Begin typing your search above and press return to search.
కాజోల్ మళ్లీ స్లిప్ అయిపోయింది
By: Tupaki Desk | 22 Jun 2018 5:28 PM GMTబాలీవుడ్ భామ కాజోల్ కెరీర్ లో ఫుల్లు స్ట్రాంగ్ నెస్ చూపించింది. ఎంతసేపూ కెరీర్ లో పైకి ఎక్కడమే కానీ.. ఎక్కడా స్లిప్ అయిన దాఖలాలే ఉండవు. అడపా దడపా ఫ్లాపులు తగిలిన బ్లాక్ బస్టర్లతో అలా అలా పైకి ఎక్కేసింది. టాప్ రేంజ్ లో ఉండగానే అజయ్ దేవగన్ ను పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయింది ఈ భామ.
మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి అటు బాలీవుడ్ తో పాటు ఇటు దక్షిణాది సినిమాలపై కూడా బాగానే కన్నేసింది. అయితే.. లైఫ్ లో ఇంతగా ఎదిగిన ఈ బ్యూటీ.. ఈవెంట్స్ లో మాత్రం కాలు జారి పడిపోబోవడం కామన్ అయిపోతోంది. తాజాగా ముంబైలో ఓ ప్రైవేటు సంస్థ నిర్వహించిన ఓ కార్యక్రమం కోసం అటెండ్ అయిన కాజోల్.. అక్కడి ఫోనిక్స్ సిటీ మాల్ కి వెళ్లింది. వైట్ గౌను.. పోనీ టైల్.. నిండైన లుక్ తో బాగానే మెరిసిపోయింది. అయితే.. అక్కడ జనాలు ఫుల్లుగా ఈమెను చుట్టుముట్టేయడంతో.. బాడీ గార్డులు జాగ్రత్తగా ఈమెను అక్కడి నుంచి ఎస్కలేటర్ దగ్గరకు తీసుకెళ్లారు. ఎస్కలేటర్ పై నుంచి దాటే సమయంలో హీల్స్ జారడంతో.. దభేల్ మని పడిపోబోయింది ఈ సీనియర్ బ్యూటీ.
కానీ సెక్యూరిటీ గార్డ్ పట్టుకోవడంతో ప్రమాదం తప్పింది. గతంలో దిల్ వాలే మూవీ ప్రమోషన్స్ సమయంలో కూడా ఇలాగే కాలు జారితే.. ఆ సమయంలో పక్కనే ఉన్న వరుణ్ ధావన్ ఆమెను పట్టుకుని ఆపాడు. ఇప్పుడు ఇలా జరిగింది. కెరీర్ లో ఇంత ఎదిగింది కానీ.. పడకుండా నడవడం మాత్రం ఇంకా ఈ బ్యూటీ నేర్చుకోలేదనుకుంటా!