Begin typing your search above and press return to search.
సైరాకు బాలీవుడ్ బంపర్ డీల్
By: Tupaki Desk | 27 May 2019 7:25 AM GMTమెగాస్టార్ చిరంజీవి హీరోగా అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న 151వ చిత్రం సైరా విడుదలకు రంగం సిద్ధమవుతోంది. అక్టోబర్ 2 అని ఇప్పటికే మీడియా సర్కిల్స్ లో బాగా ప్రచారమైపోయింది. అంతర్గతంగా డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లకు ఇదే సమాచారం ఉన్నట్టు తెలిసింది. అధికారిక ప్రకటన మాత్రం ఆలస్యంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి. బహుశా చిరంజీవి పుట్టినరోజు ఆగస్ట్ 22న అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉండొచ్చు.
ఇదిలా ఉండగా మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ కు ప్లాన్ చేసిన సైరాకు బాలీవుడ్ లో మొదటి డీల్ కుదిరినట్టుగా టాక్. ఫర్హాన్ అక్తర్ రితేష్ సిద్వాని భాగస్వాములుగా ఉన్న ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ దీన్ని కొనుగోలు చేసినట్టుగా తెలిసింది. ఎంత మొత్తం లాంటి వివరాలు ఇంకా తెలియలేదు కాని నిర్మాత రామ్ చరణ్ కు మంచి మొత్తాన్ని ఆఫర్ చేసినట్టుగా సమాచారం. ఈ ఎక్సెల్ సంస్థ గత ఏడాది కేజిఎఫ్ హింది వెర్షన్ రిలీజ్ చేసి మంచి లాభాలు దక్కించుకుంది. ఇప్పుడు అంత కన్నా భారీ స్థాయిలో సైరాను బాలీవుడ్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
అమితాబ్ బచ్చన్ తో పాటు తమన్నా నయనతార లాంటి నోటేడ్ యాక్టర్స్ ఉండటంతో అక్కడా దీనికి క్రేజ్ బాగా ఉంటుందని ఆశిస్తున్నారు. ఎలాగూ చిరంజీవి నార్త్ ఆడియన్స్ కు 1990లో వచ్చిన ప్రతిబంద్ నుంచి పరిచయమే. హిందిలో మూడు స్ట్రెయిట్ రీమేక్ సినిమాలు చేసిన చిరు ఆ తర్వాత రెగ్యులర్ గా డబ్బింగ్ సినిమాల ద్వారా కనెక్ట్ అవుతూనే ఉన్నారు. ఇవన్ని సైరా హింది వెర్షన్ కు అనుకూలంగా మారనున్నాయి. అమిత్ త్రివేది సంగీతం కాబట్టి ఇంకో పాజిటివ్ ఫాక్టర్ కూడా తోడయ్యింది