Begin typing your search above and press return to search.
జాన్వీ సారాలను సైడేస్తున్న కన్నింగ్ గాళ్
By: Tupaki Desk | 23 Nov 2022 2:30 AM GMTబాలీవుడ్ లో నటవారసురాళ్ల నడుమ విపరీతమైన కాంపిటీషన్ పెరుగుతోంది. ప్రతియేటా నలుగురైదుగురు నటవారసులు హిందీ చిత్రసీమకు పరిచయమవుతున్నారు. అందులో మెజారిటీ పార్ట్ కథానాయికలదే హవా. ఇంతకుముందు శ్రీదేవి కుమార్తె జాన్వీకపూర్.. సైఫ్ ఖాన్ కుమార్తె సారా అలీఖాన్ వెండితెరకు పరిచయమయ్యారు. ఆ ఇద్దరూ మంచి స్నేహితులు కూడా. ప్రతిభావంతమైన నటీమణులుగా నిరూపించుకున్నారు. అయితే వీళ్లకు ధీటుగా ప్రతిభలో ఏమాత్రం తక్కువ కాదని నిరూపిస్తోంది పూజా భేడీ వారసురాలు ఆలయా ఫర్నిచర్ వాలా. నటించిన తొలి రెండు చిత్రాల్లోను ఈ అమ్మడి నటనకు ప్రశంసలు దక్కాయి. పాపులర్ నైకా బ్రాండ్ ప్రమోటర్ గాను ఆలయ బుల్లితెర ప్రకటనల్లో సందడి చేస్తోంది.
అందంలో నటనలో తనకు సాటిరారెవరూ అని నిరూపిస్తున్న ఈ బ్యూటీ ప్రస్తుతం కార్తీక్ ఆర్యన్ లాంటి క్రేజీ హీరో సరసన నటించింది. ఈ జంట నటించిన ఫ్రెడ్డీ విడుదలకు సిద్ధమవుతోంది. రిలీజ్ ప్రచారంలో ఆలయా తెలివైన మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటోంది. కార్తీక్ ఆర్యన్ అంటే తనకు క్రష్ ఉందని సారా అలీఖాన్ బహిరంగంగానే అంగీకరించింది. జాన్వీ సైతం ఈ యంగ్ హీరో అంటే యమ క్రేజీ అని కూడా పొగిడేసింది. అయితే ఆ ఇద్దరినీ సైడేసి ఫ్రెడ్డీలో ఆలయా ఫర్నిచర్ వాలా అవకాశం అందుకుంది. ఇది తన కెరీర్ గేమ్ ఛేంజర్ గా మారే సదవకాశంగా భావిస్తున్నారు.
కార్తిక్ ఆర్యన్ `ఫ్రెడ్డీ` డిస్నీ+ హాట్‌స్టార్ లో డిసెంబర్ 2 నుండి స్ట్రీమింగ్ కానుంది. ఈ సందర్భంగా ప్రచార కార్యక్రమాల్లో జోరుగా పాల్గొంటున్న ఆలయ తాజాగా కార్తీక్ ఆర్యన్ ని ప్రశంసల్లో ముంచెత్తింది. కార్తీక్ తో కలిసి మొదటిసారి నటించిన ఈ భామ అతని పని తీరుకి ఫిదా అయిపోయిందట. అతడితో కలిసి పనిచేయడం ఓవరాల్ గా అద్భుతమైన అనుభవం మాత్రమే కాదు.. తన నుండి చాలా నేర్చుకున్నాను! అని అలయ బాహాటంగా ఒక ప్రకటనలో తెలిపారు. అతడి అంకితభావం ఉత్సాహం మైమరిపిస్తాయి. చాలా దూరం ప్రయాణిస్తాడు.. చాలా కష్టపడి పనిచేస్తాడు.. అతడి పని తీరు ఒక ఉన్నత ప్రమాణానికి కొలమానం. కార్తీక్ తో కలిసి పనిచేస్తే నిరంతరం కష్టపడి పనిచేయడం ఎలానో తెలుస్తుంది. మనం కోరుకున్నవన్నీ సాధించుకుంటాం..`` అంటూ గ్యాప్ లెస్ గా పొగడ్తలతో ఆకాశానికెత్తేసింది.
మొత్తానికి ఈ యువనాయిక తెలివైన గేమ్ ఆడుతోంది. కార్తీక్ బాలీవుడ్ లో వంద శాతం సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న ట్యాలెంటెడ్ నటుడు. తదుపరి హేరాఫేరి 3 లాంటి క్రేజీ సినిమాలో నటిస్తున్నాడు. సీనియర్ నటుడు అక్షయ్ కుమార్ కి రీప్లేస్ మెంట్ గా సత్తా చాటుతున్నాడు. ఇదేగాక అక్షయ్ నటించాల్సిన మరో రెండు భారీ క్రేజీ సీక్వె ళ్లను తన ఖాతాలో వేసుకోబోతున్నాడు. ఇలాంటి సమయంలో అతడిని సమయోచితంగా తనవైన మాటలతో బుట్టలో వేసేస్తోంది. ఇది జాన్వీ- సారా లకు కార్తీక్ తో మరో ఛాన్స్ రాకుండా చేస్తుందేమో!! చూస్తుంటే సీక్వెళ్లలోను కార్తీక్ ఆలయాకే ఛాన్సులిచ్చేట్టున్నాడు.
ఫ్రెడ్డీ సంగతేంటీ అంటే..?
కార్తీక్ ఆర్యన్- ఆలయ జంటగా నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ `ఫ్రెడ్డీ` కథాంశం ఆసక్తికరం. తన చిన్న విమానాలతో ఆడుకోవడం ఇష్టపడే ఏకైక స్నేహితుడైన పిరికి ఒంటరి.. సామాజికంగా ఇబ్బందిపడే యువకుడైన డాక్టర్ ఫ్రెడ్డీ గిన్వాలా లైఫ్ జర్నీ గురించిన కథాంశమిది. అతడితో పెంపుడు తాబేలు హార్డీ కూడా ఉంటుంది. అసాధారణమైన మలుపులు భావోద్వేగాలు గందరగోళంతో కూడుకున్న కామెడీ ఎంటర్ టైనర్ ఇది. థ్రిల్ ని కలిగించే అంశాలతో ఫ్రెడ్డీ ప్రేక్షకులను సీట్ ఎడ్జ్ పైకి రప్పించేంత గ్రిప్పింగ్ గా తెరకెక్కిందని చిత్రబృందం చెబుతోంది.
కార్తీక్ చివరిసారిగా ఈ సంవత్సరం ప్రారంభంలో అనీస్ బాజ్మీ `భూల్ భూలయ్యా 2`లో కనిపించాడు. కియారా అద్వానీ - టబు కూడా నటించిన ఈ చిత్రం 2022 సూపర్ హిట్ చిత్రాలలో ఒకటి. కార్తీక్ కి కెరీర్ బెస్ట్ మూవీగా నిలిచింది. అతడికి వరుసగా పలు క్రేజీ ఆఫర్లు ఉన్నాయి. షెహజాదా- సత్యప్రేమ్ కి ప్రేమ్ కథ- ఆషికి 3 లాంటి క్రేజీ సినిమాల్లో నటిస్తున్నాడు. ఆషిఖి 3లో కథానాయికను ఇంకా ఫైనల్ చేయాల్సి ఉంది. బహుశా ఈ చిత్రంలో అప్ కమింగ్ స్టార్ ఆలయ-ఎఫ్ కి ఛాన్సుంటుందేమో?
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.