Begin typing your search above and press return to search.
2020 కి మంచి ఆరంభం లభించింది
By: Tupaki Desk | 25 Jan 2020 5:13 AM GMTగత ఏడాది బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాలు దక్కించుకున్న సినిమాలు వేళ్ల మీద లెక్కించవచ్చు. అతి తక్కువ సినిమాలు మాత్రమే గత ఏడాది విజయాన్ని సొంతం చేసుకున్నాయి. ఇక గత ఏడాది 250 కోట్ల వసూళ్లు క్రాస్ చేసిన చిత్రాలు ఇంకా తక్కువ. గత ఏడాది చాలా నమ్మకం పెట్టుకున్న సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ ఏడాది 2020కి మాత్రం మంచి ఆరంభం దక్కింది. బాలీవుడ్ కు ఇది శుభసూచకం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
అజయ్ దేవగన్ ముఖ్య పాత్రలో నటించిన తాన్హాజీ చిత్రం ఈనెల 10న ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. చత్రపతి శివాజీ సైన్యంలోని కీలక వ్యక్తి అయిన తాన్హాజీ గురించి చరిత్ర మరిచి పోయింది. అలాంటి వ్యక్తి జీవిత చరిత్రను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లుగా యూనిట్ సభ్యులు ముందు నుండి ప్రచారం చేసి సినిమాపై ఆసక్తి కలిగించడంలో సక్సెస్ అయ్యారు. ప్రేక్షకుల్లో పెరిగిన అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ఈ సినిమా ఉండటంతో ఇప్పుడు కలెక్షన్స్ వర్షం కురుస్తుంది.
చిత్రంను దాదాపుగా 150 కోట్ల బడ్జెట్ తో నిర్మించినట్లుగా తెలుస్తోంది. ఆ బడ్జెట్ ను సునాయాసం గా వెనక్కు రాబట్టి ప్రస్తుతం లాభాల బాటలో తాన్హాజీ నడుస్తున్నాడు. రెండు వారాలు పూర్తి అయ్యేప్పటికి ఈ సినిమా దాదాపుగా 260 కోట్ల గ్రాస్ వసూళ్లను దక్కించుకున్నట్లుగా ట్రేడ్ వర్గాల వారు చెబుతున్నారు. ఈ వీకెండ్ లో మరింత భారీ వసూళ్లు నమోదు అయ్యే అవకాశం ఉందని.. లాంగ్ రన్ లో ఈ చిత్రం ఈజీగా 350 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ ను రాబడుతుందనే నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
మొత్తానికి 2020లో విడుదలైన మొదటి పెద్ద సినిమా 350 కోట్లను వసూళ్లు చేయడం మంచి పరిణామం అని ఇదే జోరుతో ఇతర బాలీవుడ్ పెద్ద మరియు చిన్న చిత్రాలు సక్సెస్ లను దక్కించుకోవాలని ఆశిస్తున్నట్లుగా హిందీ ప్రేక్షకులు కోరుకుంటున్నారు.