి? అంటే ఓ ఇంట్రెస్టింగ్ థింగ్ ఒక‌టుంద‌నిపిస్తుంది. అవును అమ్మ‌డికి తెలుగు భాష మాట్లాడ‌టం రాక‌పోయినా...తెలుగులో ఓ మూడు ఊత ప‌దాల్ని మాత్రం ఉతికారేసింద‌ని చెప్పొచ్చు.

తెలుగులో మీ ఉత ప‌దాలేంటి? అని 'ప్రశ్నించ‌గా..'అయ్యో ..ఓ ర‌మ్మా...అబ్బా' అంటూ తెలుగు నెటివిటీ ఎ క్స్ ప్రెషెన్స్ తో చంపేసింది. తెలుగు మాట్లాడ‌టం రాక పోయినా క్యాచీగా ఉండే ఆ మూడు ప‌దాలు మాట్లాడేసి తెలుగు ఆడియ‌న్స్ ని బుట్ట‌లో వేసేసుకుంది. ఇక తెలుగు సినిమాల్లో న‌టించ‌డం మొద‌లు పెడితే జాన్వీ తెలుగు వేగాన్ని త‌ట్టుకోవ‌డం అంత వీజీ కాదు సుమీ.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.