Begin typing your search above and press return to search.
'లైగర్'పై షాకింగ్ కామెంట్స్ చేసిన బాలీవుడ్ బ్యూటీ..!
By: Tupaki Desk | 27 Oct 2022 2:43 AM GMTయంగ్ హీరో విజయ్ దేవరకొండ టాలీవుడ్లో ఎంతో వేగంగా స్టార్డమ్ సంపాదించుకున్నాడు. 'అర్జున్ రెడ్డి'తో ఓవర్ నైట్ స్టార్ గా విజయ్ ఎదిగిపోయాడు. అయితే ఆ స్టార్డమ్ మాత్రం ఎక్కువ కాలం కాపాడుకోలేక చతికిల బడుతున్నాడు. 'అర్జున్ రెడ్డి'.. 'గీతా గోవిందం' వంటి భారీ సక్సస్ లు అందుకున్న ఈ హీరోకు కొంత కాలంగా బ్యాడ్ టైం నడుస్తున్నట్లు కన్పిస్తోంది.
విజయ్ కెరీర్ లో 'పెళ్లి చూపులు'.. 'డియర్ కామ్రేడ్'.. 'నోటా'.. 'ట్యాక్సీవాలా' మూవీ యావరేజ్ సినిమాలున్నాయి. అయితే కరోనా టైంలో వచ్చిన 'వరల్డ్ ఫేమస్ లవర్' విజయ్ దేవరకొండను కోలుకోని దెబ్బతీసింది. ఈ సినిమా విజయ్ దేవరకొండ కెరీర్లోనే డిజాస్టర్ గా మిగిలిపోయింది.
ఈ సినిమా తర్వాత కొంత గ్యాప్ తీసుకొని పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'లైగర్' సినిమా చేశాడు. ఫ్యాన్ ఇండియా మూవీగా తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే నటించింది. ఈ సినిమాలో విజయ్ ఫర్మామెన్స్ బాగున్నప్పటికీ.. కథలో కొత్తదనం లేకపోవడంతో బాక్సాఫీస్ వద్ద 'లైగర్' పరాజయం పాలైంది.
'లైగర్' ఫెయిల్యూర్ ను అందరూ మరిచిపోతున్న తరుణంలో బాలీవుడ్ నటి, సింగర్ మలోబిక బెనర్జీ సంచలన కామెంట్స్ చేయడం చర్చనీయాంశంగా మారింది. తాజాగా ఓ ఛానల్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. విజయ్ దేవరకొండతో తాను 'నీ వెనకాలే నడిచి' అనే మ్యూజిక్ వీడియోలో నటించినట్లు తెలిపింది.
షూటింగ్ సమయంలో విజయ్ తనకు మంచి స్నేహితుడు అయ్యాడని తెలిపింది. సెట్స్ లో చాలా సరదాగా మాట్లాడుకునే వాళ్లమని తెలిపింది. అయితే తాను హిందీలో మాట్లాడుతుంటే విజయ్ నవ్వుకునే వాడని.. తనకు హిందీ పెద్దగా అర్థం కాదని.. అదో హెబ్రూ భాషలా ఉంటుందని అవహేళన చేసేవాడని ఆమె చెప్పుకొచ్చింది.
అలాంటి విజయ్ హిందీలో సినిమా తీశాడని తెలిసి నమ్మలేక పోయానని తెలిపింది. ఆ తర్వాత 'లైగర్' టీజర్ చూసి నవ్వుకున్నానని చెప్పింది. ఈ విషయాన్ని లైగర్ మూవీ ప్రమోషన్స్ సమయంలోనే చెబుతామనుకున్నానని కానీ విజయ్ తనకు మంచి స్నేహితులు కావడంతో ఆ పని చేయలేక పోయానని ఆమె చెప్పింది.
ఈ మూవీ విడుదల సమయంలో సోషల్ మీడియాలో 'లైగర్' టీజర్ షేర్ చేసి ఆల్ ది బెస్ట్ చెప్పినట్లు తెలిపింది. ఆ తర్వాత హిందీలో విజయ్ కి ఎక్కువగా డైలాగ్స్ లేవని తెలిసిందని మలోబిక బెనర్జీ తెలిపింది. ఏదిఏమైనా విజయ్ దేవరకొండ చాలా మంచి మనిషి అని.. చాలా ప్రొఫెషినల్ అంటూ కితాబిచ్చింది. ఈ వ్యవహారం చూసిన వారంతా టైం చూసి ఈ బాలీవుడ్ నటి విజయ్ ని దెబ్బెసిందంటూ కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.