Begin typing your search above and press return to search.
ఫోకస్: కంటికి పాపలా కాచుకుంటున్నారు
By: Tupaki Desk | 11 Jun 2015 5:30 PM GMTటాలీవుడ్‌లో, బాలీవుడ్‌లో.. ఇప్పుడు యువ హీరోలంతా హ్యాపీగా పెళ్లి చేసుకొని.. పిల్లా పాపలతో హాయిగా కాలక్షేపం చేసేస్తున్నారు. వీలైతే చాలు.. పిల్లలతో ఫారిన్ టూర్‌లు కొట్టేస్తూ.. లైఫ్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. అలాంటి వాళ్ళను ఓసారి పరివీలిస్తే..
మన హీరోల్లో బన్ని అయాన్‌తో ఆటా పాటా అంటూ గడిపేస్తున్నాడు. అలాగే మహేష్ ఇప్పటికే గౌతమ్, సితార ఇద్దరు బిడ్డలతో వీలున్నప్పుడల్లా ఆటలు ఆడుకుంటూ కాలక్షేపం చేస్తుంటాడు. విదేశీ ట్రిప్‌లతో పిల్లల సరదాల్ని తీరుస్తుంటాడు. అదే తీరుగా పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ సైతం అఖీరా నందన్, ఆద్య ఇద్దరితో వీలున్నప్పుడల్లా శికార్లు వెళ్లి వస్తుంటాడు. ఎన్టీఆర్ తన బిడ్డ అభయ్‌రామ్‌తో సాధ్యమైనంత ఎక్కువ సమయాన్ని వెచ్చిస్తున్నాడు. మంచు విష్ణు ట్విన్స్‌తో, లక్ష్మీ మంచు సరోగసి ద్వారా పుట్టిన బిడ్డతో, గోపిచంద్ తన గారాల పట్టీతో వీలున్నంత వరకూ ఎక్కువ సమయాన్ని గడిపేందుకు చూస్తున్నారు.
ఓమారు బాలీవుడ్ వెళ్లి పరిశీలిస్తే.. ఐశ్వర్యారాయ్-అభిషేక్ జంట ఆరాధ్యతో ఎక్కువ సమయాన్ని గడిపేస్తున్నారు. 3 సంవత్సరాల వయసున్న ఈ బిడ్డను కంటికి పాపలా కాపాడుకుంటున్నారు. మీడియా కెమెరాల వేడి పిల్లలపై పడకుండా చూసుకుంటున్నారు. అమీర్‌ఖాన్ బిడ్డ అజాద్ 3 సంవత్సరాలు, అబుల్ కలామ్ ఆజాద్ (దూరపు బంధువు) ఇన్‌స్పిరేషన్‌తో పేరు పెట్టుకుని అల్లారుముద్దుగా పెంచుకుంటున్నాడు. భార్య కిరణ్‌రావ్‌తో కలిసి ఏ కష్టం లేకుండా చూసుకుంటున్నాడు. బాద్‌షా షారూక్ తన బిడ్డ అబ్‌రామ్‌ని కంటికి రెప్పలా కాచుకుంటున్నాడు. ఏడాదిన్నర బిడ్డపై కనీసం వేరొకరి నీడ కూడా పడకుండా చూసుకుంటున్నాడు. ఇక అమీర్ మేనల్లుడు ఇమ్రాన్‌ఖాన్ తను వలచిన అవంతికను పెళ్లాడిన సంగతి తెలిసిందే. ఈ జంటకు ఏడాది వయసున్న బిడ్డ పుట్టింది. ఇమారా పేరు. అనుక్షణం తనతోనే జీవితం. అలాగే అక్షయ్‌కుమార్- ట్వింకిల్ ఖన్నా తమ రెండేళ్ల బిడ్డ నితారను అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నారు.
ఇలా సెలబ్రిటీల సంసార జీవితాన్ని పరిశీలిస్తే పిల్లా పాపలతో ప్రశాంతంగా, హాయిగా గడిపేస్తున్నారు.