Begin typing your search above and press return to search.

ఎంతపని అయ్యుండేది ప్రియాంక!

By:  Tupaki Desk   |   13 Feb 2019 11:26 AM GMT
ఎంతపని అయ్యుండేది ప్రియాంక!
X
బాలీవుడ్ భామ ప్రియాంక చోప్రా గ్లోబల్ సుందరిగా మారడం.. ఆ తర్వాత అమెరికన్ సింగర్ నిక్ జోనాస్ ను వివాహం చేసుకోవడం అందరికీ తెలిసిన విషయాలే. తనకంటే చిన్నవాణ్ని పెళ్లి చేసుకున్నందుకు అంతర్జాల అమ్మలక్కలు.. పనిలేని మగ నెటిజనులు నొసలు చిట్లించారనుకొండి.. అయినా అవేమీ పట్టించుకోకుండా నిక్-ప్రియాంకలు ఒకటై నిక్యాంకగా మారి చెట్టాపట్టాలేసుకొని తిరుగుతున్నారు. కానీ రీసెంట్ గా అలా చెట్టాపట్టాలేసుకొని తిరగడంలో ఓ అపశ్రుతి చోటుచేసుకోబోయింది.. కానీ జస్ట్ మిస్సులెండి.

ప్రియాంక ఈమధ్య తన కొత్త హాలీవుడ్ సినిమా 'ఈజింట్ ఇట్ రొమాంటిక్' ప్రీమియర్ స్క్రీనింగ్ కు భర్త నిక్ జోనాస్ తో కలిసి హాజరయింది. ఈ గ్లోబల్ భామ కు స్టైల్ పీక్స్ లో ఉంటుంది కదా? అందుకే ఒక ప్రత్యేకంగా డిజైన్ చేసిన పొడవాటి డ్రెస్ లో దర్శనమిచ్చింది. ఆ పొడవాటి డ్రెస్ కు తోడుగా వీలైనంత ఎత్తుగా ఉండే హై-హీల్స్ ధరించింది. కాకపోతే.. కారుదిగి థియేటర్లోకి నడుచుకుంటూ వెళ్ళే సమయంలో ఆ గౌన్ హై హీల్స్ లో ఇరుకోవడంతో బొక్క బోర్ల పడబోయింది. కానీ భరించేవాడే భర్త.. అది ఇండియాలో అయినా.. ఆఫ్రికాలో అయినా.. అమెరికాలో అయినా. ఆయనగారు పక్కనే ఉండేసరికి వెంటనే పట్టుకుని రొమాంటిక్ స్టైల్ లో పీసీని నిలబెట్టాడు. అయినా అంత షార్ప్ గా స్పందనలు ఉన్నాయి కాబట్టే నిక్ గారిని మనువాడింది ప్రియాంక. ఇప్పటికైనా వారి కెమిస్ట్రీని ఆల్జీబ్రాను అందరూ అర్థం చేసుకోవాలి.

కానీ అక్కడ ఉన్న ఫోటోగ్రాఫర్లు ఈ సంఘటనను తమ కెమెరాలలో బంధించడం.. ఆ వీడియో అంతర్జాలంలో..సామాజిక మాధ్యమాలలో వైరల్ కావడం క్షణాలలో జరిగిపోయింది. పడబోయి భర్త సాయంతో తమాయించుకుని నిలుచున్న ప్రియాంక చిర్రుబుర్రులాడకుండా.. చిరాకు.. అసహనం లాంటివి ప్రదర్శించకుండా ఏమీ జరగనట్టుగా సహజంగా నవ్వతూ థియేటర్ లోకి వెళ్ళింది.



Click Here For Video