Begin typing your search above and press return to search.

సుహానా సో క్యూట్ అనిపిస్తోందిగా!

By:  Tupaki Desk   |   25 Oct 2022 2:30 PM GMT
సుహానా సో క్యూట్ అనిపిస్తోందిగా!
X
బాద్ షా షారుక్ ఖాన్ గారాల ప‌ట్టి సుహానా ఖాన్ సోష‌ల్ మీడియా యాక్టివిటీ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు నెట్టింట మ‌హా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోలతో కుర్రాళ్ల‌లో కాక‌లు పుట్టిస్తుంది. ఎలాంటి పోటోలు నెట్టింట వైరల్ అవుతాయో సుహానాకి బాగా తెలుస‌ని ఎన్నోసార్లు రుజువు చేసింది. హీరోయిన్ గా ఎంట్రీ ఇవ్వ‌క‌ముందే అంత‌కు మించిన ఫాలోయింగ్ ని సంపాదించుకుంది.

కుర‌చ దుస్తులే కాదు..స‌మ‌యం వ‌స్తే చీర క‌ట్టి మ‌రీ ఆక‌ర్షించుకుంటాన‌ని మ‌రోసారి అమ్మ‌డు నిరూపించింది. ఇదిగో ఇక్క‌డ అంద‌మైన చీరక‌ట్టుకుని క్యామ్ కి ఇచ్చిన ఫోజులిప్పుడు నెట్టింట వైర‌ల్ గా మారాయి. ఇందులో సుహానా క్రీమ్ క‌ల‌ర్ ప‌లుచ‌ని సారీ..మ్యాచింగ్ షోల్డ‌ర్ లెస్ బ్లౌజు ధ‌రించింది. చెవుల‌కు గ్రీన్ క‌ల‌ర్ దిద్దులు.. అంద‌మైన హెయిర్ స్టైల్ లో సుహానా మ‌రింత ఆక‌ర్ష‌ణీయంగా క‌నిపిస్తుంది.

సారీ ధ‌రించినా సుహానా ఇంకా 20 ఏళ్ల అమ్మాయిలాగే క‌నిపిస్తుంది. పాల నురుగుల సౌంద‌ర్యం...స‌న్నని ఆ శ‌రీర రూపం అన్ని సుహానాని మ‌రింత అందంగా ప్రోజెక్ట్ చేస్తున్నాయి. ప్ర‌స్తుతం ఈ ఫోటో నెట్టింట వైర‌ల్ గా మారింది. సుహానాని ఇలా చూసి కొన్ని హృద‌యాలు త‌ట్టుకోలేక‌పోతున్నాయి. సుహానా సో క్యూట్ అంటూ కామెంట్లు పెట్టిస్తున్నాయి. లుక్స్ గార్జీయస్...బ్యూటీఫుల్..అంటూ అభిమానులు త‌మ మ‌న‌సులో భావాల్ని బ‌య‌ట‌కు తీస్తున్నారు.

ఇక బాద్ షా వార‌సురాలు `ది అర్జీస్` తో సుహానా ఖాన్ బాలీవుడ్లో తెరంగేట్రం చేస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇదే సినిమాతో చాలా మంది వార‌సులు ఎంట్రీ ఇస్తున్నారు. వాళ్ల‌తో పాటు సుహానాని షారుక్ లాంచ్ చేస్తున్నారు. మ‌రి అమ్మ‌డి స్ర్కీన్ ప్ర‌జెన్స్ ఎలా ఉంటుంద‌న్నిది చూడాలి. షారుక్ వార‌స‌త్వాన్ని కొన‌సాగించాల్సిన బాధ్య‌త కూడా సుహనా ఖాన్ పైనే ఉంది.

త‌న‌యుడు ఆర్య‌న్ ఖాన్ ద‌ర్శ‌కుడిగా రాణించాల‌ని చూస్తున్నాడు. ఇప్ప‌టికే ఆర‌క‌మైన ప్ర‌య‌త్నాలు మొద‌లు పెట్టాడు. ఈ నేప‌థ్యంలో మేక‌ప్ వేసుకునే అవ‌కాశాలు త‌క్కువ‌గానే క‌నిపిస్తున్నాయి. షారుక్ ఒత్తిడి తెస్తే త‌ప్ప ఆర్య‌న్ ని హీరోగా చూడ‌టం ఖ‌ష్ట‌మ‌ని అభిమానులు భావిస్తున్నారు.