Begin typing your search above and press return to search.

కొత్త జీవితం కోసం విడాకులు తీసుకుందట

By:  Tupaki Desk   |   12 March 2019 12:47 PM GMT
కొత్త జీవితం కోసం విడాకులు తీసుకుందట
X
బాలీవుడ్‌ స్టార్‌ కపుల్స్‌ అర్బాజ్‌ ఖాన్‌ మరియు మలైకా అరోరా తమ 19 ఏళ్ల వైవాహిక జీవితంకు ఫుల్‌ స్టాప్‌ పెడుతూ విడాకులు తీసుకున్న విషయం తెల్సిందే. 2016వ సంవత్సరంలో వీరిద్దరు అధికారికంగా విడాకులు తీసుకున్నారు. వీరికి అర్హాన్‌ అనే కుమారుడు ఉన్నా కూడా ఇద్దరు వారి వారి జీవితాల కోసం విడాకులు తీసుకున్నారు. సుదీర్ఘ వైవాహిక జీవితం తర్వాత విడాకులు తీసుకోవడం అనేది చాలా అరుదుగా చూస్తూ ఉంటాం. ఈ విడాకులకు ప్రధాన కారణం మలైకా అరోరా అనే విమర్శలు మొదటి నుండి వస్తున్నాయి. విడాకులు తీసుకుని రెండు సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటి వరకు మలైక స్పందించేందుకు ఆసక్తి చూపించలేదు. ఎట్టకేలకు ఆమె విడాకుల విషయమై మాట్లాడింది.

నేను విడాకులు తీసుకుంటానన్న సమయంలో కొందరు నా నిర్ణయంను తప్పుబట్టారు. అయితే కొత్త జీవితం కోసం నేను విడాకులు తీసుకోక తప్పలేదు. విడాకుల వల్ల నాకు కొత్త జీవితం ప్రారంభించడానికి మార్గం లభించింది. ప్రస్తుతం నేను స్వేచ్చగా ఉన్నాను అంటే అది విడాకుల వల్లే, విడాకుల తర్వాత నేను ఏ క్షణంలో కూడా తప్పని అనుకోలేదు. చాలా ఆలోచించిన తర్వాతే నేను తీసుకున్న నిర్ణయం కనుక నేను ఎప్పుడు కూడా పశ్చాతాప పడింది లేదు. కొత్త ఛాయిస్‌ వెదుకునేందుకు, కొత్త నిర్ణయాలు తీసుకునేందుకు నేను ఇప్పుడు పూర్తి స్వేచ్చగా ఉన్నానంటూ చెప్పుకొచ్చింది. విడాకుల తర్వాత నా స్నేహితులు కొందరు నా నిర్ణయాన్ని అభినందించారు. కొత్త రిలేషన్‌ ను, కొత్త ప్రేమను నేను కోరుకుంటున్నాను అంటూ మలైకా అరోరా చెప్పుకొచ్చింది.

విడాకులకు ముందు నుండే బాలీవుడ్‌ యంగ్‌ హీరో అర్జున్‌ కపూర్‌ తో మలైకా అరోరా ప్రేమ వ్యవహారం కొనసాగిస్తుందనే టాక్‌ ఉంది. ప్రస్తుతం వీరిద్దరు పెళ్లికి రెడీ అవుతున్నారు. ఇన్నాళ్లు గుట్టుగా ఉన్న వీరి వ్యవహారం ఈమద్యే బహిరంగం అయ్యింది. మరి కొన్ని వారాల్లోనే వీరిద్దరు అధికారికంగా పెళ్లి చేసుకునే అవకాశం ఉంది. మరో వైపు అర్బాజ్‌ ఖాన్‌ కూడా జార్జియా ఆండ్రియానా అనే మోడల్‌ తో డేటింగ్‌ లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అర్బాజ్‌ ఖాన్‌ కూడా త్వరలో పెళ్లి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.