Begin typing your search above and press return to search.
ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నవాడు ప్రపోజ్ చేశాడు!!
By: Tupaki Desk | 17 Aug 2022 4:30 AM GMTఅతడికి ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు ఉన్నారు. అయినా అతడు ఊర్వశి అందానికి ఫిదా అయిపోయాడు. పెళ్లికి ప్రపోజ్ చేశాడు. ఇంతకీ అందాల ఊర్వశి ఓకే అందా? తిరస్కరించిందా? .. డీటెయిల్స్ లోకి వెళితే..
ఊర్వశి రౌతేలా పరిచయం అవసరం లేదు. గ్రేట్ గ్రాండ్ మస్తీ- హేట్ స్టోరి 4 లాంటి చిత్రాలతో ఊర్వశి యువతరం గుండెల్లో నిలిచింది. ఊర్వశి టాలీవుడ్ ఎంట్రీ గురించి ఇటీవల వేడిగా చర్చ సాగుతోంది. ఇక ఈ బ్యూటీ సోషల్ మీడియాల్లో ఎంత స్పీడ్ గా ఉంటుందో తెలిసిందే. భారీగా యూత్ ఫాలోయింగ్ ని కలిగి ఉంది.
అంతేకాదు ఈ అమ్మడికి ప్రముఖ ఈజిప్షియన్ గాయకుడు ఫిదా అయిపోయాడు. అతడికి ఇద్దరు భార్యలు .. నలుగురు పిల్లలు ఉన్నారు. కానీ ఊర్వశి అందానికి ఫిదా అయిపోయి తనకు పెళ్లి ప్రపోజల్స్ పెట్టాడు. కానీ భార్యా పిల్లలు ఉన్నందున అతని ప్రతిపాదనను ఈ అమ్మడు తిరస్కరించారు. "నేను విచ్ఛిన్నమైన కుటుంబాన్ని ఇష్టపడను.. నా కుటుంబంలో ఎవరూ ఇంకా విడాకులు తీసుకోలేదు" అని కూడా ఊర్వశి వ్యాఖ్యానించింది.
తాజాగా ప్రముఖ హిందీ మీడియాతో ముచ్చటించిన ఊర్వశి రౌతేలా తన వ్యక్తిగత జీవితం గురించి కొన్ని ఆసక్తికరమైన ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించింది. తన జీవితంలోని RP (రిషబ్ పంథ్) గురించి కూడా మాట్లాడింది. అలాగే ఈజిప్షియన్ గాయకుడి నుండి ఆమె అందుకున్న ప్రతిపాదనపైనా మాట్లాడింది. ఊర్వశి తన వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతున్నప్పుడు అంతా ఓపెనైంది. సాంస్కృతిక వైరుధ్యాల కారణంగా తాను ఆ పెళ్లి ప్రతిపాదనను తిరస్కరించినట్లు కూడా ఆమె పేర్కొంది. తన కుటుంబంలో ఎవరూ విడాకులు తీసుకోలేదని .. తాను దానికి అనుగుణంగా జీవిస్తానని ఆశిస్తున్నానని కూడా ఆమె నొక్కి చెప్పింది.
ఈజిప్షియన్ గాయకుడితో ప్రపోజల్ పై స్పందిస్తూ.. భారతీయ సంస్కృతికి ఈజిప్షియన్ సంస్కృతికి భారీ తేడా ఉందని తెలిపింది. ఆ వ్యక్తికి అప్పటికే ఇద్దరు భార్యలు.. నలుగురు పిల్లలు ఉన్నారు. ఇన్సాన్ చాహే కిత్నా భీ అచ్ఛా హో ప్రకృతి వైజ్.. ఫ్యామిలీ కా భీ సోచ్నా పడ్తా హై.. ముఖ్యంగా జబ్ ఏక్ ఇండియన్ లడ్కీ కీ బాత్ ఆతీ హై... అని అన్నారు. దీనర్థం ఇరు సంస్కృతుల నడుమా వైరుధ్యాలు చాలా ఎక్కువ అని నేను అనుకుంటున్నాను. అతనికి ఇద్దరు భార్యలు నలుగురు పిల్లలు ఉన్నారు. అతను ఎంత గొప్ప వ్యక్తి అయినా భారతీయ అమ్మాయిగా మేము మొదట కుటుంబం గురించి ఆలోచిస్తాము.. అని తెలిపింది.
ఇతరుల గురించి వారు (బహుభార్యలు ఉన్నవాళ్లు) ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. నాకు కొంతమంది స్నేహితులు ఉన్నారు. వారు చాలా హఠాత్తుగా ఆకస్మికంగా ఏదైనా చేసేస్తుంటారు. కొన్నిసార్లు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను. వారు అంతగా ఆలోచించకుండా ఎలా చేయగలరు? కానీ నా విషయంలో అలా కాదు. నా కుటుంబానికి సమాధానం చెప్పాలి. అలాంటి నిర్ణయం తీసుకోలేను. పైగా నేను నా కుటుంబానికి దూరంగా ఉండలేను. .. అని తెలిపింది.
విచ్ఛిన్నమైన కుటుంబం అంటే నాకు ఇష్టం ఉండదు. నా భర్త నా తండ్రిలాంటి వ్యక్తి అవుతాడు. ఒక కుటుంబం ఎప్పుడూ కలిసి ఉండాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అక్కడే ఆనందాన్ని పొందుతాం. కుటుంబం మొత్తం కలిసి ఉంటే ఆ అనుభూతిని నేను ప్రేమిస్తాను. విచ్చిన కుటుంబాలు నాకు నచ్చవు. నా కుటుంబంలో ఇప్పటివరకు ఎవరూ విడాకులు తీసుకోలేదు. నేను ఇతరుల విడాకులు గురించి వింటున్నాను.. నిజానికి నాకు విడాకులు అంటే ఏమిటో కూడా తెలియదు. నేను ముంబైకి వచ్చినప్పుడు ఇక్కడ విడాకులు చాలా సాధారణమని గ్రహించాను'' అని వ్యాఖ్యానించింది. అందాల పోటీల్లో విజేతగా నిలిచిన ఊర్వశి రౌతేలా ఉత్తరాఖండ్ కు చెందిన యువతి. ఈ నటి ప్రస్తుతం దక్షిణాదిలో పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది.