Begin typing your search above and press return to search.

రివార్డులు తప్ప అవార్డులు లేవు పాపం

By:  Tupaki Desk   |   16 Feb 2016 10:30 PM GMT
రివార్డులు తప్ప అవార్డులు లేవు పాపం
X
అవార్డులు అందుకున్న వాళ్లందరూ చెప్పే డైలాగులు సహజంగా ఒకటేగా ఉంటాయి. ప్రేక్షకుల అభిమానం ముందు ఈ అవార్డు చాలా చిన్నది అనో, ఈ అవార్డ్ ఆడియన్స్ కి అంకితమనో అంటారు. కానీ అసలు జీవితంలో అవార్డు అందుకోని వారి పరిస్థితి ఏంటి? ఎంత గొప్ప నటులుగా గుర్తింపు దక్కించుకున్నా.. ఉత్తమ నటుడు - అవార్డు దక్కని కొందరు తారలు బాలీవుడ్ లో ఉన్నారు.

50 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ధర్మేంద్ర చాలా గొప్ప నటుడే. ఈయనకు ఇప్పటివరకూ ఉత్తమ నటుడు అవార్డు రాలేదు.1997లో వచ్చిన ఫిలింఫేర్ లైఫ్ టైం అఛీవ్ మెంట్ ఒక్కటే అందుకున్నారీయన. అలాగే 160 సినిమాల్లో నటించిన గోవిందాకి కూడా బెస్ట్ యాక్టర్ అవార్డ్ రాలేదు. 12 సార్లు నామినేట్ అయినా, ఒక్కసారి కూడా అందుకోలేకపోవడం ఆశ్చర్యకరం, కాకపోతే బెస్ట్ కామెడీ యాక్టర్ మాత్రం అవార్డులొచ్చాయి. రాజ్ - మద్రాస్ కేఫ్ వంటి చిత్రాలతో ఆకట్టుకున్న జాన్ అబ్రహాంకి కూడా బెస్ట్ యాక్టర్ రాలేదు కానీ.. ధూమ్ కి మాత్రం బెస్ట్ విలన్ అవార్డ్ దక్కించుకున్నాడు.

సోనమ్ కపూర్ కూడా బెస్ట్ యాక్ట్రెస్ కు దూరంగానే నిలిచిపోయింది. అయితే ఇప్పుడు రాబోతోన్న నీర్జా చిత్రం ఆ ముచ్చట తీర్చుతుందని ఆశలు పెట్టుకుంది. ఫేస్ లో ఫీలింగ్సే పలకవు అనే విమర్శల నుంచి మంచి నటిగా గుర్తింపు పొందిన కత్రినా కైఫ్ కూడా ఉత్తమ నటి గుర్తింపునకు నోచుకోలేదు. దబాంగ్ బెస్ట్ డెబ్యూట్ యాక్ట్రెస్ అవార్డు దక్కించుకున్న సోనాక్షి సిన్హా కూడా ఉత్తమ నటి అవార్డు గెలుచుకోలేకపోయింది. ఇప్పుడు రానున్న అకీరాతో ఉత్తమ నటి అవార్డ్ తప్పకుండా అందుకుంటానని ఆశలు పెట్టుకుంది సోనాక్షి.