Begin typing your search above and press return to search.

హృతిక్ సినిమాను ఎందుకు పక్కెనెట్టారు?

By:  Tupaki Desk   |   8 Aug 2016 7:30 PM GMT
హృతిక్ సినిమాను ఎందుకు పక్కెనెట్టారు?
X
ఈ శుక్రవారం బాలీవుడ్ లో రెండు ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో ఒకటి హృతిక్‌ రోషన్ లీడ్ గా రూపొందిన ''మొహంజొదారో'' సినిమాతో అయితే.. మరొకటి అక్షయ్‌ కుమార్ ''రుస్తుం'' సినిమా. కాని ఇప్పుడు బాలీవుడ్ అంతా మూకుమ్మడిగా హృతిక్‌ కు హ్యాండిస్తున్నారనే సంగతి తెలుసా?

కుర్ర హీరో రణవీర్ సింగ్ రుస్తుం గెటప్ వేసుకుని ట్వీట్లు చేసి ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు. అలాగే హీరోయిన్ సోనాక్షి సిన్హా అయితే రుస్తుం కోసం డ్రమ్స్ వాయించి ఆ వీడియోను షేర్ చేసింది. సోనమ్ కపూర్.. సల్మాన్‌ ఖాన్‌.. ఇలా అందరూ రుస్తుం సినిమాను ఏదో ఒక ఫార్మాట్ లో ప్రమోట్ చేసి అక్షయ పట్ల తమకున్న ప్రేమను చాటి చెబుతున్నారు. బాగానే ఉంది. మరి మొహంజొదారో సినిమా గురించి ఒక్కరు కూడా మట్లాడరే? బాలీవుడ్ లో వినిపిస్తున్న టాక్ ఏంటంటే.. కంగన ఎపిసోడ్ లో హృతిక్ రియాక్ట్ అయిన తీరుతో అస్సలు ఎవ్వరూ హ్యాపీగా లేరంట. అందుకే ఇలా హృతిక్ సినిమాను పట్టించుకోవట్లేదట.

ఇదే విషయాన్ని హృతిక్‌ ను అడిగితే.. ''మంచిదే కదా. అందరం సినిమా వారమే. మనలో ఎవరికైనా ప్రమోషన్లు అవసరమైతే.. వారిని ప్రమోట్ చేయడంతో తప్పేముంది?'' అంటూ పంచ్ వేశాడు. అంటే అక్షయ్ కు ప్రమోషన్లు అవసరం కాని.. తనకు అవసరం లేదనేగా?