Begin typing your search above and press return to search.
`అఖండ`పై బాలీవుడ్ కన్ను..నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టేసారు!
By: Tupaki Desk | 6 Dec 2021 3:30 AM GMTనటసింహ బాలకృష్ణ కథానాయకుడిగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన `అఖండ` ఇటీవలే రిలీజ్ అయి మంచి విజయం దక్కించుకున్న సంగతి తెలిసిందే. పక్కా మాస్ ఎంటర్ టైనర్ గా అభిమానుల్ని ఆకట్టుకుంటుంది. ఇందులో కొత్త పాయింట్ ఏదైనా ఉంది అంటే అది దేవాలయాలు..హిందుత్వం గురించి హైలైట్ చేయడమే. సినిమా మొత్తానికి యూనిక్ గా కనపించే పాయింట్ ఇదే. కానీ సినిమా మాత్రం పూర్తి కమర్శిలైజ్డ్ చేసి తీసారు. సరిగ్గా ఈ పాయింట్ నే ఇప్పుడు బాలీవుడ్ మేకర్స్ ని ఆకర్షిస్తున్నట్లు కనిపిస్తోంది. `అఖండ`ని బాలీవుడ్ లో రీమేక్ చేసే యోచనలో ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
సాజిద్ నడియావాల సహా కొందరు దర్శకులు ఈ పాయిట్ ని హైలైట్ చేసి ఉత్తరాది ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు మలిస్తే హిట్ కొటొచ్చు అన్న ధీమా కనిపిస్తోంది. ఆలోచన బాగుంది. ఎందుకంటే దక్షిణాదిన వివిధ మాతాలు ఉద్భవిస్తున్నాయి. ఈ క్రమంలో హిందు ప్రాబల్యం తగ్గిపోతుంది. కానీ ఉత్తరాదిన సీన్ వేరే. దక్షిణాది రాష్ర్టాలతో పోల్చుకుంటే నార్త్ లో హిందుత్వం గురించి చాలా గొప్పగా భావిస్తారు అక్కడి ప్రజలు. హిందు దేవాలయాల్ని..కట్టడాల్ని సందర్శించడం ఉత్తరాది ప్రజలు ప్రత్యేకత. సరిగ్గా ఈ పాయింట్ ని టచ్ చేసి అఖండని రీమేక్ చేస్తే బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. కేంద్రలో బీజేపీ అధికారంలోకి వచ్కిన తర్వాత హిందు ప్రాభల్యం మరింత పెరిగింది. ఆర్ఎస్ ఎస్ వాదులు కూడా మద్దతు ఇస్తున్నట్లు సమాచారం.
ఇక బాలీవుడ్ కొన్నాళ్లుగా దక్షినాది బ్లాక్ బస్టర్లు రీమేక్ చేయడం పరిపాటిగా మారిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగులో హిట్టైన సినిమాల్ని హిందీలో రీమేక్ చేసి అక్కడా విజయాలు అందుకుంటున్నారు. కథ కోసం అన్వేషించే పనిలేదు. సరైన టీమ్ ..నటీనటుల్ని ఎంపిక చేసుకుని సక్సెస్ ఫుల్ పాయింట్ తో ముందుకెళ్లిపోతే సరి అన్న విధంగా సన్నివేశం మారింది.