Begin typing your search above and press return to search.
టాలీవుడ్ వెంటపడుతున్న బాలీవుడ్
By: Tupaki Desk | 12 Feb 2022 7:51 AM GMT`బాహుబలి` తరువాత తెలుగు సినిమా స్వరూపమే సమూలంగా మారిపోయింది. మార్కెట్ స్టటజీస్ ఓ రేంజ్ కి చేరుకున్నాయి. మన సినిమాల బిజినెస్ కూడా పాన్ ఇండియా లెవెల్లో జరుగుతోంది. దీంతో దేశ మొత్తం ఇప్పుడు టాలీవుడ్ వంక చూడటం మొదలుపెట్టింది. అంతే కాకుండా బాలీవుడ్ గ్యాంగ్ స్టర్ సినిమాలు చూసీ చూసీ బోర్ కొట్టిన ఉత్తరాది ప్రేక్షకులు కూడా టాలీవుడ్ చిత్రాలవైపే ఆసక్తిగా చూస్తున్నారు. ఈ విషయం ఇటీవల `పుష్ప` తో మరో సారి నిరూపితమైంది. ఎలాంటి ప్రచారం చేయకుండానే ఈ చిత్రానికి ఉత్తరాదిలో వంద కోట్లకు మించి వసూళ్ల రావడం పలువురిని ఆశ్చర్యానికి గురిచేసింది.
దీన్ని బట్టే ఉత్తరాది ప్రేక్షకులు తెలుగు మాస్ చిత్రాలని ఎంతగా కోరుకుంటున్నారో స్పష్టమైంది. దీంతో బాలీవుడ్ ప్రొడ్యూసర్స్ టాలీవుడ్ డైరెక్టర్స్ వెంట పడటం మొదలుపెట్టారు. బాలీవుడ్ లో మాస్ యాక్షనప్ చిత్రాలకు రోహిత్ శెట్టి వంటి డైరెక్టర్ వున్నా కూడా కరణ్ జోహార్ లాంటి బిగ్ ప్రొడ్యూసర్ టాలీవుడ్ డైరెక్టర్ లతో సినిమాలు తీయడానికి ఆసక్తిని చూపిస్తూ దర్శకుల కోసం ఎదురుచూస్తున్నారంటే పరిస్థితి ఏస్థాయికి చేరిందో అర్థం చేసుకోవచ్చు.
రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా మూవీ `లైగర్`. బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రానికి కరణ్ జోహార్ వన్ ఆఫ్ ది ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ తరువాత మరోసారి వీరిద్దరి కలయికలో ఓ బారీ చిత్రం రాబోతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రానికి కూడా కరణ్ జోహార్ నిర్మాణ భాగస్వామిగా వ్యవహరించబోతున్నారట.
ఇక టాలీవుడ్ నుంచి కూడా మరి కొంత మంది దర్శకులు బాలీవుడ్ స్టార్లతో సినిమాలు చేయడానికి రెడీ అవుతున్నారు. ఇటీవల సుకుమార్ కు బాలీవుడ్ ఖిలాడీ హీరో అక్షయ్ కుమార్ ఆఫర్ ఇచ్చాడని బాహాటంగానే వెల్లడించారు. ఇక హరీష్ శంకర్ బాలీవుడ్ లో హీరో సిద్ధార్ధ్ మల్హోత్రాతో `డీజే దువ్వాడ జగన్నాథమ్`ని రీమేక్ చేయడానికి రెడీ అయిపోతున్నారు. ఈ హీరోతో పాటు వరుణ్ ధావన్ కూడా మన టాలీవుడ్ డైరెక్టర్ తో బాలీవుడ్ ప్రేక్షకుల టేస్ట్ కి తగ్గ మాస్ ఎంటర్ టైనర్ ని చేయాలనుకుంటున్నాడు.
ఇదిలా వుంటే టాలీవుడ్ లో బ్లాక్ బస్టర్ లుగా నిలిచిని `అల వైకుంఠపురములో` చిత్రాన్ని కార్తీక్ ఆర్యన్ హిందీలో `షెహజాదా` పేరుతో రీమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. దీనితో పాటు `జెర్సీ` ఇప్పటికే రీమేక్ అయి రిలీజ్ కి రెడీగా వుంది. వీళ్లే కాకుండా చాలా మంది బాలీవుడ్ స్టార్స్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ తో సినిమాలు చేయడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. కొంత మంది ఇప్పటికే డైరెక్టర్లతో నేరుగా మంతనాలు జరుపుకుంటే మరి కొంత మంది నిర్మాతల ద్వారా టాలీవుడ్ డైరెక్టర్ లని సంప్రదిస్తున్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో టాలీవుడ్ వెంట బాలీవుడ్ పడుతోందంటున్నారు. ఇది టాలీవుడ్ కు దక్కుతున్న గౌరవమని, ఇది మంచి శుభ పరిణామామని సంతోశాన్ని వ్యక్తం చేస్తున్నాయి ఇండస్ట్రీ వర్గాలు.